రాష్ట్ర ప్రభుత్వం - గవర్నర్

• రాజ్యాంగం లోని 6 భాగం లోని 152 నుండి 231 వరకు గల నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి తెలుపుతాయి .
• 6 వ భాగం వర్తించని రాష్ట్రం జమ్మూ కాశ్మీర్
గవర్నర్ :-
• గవర్నర్ వ్యవస్థను 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించారు .
• గవర్నర్ నియామకం కెనడా రాజ్యాగం నుంచి గ్రహించారు .
• 6 భాగం లోని 2 వ అధ్యాయం లోని 153-161 నిబంధనలు గవర్నర్ గూర్చి తెలుపు తున్నాయి .
• ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు -ప్రకరణ 153
• 7 వ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు లేదా అంతకటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి ఉమ్మడి గవర్నర్ గా కొనసాగవచ్చు .
• అప్పుడు రెండు రాష్ట్రాలు వేతనం ను సమానంగా భరిస్తాయి .
• గవర్నర్ గా నియమించాలంటే కనీసం 35 సం|| నిండి ఉండాలి .లాభదాయక పదవి కలిగి ఉండరాదు .
• ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదే రాష్ట్రానికి గవర్నర్ గా నియమించరాదు .
• గవర్నర్ పదవీకాలం 5 సంవత్సరాలు .కాని రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకే పదవిలో కొనసాగుతారు .
• రాష్ట్రపతి ఆదేశాలద్వారా గవర్నర్ ని తొలగించవచ్చును .ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయవచ్చును .
• గవర్నర్ చే హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి లేదా సీనియర్ న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు .
• గవర్నర్ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి .
• గవర్నర్ కు నెలకు ₹350,000 జీతం లభిస్తుంది .
• గవర్నర్ నివాసాన్ని రాజ్ భవన్ అంటారు .
గవర్నర్ యొక్క అధికారాలు :-
• రాజ్యాంగంలోని 153 వ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు .
• రాజ్యాంగంలోని 7 వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒకే వ్యక్తిని రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించవచ్చు .
• గవర్నర్ రాష్ట్రానికి సంబధించి ముఖ్య కార్య నిర్వహణాధికారి .
• అయితే రాష్ట్రపతి వలే ఇతను కూడా నామమాత్రపు కార్యనిర్వహాణాధికారియే .
• గవర్నర్ మంత్రి మండలి సలహాలను తీసుకుంటాడు.
• గవర్నర్ రాష్ట్ర వ్యవహారాలపై ప్రతి 15 రోజులకి ఒకసారి కేంద్రానికి నివేదిక పంపిస్తాడు .
• కేంద్ర మంత్రివర్గ సలహాలను అనుసరించి రాజ్యాంగంలోని 155 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ ను నియమిస్తాడు .
• గవర్నర్ పదవిలో ఉండగా అతనిపై ఏ విధమైన క్రిమినల్ కేసులు పెట్టకూడదు.
• రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన గవర్నర్ సిఫారసు పై విధిస్తారు .
• రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు గవర్నర్ రాష్ట్రపతి యొక్క ప్రతినిధిగా వ్యవహరిస్తాడు .
కార్యనిర్వహణాధికారాలు :-
• రాజ్యాంగంలోని 163 అధికరణ ప్రకారం గవర్నర్ కు అధికార కార్య కలాపాలలో సహాయం చేయటానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఏర్పడుతుంది .
• రాజ్యాంగంలోని 164 అధికరణ ప్రకారం ముఖ్యమంత్రిని ,అతని మంత్రివర్గ సహచరులను గవర్నర్ నియమిస్తారు .
• గవర్నర్ రాష్ట్ర ప్రధాన హైకోర్ట్ న్యాయమూర్తిని సంప్రదించి జిల్లా జడ్జిలను మరియు క్రింది స్థాయి న్యాయమూర్తులను నియమిస్తాడు .
• రాష్ట్రానికి సంబంధించి మొదటి న్యాయాధికారి - అడ్వకేట్ జనరల్
• 165 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ అడ్వకేట్ జనరల్స్ ని నియమిస్తాడు .
• అడ్వకేట్ జనరల్ జీతం ,ఇతర వేతనాలను గవర్నర్ నిర్ణయిస్తాడు .
శాసన నిర్మాణాధికారాలు :-
• ఆంగ్లో ఇండియన్స్ సమాజం నుండి శాసనసభలో తగిన ప్రాతినిధ్యం లేదని గవర్నర్ భావించినప్పుడు గవర్నర్ శాసన సబకు ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని నియమిస్తాడు .
• విధాన పరిషత్ లో 1/6 వ వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు .
• రాష్ట్ర సాసన సభను సమావేశ పరచటం ,వాయిదా వేయటం ,రద్దు చేసే ప్రత్యేక అధికారాలను గవర్నర్ కలిగి ఉన్నాడు .
• శాసన సభలో స్పీకర్ ,డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు సభ నిర్వహణ కు ఎవరినైనా తాత్కాలికంగా నియమిస్తాడు .
• శాసన సభ బిల్లును ఆమోదించి పంపిన తర్వాత ఆ బిల్లును గవర్నర్ ఆమోదం తెలుపవచ్చును ,తిప్పి పంపవచ్చును మరియు ఆమోదం తాత్కాలికంగా నిలిపివేయవచ్చును .
ఆర్ధిక అధికారాలు:-
• ద్రవ్య బిల్లును గవర్నర్ అనుమతి తో మాత్రమే శాసనసభలో ప్రవేశ పెట్టాలి .
• రాష్ట్ర అగంతుక నిధి నుండి డబ్బు ఖర్చు చేయాలంటే గవర్నర్ అనుమతి ఉండాలి .
• గవర్నర్ ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు.
• రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టాల్సిన బాధ్యత గవ్ర్నర్ పై కలదు .
ఆర్టికల్ 202 :-
• ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ కు క్షమాబిక్ష పెట్టే అధికారం కలదు .
గవర్నర్ విచక్షణాధికారాలు :-
• రాష్ట్రపతి ఆమోదానికి కొన్ని బిల్లులను రిజర్వ్ చేసాడు .
• రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తాడు .
• అవసరమైతే సమీప కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తాడు .
• ఎన్నికలలో ఏ పార్టీ సొంతగా మెజారిటీ సాధించని పక్షంలో ముఖ్య మంత్రిని నియమిస్తాడు .
• రాష్ట్ర శాసన సభలో మెజారిటీ కోల్పోయిన యెడల అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తొలగిస్తాడు .
గవర్నర్లు -ప్రత్యేకతలు :-
• భారతదేశం లో మొదటి మహిళా గవర్నర్ - సరోజినీనాయుడు ఉత్తర ప్రదేశ్
• ఆంధ్ర ప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ శారదా ముఖర్జీ
• దేశం లో ఎక్కువ కాలం గవర్నర్ గా పనిచేసిన మహిళ -పద్మజ నాయుడు పశ్చిమ బెంగాల్
• ఆంధ్ర ప్రదేశ్ మొదటి గవర్నర్ - చందూలాల్ మాధవ్ త్రివేది
• ఆంధ్ర ,తెలంగాణా రాష్ట్రాల తొలి గవర్నర్ -A.S.L నరసిం హన్
• అతి పిన్న వయస్సులో గవర్నర్ అయిన వ్యక్తి స్వరాజ్ కాల్ 37 సం ||
• ఆంధ్ర ప్రదేశ్ లో యన్.టి.ఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అత్యంత వివాదాస్పదుడైన గవర్నర్ -రాంలాల్ 1983-84