ముఖ్య మంత్రి -మంత్రి మండలి

• నిబంధన 163 (1) ప్రకారం గవర్నర్ కు తన విధుల నిర్వహణలో సలహాలిచ్చుటకు ముఖ్య మంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది.
• 164 (1) ప్రకారం ముఖ్యమంత్రి ని గవర్నర్ నియమిస్తాడు .
• ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తాడు .
• 91 వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రుల సంఖ్య విధాన సభ సభులలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం కి మించరాదు .
• కనీసం ఉండవలసిన మంత్రుల సంఖ్య - 12
• ముఖ్యమంత్రి గా లేదా మంత్రి గా నియమించ బడాలి అంటే ఆ రాష్ట్ర విధాన పరిషత్ లేదా విధాన మండలి సభ్యుడై ఉండాలి .
• సభ్యుడు కాకపోతే 6 నెలాలోపు సభ్యత్వం పొందాలి .
• ముఖ్యమంత్రి,మంత్రులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి .
• మంత్రి మండలి విధాన సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది .
ముఖ్యమంత్రులు -ప్రత్యేకతలు :-
• భారత దేశం లో తొలి మహిళా ముఖ్య మంత్రి -సుచేతా కృపలాని ఉత్తర ప్రదేశ్
• రెండవ మహిళా ముఖ్యమంత్రి -నందినీ శతపతి ఒడిశా
• తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి -మాయావతి ,ఉత్తర ప్రదేశ్
• భారత దేశం లో మొదటి దళిత వర్గాలకు చెందిన ముఖ్యమంత్రి - దామోదరం సంజీవయ్య ఆంధ్ర ప్రదేశ్
• తక్కువ వయస్సులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు -ప్రఫుల్ల కుమార్ మెహంత (అస్సాం) 31 సం ,మధు కోడా 35 సంవత్సరాలు జార్ఖండ్
• దేశం లో ఎక్కువ కాలం ముఖ్య మంత్రి గా పని చేసినది -పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రిగా జ్యోతీ బసు 5 సార్లు 23 సంవత్సరాలు
• ఏక కాలం లో ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినవారు -ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులుగా కళ్యాణ్ సింగ్,జగదాంబికా పాల్
• అతి పెద్ద మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి 108 మంది కళ్యాణ్ సింగ్ ఉత్తర ప్రదేశ్
• రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసినవారు -
టంగుటూరి ప్రకాశం - మద్రాసు ,ఆంధ్ర రాష్ట్రాలకు
• అతి తకువ కాలం ముఖ్య మంత్రిగా చేసినది - జగదాంబికాపాల్ ఉత్తర ప్రదేశ్ ఒక్క రోజు మాత్రమే
• ముఖ్యమంత్రి అయిన మొదటి సినీ నటుడు - M.G. రామచంద్రన్
• తక్కువ వయస్సులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించినది - సుష్మా స్వరాజ్ 25 సం
ఆంద్ర,తెలంగాణా ముఖ్యమంత్రుల విశేషాలు:-
• ఆంద్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి -టంగుటూరి ప్రకాశం
• హైదరాబాద్ రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి -బూర్గుల రామకృష్ణారావు
• ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి -నీలం సంజీవరెడ్డి
• ఆంధ్ర ప్రదేశ్ కు దీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేసినది నారాచంద్రబాబు నాయుడు
• అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసినది - నాదెండ్ల భాస్కర రావు
• విధాన పరిషత్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రులు అయినవారు -
భవనం వెంకట రామి రెడ్డి
K.రోశయ్య
• ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్య మంత్రి -నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
• తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి - కె.చంద్రశేఖర రావు