•రాజ్యాంగం అనే భావనను మొదటి సారి
అరిస్టాటిల్ ప్రతిపాదించాడు .
•రాజనీతి శాస్త్ర పితామహుడు -అరిస్టాటిల్
•ప్రపంచంలో ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని తొలి రాజ్యాంగంగా గుర్తిస్తారు .
•అమెరికా రాజ్యాంగాన్ని తొలి లిఖిత రాజ్యాంగం గా గుర్తిస్తారు .
•ప్రపంచంలో ఏకైక అలిఖిత రాజ్యాంగం - ఇంగ్లాండ్ రాజ్యాంగం
•రాజ్యాంగ పరిషత్ ద్వారా రాజ్యాంగ నిర్మాణం అనే భావనను భారత జాతీయ కాంగ్రెస్ 1918 ఢిల్లీ సమావేశం లో తీర్మానించింది .
•సైమన్ కమీషన్ బహిష్కరణ సందర్భంగా ఇంగ్లాండ్ యం.పి. బిర్కెన్ హెడ్ అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగమును భారతీయులు రూపొందించుకోగలరా? అని సవాలు విసిరాడు .
•ఈ సవాలుకు ప్రతిగా భారత జాతీయ కాంగ్రెస్ 1928లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీ నియమించింది .
•ఈ కమిటీ నివేదికను
నెహ్రూ నివేదిక అని పిలుస్తారు .
•1934 లో రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ స్థాపకుడు ,కమ్యూనిస్టు నాయకుడైన M.N.రాయ్ రాజ్యాంగాన్ని భారతీయులే స్వయంగా రూపొందించుకోవాలని మొదటి
సారి సూచించాడు .
•1935 లో జాతీయ కాంగ్రెస్ అధికారికంగా
రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది .
•క్రిప్స్ రాయబారం 1942 లో మొదటి సారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది .
•1946 లో కేబినేట్ మిషన్ ప్లాన్ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడినది .
•కేబినేట్ మిషన్ భారత దేశానికి వచ్చిన తేదీ - 1946 మార్చి 23
•1945 డిసెంబర్ నుండి 1946 జనవరి వరకు రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు జరిగాయి .
•1946 జులైలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి .
•రాజ్యాంగ సభకు ఎన్నికైన సభ్యులు - 389
రాజ్యాంగ పరిషత్ లో వివిధ పార్టీలు సాధించిన స్థానాలు :-
జాతీయ కాంగ్రెస్ | 202 |
ముస్లిం లీగ్ | 73 |
స్వతంత్ర అభ్యర్ధులు | 7 |
ఇండియన్ క్రిష్టియన్లు | 2 |
ఆంగ్లో ఇండియన్లు | 1 |
యూనియనిస్ట్ ముస్లిం | 3 |
కృషక్ ప్రజాపార్టీ | 1 |
హిందూ మహాసభ | 1 |
షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ | 1 |
కమ్యూనిష్టులు | 1 |
మొత్తం | 296 |
•దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య - 299 .
•వీరిలో 229 మంది రాష్ట్రాలనుంచి ,70 మంది స్వదేశీ సంస్థానాల నుండి ప్రాతినిధ్యం వహించారు .
•ముస్లిం లీగ్ రాజ్యాంగ పరిషత్ సమావేశాలకు సభ్యత్వం కల్గి ఉన్నా హాజరు కాలేదు .
•రాజ్యాంగ పరిషత్ లో మహిళా సభ్యులు - 15
•రాజ్యాంగ పరిషత్ లో సభ్యత్వం లేని ప్రముఖులు
1) మహాత్మా గాంధీ
2) మహ్మద్ అలీ జిన్నా
•రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9 న ఢిల్లీ నగరంలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగింది .
•తొలి సమావేశామునకు హాజరైనవారు -211 మంది .
•వీరిలో ఫ్రెంచి సాంప్రదాయాన్ని అనుసరించి పెద్దవాడైన సచ్చిదానంద సిన్ హా ను తాత్కాలిక అధ్యక్షుడిగా 2 రోజులు పనిచేశారు .
•రాజ్యాంగ పరిషత్ నకు శాశ్వత అధ్యక్షుడిగా డా. బాబూ రాజేంద్రప్రసాద్ ఎన్నికైనారు .
•రాజ్యాంగ పరిషత్ చిహ్నం - ఏనుగు
•రాజ్యాంగ పరిషత్ లో పోటీ చేయకుండా ,ఎన్నిక కాకుండా సభ్యులైనవారు - కెటి.షా ,సర్వేపల్లి రాధాకృష్ణన్ ,గోపాలస్వామి అయ్యంగార్
•రాజ్యాగ పరిషత్ లో సభ్యత్వం పొందిన తెలుగు వారు - టంగుటూరి ప్రకాశం ,పట్టాభి సీతారామయ్య,కల్లూరి సుబ్బారావు ,ఎన్.జి.రంగా,నీలం సంజీవరెడ్ది,దుర్గాభాయ్ దేశ్ ముఖ్
రాజ్యాంగ పరిషత్ లో పార్టీలు | ప్రాతినిధ్యం |
అఖిల భారత షెడ్యూల్ కులాలు | బి.ఆర్.అంబేద్కర్ |
అఖిలభారత హిందూ మహాసభ | శ్యాం ప్రసాద్ ముఖర్జీ |
అఖిల భారత మహిళా సంఘం | హంసా మెహతా |
పార్శీలు | హెచ్.పి.మోడీ |
ముస్లింలు | మౌలానా అబుల్ కలాం ఆజాద్ |
భారతీయ క్రైస్తవులు | హెచ్.సి.ముఖర్జీ |
ఆంగ్లో ఇండియన్ లు | ప్రాక్ ఆంథోనీ |
భారత జాతీయ కాంగ్రెస్ | బాబూ రాజేంద్ర ప్రసాద్ ,జవహర్ లాల్ నెహ్రూ ,వల్లభ్ భాయ్ పటేల్ |
జమిందార్ల సలహా సంఘం | దర్భంగా మహారాజా ,కామేశ్వర్ సింగ్ |
రాజ్యాంగ పరిషత్ కమిటీలు :-
•రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన కోసం 22 కమిటీలను నియమించింది .
•రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన అతిపెద్ద కమిటీ సలహా సంఘం .
•ఇందులో ఒక చైర్మన్ 54 మంది సభ్యులు ఉంటారు.
సలహా సంఘ కమిటీ చైర్మన్ | వల్లభ్ భాయ్ పటేల్ |
కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ | జవహర్ లాల్ నెహ్రూ |
కేంద్ర అధికారాల కమిటీ చైర్మన్ | జవహర్ లాల్ నెహ్రూ |
రాష్ట్ర అధికారాల కమిటీ ఛైర్మన్ | వల్లభ్ భాయ్ పటేల్ |
రాష్ట్రాల కమిటీ చైర్మన్ | జవహర్ లాల్ నెహ్రూ |
రాజ్యాంగ నియమ నిబంధన ల కమిటీ చైర్మన్ | డా.బాబూ రాజేంద్ర ప్రసాద్ |
అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ చైర్మన్ | హెచ్.సి. ముఖర్జీ |
ముసాయిదా కమిటీ చైర్మన్ | బి.ఆర్ అంబేద్కర్ |
ప్రాధమిక హక్కుల కమిటీ చైర్మన్ | వల్లభ్ భాయ్ పటేల్ |
సభా వ్యవహారాల కమిటీ చైర్మన్ | కె.ఎం .మున్షీ |
రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ చైర్మన్ | జి.వి. మౌలంకర్ |
జాతీయ పతాకం పై తాత్కాలిక కమిటీ చైర్మన్ | రాజేంద్ర ప్రసాద్ |
ముసాయిదా కమిటీ :-
•ముసాయిదా కమిటీ చైర్మన్ -బి.ఆర్.అంబేద్కర్
•ముసాయిదా కమిటీ 1947 ఆగష్టు 29 న 7గురు సభ్యులతో ఏర్పడినది .
1)కె.ఎం.మున్షీ
2) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
3) ఎన్.గోపాలస్వామి అయ్యంగార్
4) T.T.కృష్ణమాచారి
5)సయ్యద్ మహ్మద్ షాదుల్లా
6) N.మాధవరావు
•రాజ్యాంగ పరిషత్ ,రాజ్యాంగ ముసాయిదాను
వాక్యో -వాక్య విచారణ పద్ధతి ద్వారా పరిశీలించింది .
•భారత రాజ్యాంగంలో 75 % అంశాలు
1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించినవే .
•1935 చట్టాన్ని భారత రాజ్యాంగానికి
మాతృక గా వర్ణిస్తారు.
భారత రాజ్యాంగ సభ తేదీలు :-
•మొదటి సమావేశం - 1946 డిసెంబర్ 9
•రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ ను ఎన్నుకున్నది - 1946 డిసెంబర్ 11
•జవహర్ లాల్ నెహ్రూ ఆశయాలు,లక్ష్యాల తీర్మానం- 1946 డిసెంబర్ 13
•జాతీయ పతాకాన్ని ఆమోదించిన తేదీ - 1947 జులై 22
•రాజ్యాంగ సభ చివరి సమావేశం- 1950 జనవరి 24
•జనగణమన,వందేమాతరంలను ఆమోదించిన తేదీ - 1950 జనవరి 24
•భారత రాజ్యాంగం 1950 జనవరి 26 న అమలులోకి వచ్చింది.
•రాజ్యాంగ రూపకల్పనకు తీసుకున్న సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు .
•మొత్తం జరిగిన సమావేశాలు -11
రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు- ₹ 64 లక్షలు
•భారత రాజ్యాంగ ముసాయిదా 1948 ఫిబ్రవరి 21 న ప్రచురించబడినది.
•114 రోజులు రాజ్యాంగం పై చర్చించారు.
•రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు 395 నిబంధనలు (ఆర్టికల్స్ ) ,8షెడ్యూల్స్,22 భాగాలు,3 అనుబంధాలు ,403 పుటలతో నిండి ఉంది.
•ప్రస్తుత రాజ్యాంగంలో 467 నిబంధనలు 12 షెడ్యూల్స్,25 భాగాలు కలవు.
•మొదటి రాజ్యాంగ సవరణ భూ సంస్కరణలకు సంబంధించినది .
•రాజ్యాంగంలో చేర్చిన భాగాలు 4(IVA,IXA,IXB,XIVA) తొలగించిన భాగాలు 1(VII) .
•రాజ్యాంగం లో చేర్చిన నిబంధనలు 94,తొలగించినవి 22.
భారత రాజ్యాంగంపై ప్రముఖుల అభిప్రాయాలు:-
•భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - ఐవర్ జెన్నింగ్స్
•అందమైన అతుకుల బొంత - గ్రాన్ విల్లీ ఆస్టిన్
•భారత రాజ్యాగం ఐరావతం లాంటిది- కామత్
•భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య-కె.సి.వేర్
•భారత రాజ్యాంగం సహకార సమైక్య - గ్రాన్ విల్లీ ఆస్టిన్