సుప్రీం కోర్ట్

• రాజ్యాంగంలోని 5 వ భాగంలోని 124 నుండి 147 వరకు గల నింబంధనలు సుప్రీంకోర్ట్ గూర్చి వివరిస్తున్నాయి .
• 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో 1774 లో సుప్రీంకోర్ట్ స్థాపించారు
• దీని మొదటి ప్రధాన న్యాయమూర్తి- ఎలీజ ఇంఫే
• ప్రస్తుత సుప్రీంకోర్ట్ 1950 జనవరి 28 న అమలు లోకి వచ్చింది .
• ఇది ఢిల్లీ లో కలదు .
• ప్రకరణ 124 ప్రకారం సుప్రీం కోర్ట్ లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు పార్లమెంట్ నిర్ణయించిన ఇతర న్యాయమూర్తులు ఉంటారు .
• ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 30 మంది న్యాయమూర్తులు కలరు .
• భారత దేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ రూపొందించబడినది .
• సుప్రీంకోర్ట్ ప్రధాన విధులు :-
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏమైనా వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరిస్తుంది .
ప్రాధమిక హక్కులను పరిరక్షిస్తుంది .
రాజ్యాంగ రక్షణ బాధ్యత ని కలిగి ఉంటుంది .
• సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులను మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు.
• ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ అయినప్పుడు సీనియర్ న్యాయవాది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించునని రాజ్యాంగంలోని 126 వ నిబంధన తెలుపుతుంది .
• పార్లమెంట్ లో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి - వి.రామ స్వామి
• న్యాయమూర్తుల జీతభత్యాలు భారతీయ సంఘటిత నిధి నుంచి చెల్లింపబడతాయి .
న్యాయమూర్తుల నియామకం :-
124(3) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించుటకు ఉండవలసిన అర్హతలు
• భారత దేశ పౌరుడైఉండాలి .
• 65 సం లు నిండి ఉండరాదు .
• ఏదైనా హైకోర్ట్ లో న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు అనుభవం లేదా ఏదైనా కోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.
• రాష్ట్రపతి దృష్టిలో న్యాయనిష్ణాతుడై ఉండాలి .
జాతీయ న్యాయ నియామకాల కమీషన్ :-
• కొలీజియం వ్యవస్థ స్థానం లో దీనిని 2015 ఏప్రిల్ 13 నుంచి అమలులోకి తెచ్చారు .
• ఈ సంస్థను రాజ్యాంగ భద్రత కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం 99 వ సవరణ చట్టం
• నిర్మాణం ఈ కమీషన్ కు అధికార రీత్యా ఛైర్మన్ - సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి
సభ్యులు
సుప్రీంకోర్ట్ లో గల ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు
కేంద్ర న్యాయ శాఖా మంత్రి
ఇద్దరు ప్రముఖులు
• ఈ ఇద్దరు ప్రముఖులను ఒక కమిటీ నియమిస్తుంది .
• ఈ కమీషన్ ను 2015 అక్టోబర్ 16 న సుప్రీం కోర్ట్ ధర్మాసనం జె.ఎస్.ఖేహర్ అధ్యక్షతన ఉన్న ధర్మాసనం కొట్టివేసింది .
అధికారాలు :-
ఒరిజినల్ అధికార పరిధి
అప్పీళ్ళ విచరణాధికార పరిధి
సలహారూపక పరిధి
రిట్ అధికార పరిధి
కోర్ట్ ఆఫ్ రికార్డ్
న్యాయ సమీక్షాధికారం
పునః సమీక్షించే అధికారపరిధి
సుప్రీం కోర్ట్ అధికారాలు -విధులు :-
1) ప్రాధమిక విచారణ అధికార పరిధి
ఆర్టికల్ -131
సుప్రీంకోర్ట్ క్రింది వివాదాలను పరిశీలిస్తుంది .
ఆర్టికల్ -131
a) సుప్రీం కోర్ట్ క్రింది వివాదాలను పరిశీలిస్తుంది .
b) కేంద్ర జాబితాకు సంబంధించిన వివదాలు
c) రాష్ట్రాల మధ్య వివాదాలు
d) ప్రాధమిక హక్కుల వివాదాలు
e) రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు
f) మనదేశం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివాదం
ఆపీళ్ళు విచారణ అధికారాలు:-
• హైకోర్ట్ అనుమతితో అది ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్ట్ అప్పీళ్ళను స్వీకరిస్తుంది .
ఆర్టికల్ 132:-
రాజ్యాంగ నిబంధనలకు అర్ధం చెప్పే వివాదాలు
ఆర్టికల్ 133:-
సివిల్ వివాదాలు
ఆర్టికల్ 134 :-
క్రిమినల్ వివాదాలు
ఆర్టికల్ 136:-
ఒకవేళ హైకోర్ట్ నిరాకరిస్తే ప్రత్యేక వివాద అనుమతి రూపం లో స్వీకరిస్తుంది .
సలహా రూపక అధికారాల పరిధి:-
ఆర్టికల్ -143 :-
రాష్ట్రపతి , సుప్రీంకోర్ట్ ను న్యాయ సలహా కోరవచ్చు .
ఆర్టికల్ -129:-
సుప్రీం కోర్ట్ తాను ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది .
ప్రాధమిక హక్కుల రక్షణ
ఆర్టికల్ -32 :-
ప్రకారం ప్రాధమిక హక్కులకు భంగం కలిగినపుడు క్రింది రిట్ లను జారీ చేస్తుంది.
హెబియస్ కార్పస్ -కోవారెంటో
మాండమస్
ప్రొహిబిషన్
సెర్షిమోరారి
• అప్పీళ్ళను స్వీకరించే అత్యున్నత ఆఖరి న్యాయస్థానం - సుప్రీంకోర్ట్
• సుప్రీంకోర్ట్ అన్ని రకాల సివిల్,క్రిమినల్ రాజ్యాంగ పరమైన అప్పీళ్ళను స్వీకరిస్తుంది .
• సుప్రీం కోర్ట్ లో అప్పీళ్ళు చేయటానికి వివాదం ఆస్తి విలువ లక్ష రూపాయలపైన ఉండాలి.
• రాజ్యాంగంలోని 143 వ నిబంధన క్రింద రాష్ట్రపతి సుప్రీంకోర్ట్ సలహా కోరవచ్చును.
• 143 నిబంధన క్రింద ఇప్పటివరకు 14 సార్లు రాష్ట్రపతి సుప్రీంకోర్ట్ సలహా కోరటమైనది .
• సుప్రీంకోర్ట్ లో సుదీర్ఘకాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినది - వై.వి.చంద్రచూడ్
•తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినది - కమల్ నరైన్ సింగ్ 18 రోజులు
• సుప్రీంకోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి - హీరాలాల్ జె.కానియా
•తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి - యం.హిదయతుల్లా
• గోలక్ నాథ్ కేసు సమయం లో ప్రధాన న్యాయమూర్తి - కోకా సుబ్బారావు
• కేశవానంద భారతి సమయం లో ప్రధాన న్యాయమూర్తి - ఎస్.ఎం.సిక్రీ
• పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ కు ప్రాచుర్యం కల్పించిన ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ భగవతి
• సుప్రీంకోర్ట్ మొదటి మహిళా న్యాయమూర్తి- ఫాతిమా బీబీ