కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
• 80 వ నిబంధన రాజ్య సభ నిర్మాణం గురించి వివరిస్తుంది.
• రాజ్యసభను 1952 ,ఏప్రిల్ 3 న ఏర్పాటుచేశారు .
• కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ను రాజ్యసభగా వ్యవహరించాలని 1954 ఆగష్టు 23 న రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు.
• దీనికి రాజ్య సభ అనే పేరు పెట్టినది - జి.వి.మౌలంకర్
• రాజ్య సభను పెద్దల సభ,ఎగువ సభ అని పిలుస్తారు .
• రాజ్యసభ పదవీకాలం శాశ్వతం.రాజ్యసభ సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు .
• ప్రతి రెండు సంవత్సరాలకు సభలోని 1/3 వంతు మంది సభ్యులు పదవి విరమణచేస్తారు .
• రాజ్య సభ గరిష్ట సభ్యుల సంఖ్య - 250
• ప్రస్తుత సంఖ్య -245
• రాజ్య సభకు పోటీ చేయటానికి ఉండవలసిన కనీస వయస్సు -30 సంవత్సరాలు
• రాజ్యసభ సభ్యులను రాష్ట్ర విధానసభలు నైషత్తిక ప్రాధాన్యత క్రమంలో ఎన్నుకుంటాయి .
• ఇది పరోక్ష ఎన్నిక .
• రాజ్యసభ సభ్యుల ఎంపిక దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు.
రాజ్య సభ చైర్మన్ :-
• 89 వ నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఛైర్మన్ గా వ్యవహించారు.
• కానీ రాజ్యసభలో సభ్యుడు కాదు.
• రాజ్య సభకు ఒకడిప్యూటీ చైర్మన్ ఉంటాడు .
• వీరిని రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు .
• రాజ్యసభ తొలి ఛైర్మన్ - సర్వేపల్లి రాధాకృష్ణన్
• రాజ్యసభ తొలి డిప్యూటీ ఛైర్మన్ -ఎస్.వి.కృష్ణమూర్తి
రాజ్యసభ సభ్యులు అధికంగా ఉన్న రాష్ట్రాలు:-
ఉత్తరప్రదేశ్ - 31
మహారాష్ట్ర - 19
తమిళనాడు -18
ఆంధ్ర ప్రదేశ్ - 11
తెలంగాణ -7
రాజ్యసభ ప్రత్యేక అధికారాలు :-
• రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ చట్టం చేయాలంటే 249 నిబంధన ప్రకారం ఆ తీర్మానం ను మొదట రాజ్యసభ ప్రతిపాదించాలి.
• అఖిల భారత సర్వీసులు ఏర్పాటుచేసే తీర్మానం మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
• రాష్ట్ర జాబితాలోని అంశాలను ఉమ్మడి జాబితాలోకి రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో తీర్మానం ద్వారా మార్చవచ్చు.
• ఆర్ధికాధికారాలు రాజ్యసభకు తక్కువ .
ఉభయ సభల సంయుక్త సమావేశం :-
• నిబంధన 108 ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభల సం యుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు .
• ఈ సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు .
• ఏదైనా ఒక బిల్లు విషయంలో లోక్ సభ,రాజ్యసభ మధ్య అభిప్రాయ భేదాలు వస్తే సం యుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు .
• 1952 నుండి మూడు బిల్లులు మాత్రమే సం యుక్త సమావేశం లో ఆమోదించబడ్డాయి
1) వరకట్న నిషేధ బిల్లు - 1960 మే 6
2) బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్లు -1978 మే 16
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.