స్థానిక ప్రభుత్వాలు

• ఆర్యుల కాలపు పరిపాలనలో సభ,సమితి ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన నిర్వహింపబడేవి .
• మౌర్యుల కాలం లో పట్టణ పరిపాలక సంస్థలు అభివృద్ధి చెందాయి .
• చోళుల యొక్క పాలన లో అత్యంత విశిష్టమైనది గ్రామాల స్వయం పరిపాలన
• చోళుల కాలం నాటి గ్రామ పరిపాలన గురించి మొదటి పరాంతకుని ఉత్తర మేరూర్ శాసనములో వివరించటం జరిగినది.
• తాటి ఆకులను బ్యాలెట్ పేపర్లుగా మట్టి కుండలను బ్యాలెట్ బాక్సులుగా ఉపయోగించి గ్రామ కమిటీ లను ఎన్నుకునేవారు .
• గ్రామాలలో సమస్యల కోసం ఏర్పాటు చేయబడిన పంచాస్ ఐదుగురు సభ్యుల బృదం నుంచి పంచాయితీ అనే పేరు వచ్చింది .
• జిల్లాను పరిపాలనా యూనిట్ గా తీసుకోని ఆంగ్లేయులు 1772 లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశ పెట్టారు .
• 1870 లో మేయో ఆర్ధిక వికేంద్రీకరణ తీర్మానం చేసారు .
• 1882 లో లార్డ్ రిప్పన్ చేసిన తీర్మానం స్థానిక సంస్థల పట్ల మాగ్నాకార్టాగా వర్ణిస్తారు.
1907 రాయల్ కమీషన్ :-
• చార్లెస్ హబ్ హౌస్ అధ్యక్షతన స్థానిక సంస్థల పనితీరుపై బ్రిటీషు ప్రభుత్వం ఈ కమీషన్ వేసింది .
• 1909 లో ఈ కమీషన్ తన నివేదికను సమర్పించింది .
• ఈ కమీషన్ సిఫారసుల ఆధారంగా 1909 లో మింటో మార్లే చట్టాం ప్రకారం స్థానిక సంస్థలకు ప్రత్యేక ఎన్నికలు జరిగాయి .
• 1919 నాటి మాంటెగ్ చేంస్ ఫర్డ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థలలో 1919 లో నాటికి ఇండియలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో 207 జిల్లా బోర్డులు ,584 తాలూకా బోర్డులు ఏర్పడినాయి .
• 1934 లో తాలూకా బోర్డులు రద్దు అయ్యి ,జిల్లా బోర్డులు కొనసాగాయి .
• 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు పూర్తి స్వాతంత్రం కల్పించింది .
• రాజ్యాంగంలో ని 40 వ ఆర్టికల్ గ్రామ పంచాయితీల ఏర్పాటును వివరిస్తుంది .
• స్వాతంత్రానంతరం 40 వ అధికరణం పంచాయితీరాజ్ సంస్థలు ఏర్పాటు చేయాలని సూచించింది .
సామాజికాభివృద్ధి కొరకు గ్రామాలలో చేయబడిన ప్రయోగాలు :-
శాంతినికేతన్ ప్రయోగం కలకత్తా రవీంద్ర నాధ్ ఠాగూర్
ఇటావా ప్రయోగం ఉత్తర ప్రదేశ్ లోని ఇటవా అనే గ్రామం అల్బర్ట్ మేయర్
నీలోఖరే ప్రయోగం హర్యానాలోని కర్నాల్ సమీపంలోని నీలోఖరే గ్రామం ఎస్.కే.డే
బరోడా ప్రయోగం బరోడా వి.టి.కృష్ణమూర్తి
సేవ్ గ్రాం ప్రయోగం వార్ధా మహారాష్ట్ర ఆచార్య వినోబా బావే జయప్రకాశ్ నారాయణ్
ఫిర్కా ప్రయోగం మద్రాస్ రాష్ట్రం టంగుటూరి ప్రకాశం
సమాజాభివృద్ధి ప్రయోగం దేశమంతటా టి.కృష్ణమాచారి సలహా మేరకు పోర్ట్ ఫౌండేషన్ సహాయంతో
సమాజ అభివృద్ధి పథకం :-
• 1951-56 మధ్య మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు .
• 75% ప్రజలు నివశించే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయటం దీని లక్ష్యం '1952 అక్టోబర్ 2 న ఈ పథకాన్ని ప్రారంభించారు .
• V.T. కృష్ణమాచారి ఈ పథకానికి ప్రణాళిక రూపొందించారు
• దీని ద్వారా దేశాన్ని బ్లాకులుగా విభజించారు .
• ఒక్కొక్క బ్లాకులో 100 గ్రామాలను చేర్చారు .
• CDP అమలుకు అమెరికా ఫోర్డ్ ఫౌండేషన్ వారు చేయూతనిచ్చారు .
జాతీయ విస్థరణ సేవా పథకం :-
• దీనిని 1953 అక్టోబర్ 2 న ప్రారంభించారు
• వ్యవసాయం ,విద్యా గ్రామీణ పరిశ్రమలలో సేవలు అందించుట దీని లక్ష్యం
బల్వంత్ రాయ్ మెహతా కమిటీ :-
• 1957 జనవరిలో ప్రణాళికా సంఘం నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బల్వంత్ రాయ్ మెహతా అధ్యక్షతన అధ్యయన బృందాన్ని ఏర్పరచింది .
• ఈ బృందం మూడంచెల పంచాయితీ వ్యవస్థను సూచించింది .
• ఈ కమిటీ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీ బ్లాక్ స్థాయిలో పంచాయితీ సమితి ,జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ లను సూచించింది .
• మండల పరిషత్ విధానాన్ని మొదటగా 1985 అక్టోబర్ 2 న కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టింది .
• అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే .
• మండల వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
• 1986 జనవరి 13 న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారు .
అశోక్ మెహతా కమిటీ :-
• మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 1977 డిశెంబర్ లో దీనిని రూపొందించింది .
• 1978 ఆగష్ట్ లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది .
• ఇందులో 132 సిఫారసులు ఉన్నాయి .
ముఖమైన కొన్ని సిఫారసులు :-
• రెండంచెల పథకాన్ని ప్రవేశపెట్టాలి
• ఎగువ స్థాయిలో జిల్లా పరిషత్
• దిగువ స్థాయిలో మండల పరిషత్
• 15 కి.మీ. లలో 20,000 జనాభా ఉన్న గ్రామాల సముదాయాన్ని ఒక మండలంగా ఏర్పాటు చేయాలి .
• పంచాయితీరాజ్ ఎన్ని కలలో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనాలి .
• పంచాయితీరాజ్ సంస్థలు పన్నులు విధించవచ్చు .
• పంచాయితీ రాజ్ సంస్థలు రద్దయిన ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి .
• పంచాయితీరాజ్ శాఖకు మంత్రిని నియమించాలి.
• SC,ST లకు జనాభా ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలి
• మండల వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రం కర్ణాటక
• ఆంధ్ర ప్రదేశ్ లో నందమూరితారక రామారావు 1986 జనవరి 13 న మండల స్థాయిని ప్రవేశ పెట్టాడు.
• 339 తాలూకాలను 1104 మండలాలుగా విభజించారు .
దంత్ వాలా కమిటీ :-
• మాధ్యమిక స్థాయి ప్రణాళిక అధ్యయనానికి దీనిని నియమించారు .
• ఇందులో సర్పంచులను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి .
• జిల్లా స్థాయి ప్రణాళికా వికేంద్రీకరణ జరగాలి .
• ప్రణాళికా వికేంద్రీకరణలో కలెక్టర్ ముఖ్య భూమిక పోషించాలి .
CH.హనుమంతరావ్ కమిటీ (1984):-
• జిల్లా స్థాయి ప్రణాళికపై నివేదిక సమర్పించింది .
• కలెక్టర్ లేదా మంత్రి అధ్యక్షతన జిల్లా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలి .
• జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో కలెక్టర్ సమన్వయ కర్తగా వ్యవహరించాలి
GVK రావ్ కమిటీ:-
• గ్రామీణ అభివృద్ధి పై పరిపాలన పరమైన ఏర్పాట్లకోసం ఏర్పడినది .
• ఇందులో
• పంచాయితీరాజ్ సంస్థలకు నిర్ణీత కాలానికి ఎన్నికలు జరగాలి .
• బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పదవిని రద్దు చేయాలి .
• DDO పదవి ఏర్పాటు -ఇతను CEO గా వ్యవహరిస్తాడు .
• జిల్లా కేంద్రంగా చేసుకోని ప్రణాళికలను అమలుపరచాలి .
LM సింఘ్వీ కమిటీ:-
• దీన్ని రాజీవ్ గాంధీ నియమించాడు .
• పంచాయితీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్దత కల్పించాలి .
• గ్రామసభకు ప్రాధాన్యం ఇవ్వాలి .
• న్యాయ పంచాయితీలను ఏర్పాటు చేయాలి .
• సాధ్యమైనంత ఎక్కువ వనరులను పంచాయితీలకు కల్పించాలి .
• ఈ కమిటీ ఆధారంగా రాజీవ్ గాంధీ 64 సవరణ బిల్లును ప్రవేశపెట్టాడు .ఇది వీగిపోయింది .
P.Kతుంగన్ కమిటీ
• నాటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pk తుంగన్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది .
• దీనిని రాజీవ్ గాంధీ నియమించాడు .
• ఈ కమిటీ ఆధారంగా 64,65 బిల్లులు ప్రతిపాదించబడినాయి .
• 1989 64 బిల్లును లోక్ సభ ఆమోదించింది .రాజ్య సభ తిరస్కరించింది .
• 65 బిల్లు పరిశీలన లో ఉండగానే లోక్ సభ రద్దు అయ్యింది .
• ఈ విధంగా 64,65 బిల్లులు అమలులోకి రాలేదు .
• 64 బిల్లు 73 గాను మరియు 65 బిల్లు 74 గాను అమలుచేయబడినది .
• ఏప్రియల్ 24 జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం .
73 వ రాజ్యాంగ సవరణ చట్టం :-
• 73 వ రాజ్యాంగ సవరణను ప్రవేశ పెట్టినప్పుడు భారత దేశ ప్రధాని -పి.వి.నరసిం హారావు
• ఈ రాజ్యాంగ సవరా 1993 ఏప్రియల్ 24 న అమలు లోకి వచ్చింది .
• ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చట్టం 1994 జనవరి 25 న అమలులోకి వచ్చింది .
• ఈ సవరణ పంచాయితీ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించింది .
• 9 వ భాగంలో 243 A నుండి 243 O వరకు పంచాయితీ సంస్థలకు సంబంధించిన అంశాలు పొందుపరిచారు .
• ఈ చట్టం 11 వ షెడ్యూల్ నూతనంగా చేర్చింది .
• అందులో పంచాయితీలు నిరర్తించవలసిన 29 విధులను పొందుపరచింది .
• 20 లక్షల కన్నా తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలలో రెండంచెల వ్యవస్థలుంటాయి .
• 20 లక్షల జనాభాదాటితే 3 అంచెల వ్యవస్థ ఉంటుంది .
• జమ్మూ కాశ్మీర్ లో ఒక అంచె వ్యవస్థ ఉంటుంది .
• నాగాలాండ్ ,మిజోరాం,మేఘాలయా రాష్ట్రాలకు ఈ చట్టం వర్తించదు .
• అచ్చట గిరిజన మండళ్ళు స్థానిక పాలనను నిర్వర్తిస్తాయి .
• పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతంలోని గూర్ఖా హిల్ కౌన్సిల్ ,మణిపూర్ లో జిల్లా కౌన్సిల్ గల ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు .
• ఈ చట్టం లోని ముఖ్య నిబంధనలు
ఆర్టికల్ 243 :-
గ్రామ పంచాయితీ నిర్వచనం
243 ఎ
• గ్రామసభ
• గ్రామసభకు సర్పంచ్ అధ్యక్షుడు ఇతను లేని యెడల ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు .
• గ్రామంలో ఉన్న వయోజనులు/ఓటర్లు గ్రామసభలో సభ్యులు
• సంవత్సరానికి కనీసం రెండుసార్లు గ్రామ సభ సమావేశంకావాలి
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భం గా
ఏప్రిల్ -14 అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా
• గ్రామసభను నిర్వహించని యెడల కలెక్టర్ సర్పంచ్ ని తొలగించవచ్చు
• గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలను పంచాయితీ కార్యదర్శి అమలు పరుస్తాడు .
స్వరూపం :-
• మనదేశం లో 3 అంచెల వ్యవస్థ
• ఎగువ స్థాయిలో జిల్లా పరిషత్
• మాధ్యమిక స్థాయిలో మండల పరిషత్
• దిగువ స్థాయిలో గ్రామ పంచాయితీ
ఆర్టికల్ 243 C నిర్మాణము :-
• గ్రామపంచాయితీ సర్పంచ్ ను ప్రత్యక్షంగా
• మండల/జిల్లా పరిషత్ అధ్యక్షులను పరోక్షంగా
• మూడు స్థాయిలలో ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు .
ఆర్టికల్ 243 D
రిజర్వేషన్ లు :-
• SC,ST లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్
• వీరికిచ్చే రిజర్వేషన్ లో 1/3 వంతు మహిళలు ఉండాలి .
• మన రాష్ట్రం లో మహిళలకు 50% రిజర్వేషన్ ఉంది .
• BC లకు రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుంది .
పదవీ కాలం
పదవీకాలం - 5 సంవత్సరాలు
• వ్యవస్థ రద్దైన 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి .
• 6 నెలల పదవీకాలం మాత్రమే ఉందనగా వ్యవస్థ రద్దు అయితే ఎన్నికలు అవసరంలేదు.
అర్హతలు,అనర్హతలు :-
• 21 సంవత్సరాల వయస్సు ఉండాలి
• పోటీ చేసే వ్యవస్థలో ఓటర్ గా నమోదై ఉండాలి .
• 1995 మే 30 తర్వాత ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండరాదు .
అధికారాలు,విధులు:-
• 11 వ షెడ్యూల్ పంచాయితీ రాజ్ సంస్థలకు 29 పరిపాలనా అంశాలను బదలాయించింది .
• వీటిలో 12 తప్పనిసరి 17 ఐచ్చిక విధులు
తప్పనిసరిగా నెరవేర్చాల్సిన విధులు :-
త్రాగునీరు ,డ్రైనేజి,వీధి దీపాలు ,పారిశుధ్యం
ఐఛ్చిక విధులు - గ్రంధాలయాలు ,మ్యూజియంలు,ఉద్యాన వనాలు,కళాక్షేత్రాలు
ఆదాయ మార్గాలు
పంచాయితీ రాజ్ సంస్థలు ఈ క్రింది విధంగా నిధులను సమకూర్చుకుంటాయి .
కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల నుంచి వచ్చే ఆదాయాలు/నిధులు
దాతలు ఇచ్చే విరాళాలు
భవన సముదాయాల నుండి వచ్చే అద్దెలు
సంతల నుండి
ఇంటిపన్ను ,నీటి పన్ను ,మార్కెట్ లపై పన్ను
• పంచాయితీరాజ్ సంస్థలో పన్ను విధించే అధికారం ఒక గ్రామపంచాయితీ కి మాత్రమే ఉంది .
రాష్ట్ర ఆర్ధిక సంఘం :-
• దీనిని గవర్నర్ నియమిస్తాడు .
• పదవీ కాలం 5 సంవత్సరాలు
• ప్రభుత్వం పంచాయితీ రాజ్ సంస్థలకు మంజూరు చేయవలసిన నిధుల పట్ల మార్గదర్శకాలు రూపొందిస్తుంది .
• సహాయక గ్రాంట్లు సకాలం లో అందేట్లు చూస్తుంది .
• నిధుల మంజూరు కొసం కేంద్రానికి సిఫారసులు చేస్తుంది .
• ఇది తన నివేదికను గవర్నర్ కి సమర్పిస్తుంది .
• గవర్నర్ ,శాసన సభకు సమర్పిస్తాడు
• ఆంధ్ర ప్రదేశ్ లో ఇది 1994 జూన్ 24 న ఏర్పడినది .
ఆడిటింగ్,అకౌంటింగ్ :-
• పంచాయితీరాజ్ సంస్థల ఖర్చులు,ఖాతాలను తనిఖీచేయటం
• రాష్ట్ర ఎన్నికల సంఘం
• ఇది రాష్ట్ర స్థాయిలో స్థానిక సమ్షలకు ఎన్నికలు నిర్వహిస్తుంది .
• రాష్ట్ర ఎన్నికల అధికారులను గవర్నర్ నియమిస్తాడు .
• పదవీకాలం 5 సం వత్సరాలు
• 1994 జూన్ 18 న ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడినది
• మొదటి కమీషనర్ కాశీ పాండ్యన్
• కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపచేయుట
మినహాయించబడిన ప్రాంతాలు :-
• 244(1) ప్రకారం చేర్చబడిన షెడ్యూల్డ్ ప్రాంతాలు
• 244(2) ప్రకారం ఉన్న గిరిజన ప్రాంతాలకు వర్తించదు .
• మిజోరాం,మేఘాలయ ,నాగాల్యాండ్ ,జమ్మూ-కాశ్మీర్ లకు వర్తించదు .
• పశ్చిమ బెంగాల్ లోని గూర్ఖాలాండ్ కి వర్తించదు .
పాత శాసనాల కొనసాగింపు :-
• ఈ చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి 1 సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాత శాసనాలను అమలు చేసుకోవచ్చు .
• 73 వ సవరణ చట్టం మౌళిక స్వరూపం దెబ్బతినకుండా రాష్ట్రాలు కొత్త చట్టాలను చేసుకోవచ్చు .
• అంధ్ర ప్రదేశ్ 73 వ చట్టానికి లోబడి B.P.R విఠల్ కమిటీ ఆధారంగా ఆంధ్రప్రదేస్ పంచాయితీ రాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసారు .
• ఈ చట్టం 1994 మే 30 న అమలులోకి వచ్చింది .
• దీని ఆధారంగా జిల్లా,మండల పరిషత్ ,గ్రామ పంచాయితీలు పునర్నిర్మాణం చేయబడినాయి .
• పంచాయితీరాజ్ ఎన్నికలలో కోర్ట్ లు జోక్యం చేసుకొనరాదు .
• పంచాయితీరాజ్ ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు .
• ఇందుకోసం ఎన్నికల ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలి .
• మన రాష్ట్రం లో మున్సిఫ్,మేజిస్ట్రేట్ కోర్ట్ లు వివాదాలన్ని పరిష్కరిస్తాయి .
• ఈ సందర్భంలో ఇవి న్యాయస్తానాలు గా కాకుండ ట్రిబ్యూనల్స్ గా వ్యవహరిస్తాయి .
• ఈ ట్రిబ్యూనల్స్ రిజర్వేషన్లు,ఎన్నికల షెడ్యూల్ ను పరిశీలించవు .
• గ్రామసభ పంచాయితీ అధ్యక్షుడు
కర్నాటక -అధ్యక్ష
సిక్కిం సభాపతి
బీహార్ - ముఖియా
తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ -ప్రెసిడెంట్
హిమాచల్ ప్రదేశ్ ,మణిపూర్,మిజోరాం ,మేఘాలయ, నాగాలాండ్ ,త్రిపుర,ఉత్తర ప్రదేశ్ , పశ్చిమ బెంగాల్
ప్రధాన్
• బ్లాక్ స్థాయి మండల పరిషత్ గల పేర్లు
ఆంధ్ర ప్రదేశ్ -మండల పరిషత్
అరుణాచల్ ప్రదేశ్ -అంచల్ కా సమితి
గుజరాత్ ,కర్ణాటక - తాలూకా పంచాయితీ
కేరళ - బ్లాక్ పంచాయితీ
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్ క్షేత్ర పంచాయతీ
తమిళనాడు,చత్తీస్ ఘడ్ - పంచాయితీ ,యూనియన్ కౌన్సిల్
మధ్య ప్రదేశ్ -జనపథ్ పంచాయితీ
అసోం - అంచాలిక పంచాయితీ
బీహార్,జార్ఖండ్ ,హర్యానా,హిమాచల్ ప్రదేశ్,త్రిపుర ,పశ్చిమ బెంగాల్ ,మహారాష్ట్ర ,ఒడిశా ,పంజాబ్, రాజస్థాన్ -పంచాయితీ సమితి
మండల స్థాయి కార్య నిర్వహణాధికారి:-
ఆంధ్ర ప్రదేశ్ -మండల్ పరిషత్ అధికారి
తమిళనాడు -కమీషనర్
కేరళ -సెక్రటరీ
రాజస్థాన్ - వికాస్ అధికారి
ఉత్తర ప్రదేశ్ - ఖండ్ పంచాయితీ వికాస్ అధికారి
హర్యానా,పంజాబ్,హిమాచల్ ప్రదేశ్ - బ్లాక్ డెవెలప్ మెంట్ అండ్ పంచాయితీ ఆఫీసర్
మండల పరిషత్ :-
• ఆంధ్ర ప్రదేశ్ లో మండలాల సంఖ్య - 664
• మండల వార్డు మెంబర్లను MPP లు అంటారు .
• MPTC లను అందరూ MPP ను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు .
• ఆంధ్ర ప్రదేశ్ లో MPTC ల సంఖ్య 9923
• మండలపరిధిలో రాజకీయాధిపతి MPP.
• మండలపరిధిలో పరిపాలనాధిపతి MDO.
జిల్లా పరిషత్ :-
• ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లాల సంఖ్య 13.
• జిల్లా పరిషత్ వార్డు మెంబర్ లను ZPTC లు అంటారు .
• ZPTC లు అందరు ZPP ని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు .
• జిల్లా పరిధిలో రాజకీయాధిపతి చైర్మన్
• మండలపరిధిలో పరిపాలనాధిపతి CEO.
74 వ రాజ్యాంగ సవరణ చట్టం :-
• భారత దేశం లో మొదటి మున్సిపల్ కార్పోరేషన్ ను 1687 లో మద్రాస్ లో బ్రిటిషువారు ఏర్పాటు చేసారు .
• 1726 లో బాంబే మరియు కలకత్తా కార్పోరేషన్ లను ఏర్పాటు చేసారు .
• 74 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించుటకు 1992 లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు .
• ఈ చట్టం 1993 జూన్ 1 నుండీ దేశవ్యాప్తం గా అమలులోకి వచ్చింది
• రాజ్యాంగంలో 9A భాగాన్ని ఈ చట్టం ద్వారా చేర్చారు .
• ఇందులో 243 P నుంచి 243 ZG వరకు 18 నిబంధనలు పట్టణ పరిపాలక సంస్థల గురించి తెలుపుతున్నాయి .
• ఈ చట్టం 12 వ షెడ్యూల్ ని చేర్చింది .
• ఇందులో పట్టణ సంస్థలకు 18 అంశాలపై అధికారాలను ఇచ్చింది .
• 243 R ప్రకారం 3 రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి .
• నగర పంచాయితీ -గ్రాం ప్రాంతం నుంచి పట్టణం గా మారుతున్న నగరం లో ఏర్పాటు చేస్తారు
• మున్సిపల్ కౌన్సిల్ -తక్కువ జనాభా ఉన్న పట్టణాలలో ఏర్పాటు చేస్తారు .
• మున్సిపల్ కార్పోరేషన్ పెద్ద పట్టణాలలో ఏర్పాటు చేస్తారు .
• 243 V నిబంధన జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళికా కమిటీల ఏర్పాటుని తెలుపుతుంది .
• ఈ నిబంధన ఢిల్లీ ప్రాంతానికి వర్తించదు
• 243 V నిబంధననందు 12 షెడ్యూల్ లో పేర్కొన్న 18 అంశాలు కలవు .
ఆంధ్ర ప్రదేస్ మరియు తెలంగాణాలో పంచాయితీరాజ్ సంస్థలు :-
• రెండు రాష్ట్రాలలో 1994 చట్టం అమలులో ఉంది .
• 1994 నుండి అమలు లో ఉన్న పంచాయితీ రాజ్ సంస్థలు
గ్రామపంచాయితీ
మండల పరిషత్
జిల్లా పరిషత్
• సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం లేదు .అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడితే జిల్లా కలెక్టర్ తొలగిస్తాడు .
• సర్పంచ్,పంచాయితీ మెంబర్ల పదవీకాలం 5 సం||
• గ్రామ పంచాయితీలోవార్డులు కనిష్టంగా 5 గరిష్టంగా 21 ఉంటాయి
• జిల్లా పరిషత్ చైర్మన్,వైస్ చైర్మన్ లను ZPTC లు ఎన్నుకుంటారు .
• ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాలలో అన్ని రకాల స్థానిక సంస్థల పదవులకు పోటీ చేయుటకు కనీస వయస్సు -21 సంవత్సరాలు
• పదవీకాలం - 5 సంవత్సరాలు
• ఆంధ్ర ప్రదేస్ మండలాల సంఖ్య 664 ,తెలంగాణా రాష్ట్రం లో మండలాలు 459
ఇతర నగర పాలక సంస్థలు :-
కంటోన్మెంట్ బోర్ద్ :-
• సైనిక శిబిరాలు/కుటుంబాలు నివాసముండే ప్రాంతాల్లో ఈ బోర్డులను ఏర్పాటు ఏస్తారు .
• సైనిక స్థావరాలకు సంబంధించిన వ్యవస్థ ప్రాచీన భారత దేశంలో ప్రాముఖ్యత కలిగిన అంశం .
• కౌటిల్యుని అర్ధశాస్త్రం లో దండ కు అత్యంత ప్రాధాన్యము ఉంది
• 1924 లో ఒక చట్టం ద్వారా కంటోన్మెంట్ బోర్డ్ ఏర్పడినది .
• ప్రస్తుతం ఇండియాలో 63 బోర్డులు ఉన్నాయి .
• సికిందరాబాద్ లో కంటోన్మెంట్ బోర్డు ఉంది .
• ఈ సంస్థలో రాజకీయ పార్టీల జోక్యం ఉండదు .
• సైనిక ఉన్నతాధికారి దీనికి బాధ్యత వహిస్తాడు .
• ఈ సంస్థ పదవీకాలం 3 సంవత్సరాలు
• ఇవి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి .
పోర్టు ట్రస్ట్ :-
• నావికాదళం నౌకానిర్మాణ పరిశ్రమ ఉన్నచోట వీటిని ఏర్పాటు చేస్తారు
• ప్రస్తుతం 11 ఉన్నాయి .
• ఇవి రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనం లోకి వస్తాయి .
• రాజకీయ పార్టీల ప్రమేయం ఉండదు .
నోటిఫైడ్ ఏరియా :-
• శీఘ్రగతిన అభివృద్ధి చెందే ప్రాంతాలు
• రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ లో ప్రకటించటం ద్వారా ఇది ఏర్పడుతుంది .
• ఈ కమిటీ సభ్యులందరినీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయిస్తుంది
Town Area
• ఇది అర్ధ మున్సిపాలిటీ వంటిది .
• ఈ సంస్థలను చిన్న పట్టణాలలో ఏర్పాటు చేస్తారు .
• ఇవి ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ లో కలవు .
• రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా Town Area కమిటీ లను ఏర్పాటు చేస్తుంది .
• ఇందులో కొంతమంది ప్రతినిధులు ప్రజలచే మరి కొంతమంది ప్రభుత్వంచే నియమించబడతారు .
Town Ship
• పారిశ్రామిక అభివృద్ధి ఉన్న చోట వీటిని ఏర్పాటు చేస్తారు .
• జం షెడ్ పూర్ ,రూర్కెలా ,భిలాయ్,దుర్గాపూర్ ,విశాఖ,హైదరాబాద్ లలో కలవు .
• ఈ టౌన్ షిప్ లు ఏ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే అది అక్కడ పాలనా బాధ్యత లను చూస్తుంది .
• ఆకడి సేవలకు అయ్యే ఖర్చుని సదరు పరిశ్రమ భరిస్తుంది .
స్థానిక సంస్థలు ఇతర అంశాలు :-
• స్థానిక సంస్థలలో మహిళలకు 50% స్థానాలు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం బీహార్
రెండవ రాష్ట్రం -మధ్య ప్రదేశ్
• 1978 నుండి స్థానిక సంస్థలకు నిర్ణీత కాలం లో ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రం -పశ్చిమ బెంగాల్
• ప్రస్తుతం దేశ వ్యాప్తం గా 63 కంటోన్మెంట్ బోర్డ్ లు కలవు .
• కంటోన్మెంట్ అధికారిని రాష్ట్రపతి నియమిస్తాడు
• అతి పెద్ద కంటోన్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ లోని బొల్లారం లో కలదు .
• దేశ వ్యాప్తం గా 576 జిల్లా పరిషత్ లు 6320 బ్లాక్ పంచాయితీలు ,249,123 గ్రామ పంచాయితీలు కలవు .
• అత్యధిక స్థానిక సంస్థలున్న రాష్ట్రం - ఉత్తర ప్రదేశ్
• అతి తక్కువ పంచాయితీలు దాద్రానగర్ హవేలీ లో కలవు .
• స్థానిక సంస్థల ప్రతినిధులను రీకాల్ చేసే పద్ధతి మధ్య ప్రదేశ్ లో కలదు .
• స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పనిసరి ఓటింగ్ ప్రవేశ పెట్టిన రాష్ట్రం -గుజరాత్