రాష్ట్ర శాసనసభ

• రాష్ట్ర స్థాయిలో ద్విసభా విధానాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం కేంద్ర స్థాయిలో ద్విసభాచట్టాన్ని 1919 మాంటెగ్ చెంస్ ఫర్డ్ చట్టం ప్రవేశపెట్టింది .
• రాజ్యాంగంలోని 6 వ భాగంలోని 168 నుండి 212 వరకు గల నిబంధనలు రాష్ట్ర శాసన సభగురించి తెలుపుతున్నాయి.
• 168 వ నిబంధన ప్రకారం రాష్ట్ర శాసన సభలో రాష్ట్ర గవర్నర్,ఎగువ సభలు,దిగువ సభలు ఉంటాయి.
• రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర శాసన సభలో సభ్యుడు కాడు కానీ అంతర్భాగం.
• అర్టికల్ 173 ప్రకారం రాష్ట్ర చట్ట సభలకు పోటీ చేయుటకు ఉండవలసిన అర్హతలు
• భారత పౌరుడై ఉండాలి.
• శాసన మండలికి పోటీ చేయాలి అంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి.
• విధాన సభకు పోటీ చేయాలి అంటే 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
• ఆర్టికల్ 191 ప్రకారం రాష్ట్రంలోని చట్టసభలకు పోటీ చేయుటకు అనర్హత నియమావళి
ఆదాయం వచ్చే ప్రభుత్వ పనులు చేయరాదు .
మతిస్థిమితం లేదని కోర్ట్ నిర్ధారించినప్పుడు
విడుదలకాని ఋణగ్రస్థుడైఉన్నప్పుడు
విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నప్పుడు
• ఆర్టికల్ 190 ప్రకారం శాసన సభ్యుడి సీటు ఖాళీ ఆయ్యే సందర్భం
• ఆర్టికల్ 191 లో పేర్కొన్న విధంగా ఉంటే శాసన సభ సీటు ఖాళీ అవుతుంది.
• రాష్ట్రంలో ఉండే రెండు సభల్లో సభ్యత్వం ఉంటే ఒక సభకు రాజీనామా చేయాలి .
• శాసన సభ సమావేశాలకు 60 రోజులపాటు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది.
రాష్ట్ర ఎగువ సభ :-
• 169 వ నిబంధన విధాన పరిషత్ ఏర్పాటు రద్దు గురించి తెలుపుతుంది.
• రాష్ట్ర విధాన సభ 2/3 వంతు మెజారిటీ తో ఒక తీర్మానం చేస్తే ,ఆ తీర్మానం ను పార్లమెంట్ ధృవీకరిస్తే రాష్ట్రపతి ఎగువ సభ ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.
• ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ రెండు రాష్ట్రాలలో విధాన పరిషత్ లు ఏర్పాటు చేయబడ్డాయి .
• ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ ఏర్పాటు కు పార్లమెంట్ 1957 లో ఆమోదించింది .
• మొదటి విధాన పరిషత్ ఛైర్మన్ -మాడపాటి హనుమంతరావు
• 1985 లో విధాన పరిషత్ రద్దు చేశారు .అప్పటి ముఖ్యమంత్రి .ఎన్.టి.రామారావు .
• తిరిగి 22 సంవత్సరాల తర్వాత 2007 లో ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ పునరుద్ధరించబడినది .
• నాటి ముఖ్యమంత్రి వై .ఎస్.రాజశేఖరరెడ్డి
• ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014 లో విధాన పరిషత్ ను విభజించారు .
• విభజనకి పూర్వం ఆంధ్ర ప్రదేశ్ లో శాసన మండలి సభ్యుల సంఖ్య -90
• విభజనానంతరం - 50 ,ప్రస్తుతం 58
• తెలంగాణ విధాన పరిషత్ 2014 జూన్ 2 న ఏర్పడింది .
• మొత్తం సభ్యుల సంఖ్య 40 .
విధాన పరిషత్ నిర్మాణం :-
• విధాన పరిషత్ సభ్యులు ప్రత్యక్ష ,పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు.
• విధాన సభ సభ్యుల ద్వారా ఎన్నిక అయ్యేవారు - 1/3 వ వంతు
• స్థానిక సంస్థల ద్వారా ఎన్నిక అయ్యేవారు - 1/3 వ వంతు
• ప్రభుత్వ ఉపాధ్యాయులచే ఎన్నికయినవారు - 1/12 వంతు
• పట్టభద్రులచే ఎంపిక అయ్యేవారు 1/12
• గవర్నర్ చే నామినేట్ చేయబడేవారు 1/6 వంతు
• శాసన మండలి సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు .
విధాన పరిషత్ అధికారాలు :-
• రాష్ట్ర,ఉమ్మడి జాబితాలోని అంశాలపై పై చట్టాల ప్రక్రియలో పాల్గొంటుది .
• విధాన సభ ఆమోదించిన బిల్లును మొదటి సారి 3 నెలలు ,2 వసారి ఒక నెల ,మొత్తం నాలుగు నెలలు ఆపకలదు .
• విధాన పరిషత్ మరియు విధాన సభల మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడితే సం యుక్త సమావేశం జరగదు.
• అనగా విధాన సభ నిర్ణయం చెల్లుతుంది .
రాష్ట్ర విధాన సభ :-
• రాష్ట్రం లోని దిగువ సభ విధాన సభ
• ఆర్టికల్ 170 ప్రకారం రాష్ట్ర విధాన సభలో సభ్యులు కనిష్టంగా 60 మంది ,గరిష్టంగా 50మందికి మించకుండాఉండవచ్చు .
• రాష్ట్ర శాసన సభ సభ్యుల సంఖ్య జనాభా పై ఆధారపడి ఉంటుంది .
• ప్రస్తుతం ఉన్న్నస్థానాలు 1971 జనాభా లెక్కల అధారంగా నిర్ణయించినవి .
• ఈ సంఖ్య 2026 వరకు మారదు
• రాజ్యాంగం నిర్ణయించిన కనిష్ఠ సభ్యుల కంటే తక్కువ కలిగి ఉన్న రాష్ట్రాలు -సిక్కిం ,మిజోరాం,గోవా
• విధాన సభలు కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు
ఢిల్లీ 70 పాండిచ్చేరీ 30
• విధాన సభకు పోటే చేయుటకు కనీసం 25 సం || వయస్సు కలిగి ఉండాలి .
• విధాన సభ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత రద్దు అవుతుంది.
• విధాన సభ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు
• జమ్మూ కాశ్మీర్ విధాన సభ్యుల పదవీ కాలం - 6 సంవత్సరాలు
స్పీకర్స్ ,డిప్యూటీ స్పీకర్లు :-
• విధాన సభ కార్యకలాపాల నిర్వహణకు స్పీకర్,డిప్యూటీ స్పీకర్లు ఉంటారని 178 వ నిబంధన తెలుపుతుంది .
• సభలో స్పీకర్ నిర్ణయాలను న్యాయస్థానంలో ప్రశ్నించలేరు .
• శాసన సభ కార్యక్రమాల నిర్వహణ హిందీ,ఇంగ్లీషు భాషలలో కొనసాగుతాయి అని 210 వ నిబంధన తెలుపుతుంది.
• అయితే సభాద్యక్షుల అనుమతితో మాతృభాషలో మాట్లాడవచ్చు.
• ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ విధాన సభ్యులు ఇంగ్లీష్,హిందీ, తెలుగు మరియు ఉర్దూ లో ప్రసంగించవచ్చు .

Name of the States/ UTs

Legislative Assembly Seats

Legislative Council Seats

Andhra Pradesh

175

58

Arunachal Pradesh

60

-

Assam

126

-

Bihar

243

75

Chhattisgarh

90

-

Goa

40

-

Gujarat

182

-

Haryana

90

-

Himachal Pradesh

68

-

Jammu and Kashmir

87

36

Jharkhand

81

-

Karnataka

224

75

Kerala

140

-

Madhya Pradesh

230

-

Maharashtra

288

78

Manipur

60

-

Meghalaya

60

-

Mizoram

40

-

Nagaland

60

-

Odisha

147

-

Punjab

117

-

Rajasthan

200

-

Sikkim

32

-

Tamil Nadu

234

-

Telangana

119

43

Tripura

60

-

Uttar Pradesh

403

100

Uttarakhand

70

-

West Bengal

294

-

Andaman and Nicobar

-

-

Chandigarh

-

-

Dadra and Nagar Haveli

-

-

Daman and Diu

-

-

NCR, Delhi

70

-

Lakshadweep

-

-

Puducherry

30

-