కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
• రాజ్యాంగంలోని 5 వ భాగంలోని 79 నుండి 123 వరకు గల అధికరణములు పార్లమెంట్ గూర్చి తెలుపుతుంది .
• 79 వ నిబంధన ప్రకారం పార్లమెంట్ అనగా రాజ్య సభ,లోక్ సభ మరియు రాష్ట్రపతి
• రాష్ట్రపతి పార్లమెంట్ లో అంతర్భాగమే కాని సభ్యుడు కాదు .
• పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం 1952 మే 13 న జరిగింది .
• మొదటి సాధారణ ఎన్నికలు (1951-52)
• భారత పార్లమెంట్ భవనానికి 1921 లో లార్డ్ చెంస్ ఫర్డ్ శంకుస్థాపన చేశారు .
• 85 వ నిబంధన ప్రకారం పార్లమెంట్ సమావేశాలు సంవత్సరానికి కనీసం రెండు సార్లైనా జరగాలి.
• అనగా రెండు సమావేశాల మధ్య విరామం 6 నెలలు మించరాదు .
• ప్రస్తుత పార్లమెంట్ సంవత్సరానికి మూడు సాంప్రదాయ సమావేశాలు నిర్వహిస్తుంది .
1)వర్షాకాల సమావేశాలు (జులై -ఆగష్టు)
2)శీతాకాల సమావేశాలు (నవంబర్-డిసెంబర్ )-తక్కువ రోజులు జరిగేవి
3) బడ్జెట్ సమావేశాలు (ఫిబ్రవరి -ఏప్రియల్ ) దీర్ఘ కాలం కొనసాగుతాయి
•ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అనగా రాజ్యసభ+లోక్ సభ+రాష్ట్రపతి
• ఆర్టికల్ 84 ప్రకారం పార్లమెంట్ కు పోటీ చేయుటకు ఉండాల్సిన అర్హతలు :-
1. భారతీయ పౌరుడై ఉండాలి.
2. లోక్ సభ సభ్యుడిగా పోటీ చేయాలంటే 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
3. రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయాలంటే 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి .
• ఆర్టికల్ 102 ప్రకారం పార్లమెంట్ కు పోటీ చేయుటకు అనర్హత నియమావళి :-
1. ఆదాయం వచ్చే ప్రభుత్వ పనులు చేయకూడదు .
2. మతి స్థిమితం లేదని కోర్ట్ ధృవీకరించినప్పుడు.
3. విడుదలకాని ఋణగ్రస్థుడైనప్పుడూ
4. విదేశీ పౌర సత్వం కలిగి ఉన్నప్పుడు
• ఆర్టికల్ 103 ప్రకారం పైన పేర్కొన్న ఏ అనర్హత కలిగి ఉన్నా ఎలక్షన్ కమీషన్ సలహాను తీసుకోని రాష్ట్ర పతి సభ్యత్వం రద్దు చేస్తారు .
• ఆర్టికల్ 101 ప్రకారం పార్లమెంట్ సభ్యుడి సీటు ఖాళీ అయ్యే సంధర్భం :-
• ఆర్టికల్ 102 పేర్కొన్న విధంగా ఉంటే పార్లమెంట్ సీట్ ఖాళీ అవుతుంది.
• ఇలా కోల్పోయిన మొదటి వ్యక్తి -జయబచ్చన్
• ఉభయ సభలలో సభ్యత్వం ఉంటే ఒక సభకు రాజీనామా చేయాలి.
• పార్లమెంట్ లో అన్ని సమావేశాలకు సభాధ్యక్షుని అనుమతి లేకుండా 60 రోజుల పాటు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు అగును .
పార్లమెంట్ పదజాలం :-
విశ్వాస తీర్మానం :-
• విశ్వాస తీర్మానాన్ని అధికార పక్షం లోక్ సభలో మాత్రమే ప్రవేశపెడుతుంది .
• విశ్వాసతీర్మానం సభ యొక్క విశ్వాసం పొందాలి.
• లేని పక్షంలో ప్రభుత్వం రాజీనామా చేయాలి.
• విశ్వాస తీర్మానము ద్వారా లోక్ సభ ఆమోదం పొందని కారణంగా మొదట రాజీనామా చేసిన ప్రధాని - వి.పి.సింగ్
అభిశంసన తీర్మానం :-
• అభిశంసన తీర్మానాన్ని ప్రతిపక్ష పార్టీ లోక్ సభలో ప్రవేశపెడుతుంది.
• ఇది సభ ఆమోదం పొందినట్లయితే సంబందిత మంత్రి రాజీనామా చేయాలి లేదా ప్రభుత్వం వెంటనే సభ యొక్క విశ్వాసం పొందాలి.
అవిశ్వాస తీర్మానం :-
(నో కాన్ఫిడెన్స్ మోషన్ )
• ఇది ప్రతిపక్ష పార్టీ ప్రవేశపెడుతుంది .
• ఆర్టికల్ 75 ప్రకారం మంత్రి మండలి సమిష్టిగా లోక్ సభకు భాద్యత వహిస్తుంది .
• లోక్ సభలో మెజార్టీ ఉన్నంతవరకు మంత్రి మండలి పదవిలో ఉంటుంది.
• లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి మంత్రి మండలిని తొలగిస్తుంది .
• ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే 50 మంది లోక్ సభ సభ్యుల మద్దతు కావాలి.
క్వశ్చన్ అవర్ :-
• పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రారంభ సమయాన్ని క్వశ్చన్ అవర్ అంటారు .
• ఇవి మూడు రకాలు
స్టార్డ్ క్వశ్చన్ -నక్షత్రపు గుర్తుగల ప్రశ్నలు
అన్ స్టార్డ్ క్వశ్వన్స్ -నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలు
స్టార్డ్ నోట్స్ క్వశ్చన్స్ - స్వల్పవ్యవధి ప్రశ్నలు
• నక్షత్రపు గుర్తుగల ప్రశ్నలను సంబంధిత మంత్రి ,సభ్యుడు అడిగిన ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెబుతాడు.
అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు.
• నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలకు మంత్రులు లిఖిత పూర్వకమైన సమాధానం చెబుతాడు .అనుబంధ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉండదు .
• అత్యవసరమైన ,ప్రజా ప్రాముఖ్యత కల విషయాలపై మౌఖికంగా అడిగే ప్రశ్నలు. వీటికి 10 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి .
శూన్య కాలం (జీరో అవర్ ):-
• ప్రశోత్తరాల సమయం ముగిసిన వెంటనే అనగా 12 నుంచి 1 వరకు ఉండే సమయాన్ని జీరో అవర్ అంటారు .
• ఈ సమయంలో సభ్యులు పూర్వానుమతిలేకుండానే ప్రశ్నలు అడగవచ్చు.
• జీరో అవర్ సమయాన్ని భారత రాజ్యాంగంలో 1962 లో ప్రవేశ పెట్టడం జరిగినది .అంతకుముందు జీరో అవర్ ప్రస్తావన లేదు .
• గిలిటెన్ :-
సభలో కాలవ్యవధి లేని కారణంగా వివిధ మంత్రిత్వ శాఖల డిమాండ్లని చర్చించకుండా ఆమోదించటం
• రీకాల్ : -
ఎన్నికయిన సభ్యులు తమ విధుల్ని సరిగా నిర్వర్తించనప్పుడు వారిని ఈ విధానం ప్రకారం వెనక్కి పిలుస్తారు .
పార్లమెంటరీ కమిటీలు :-
• పార్లమెంటరీ కమిటీలను స్పీకర్ ఏర్పాటు చేస్తారు .
• ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలు ,వ్యయాలను నియంత్రణ చేయుటకు ,దుబారా లేకుండా చూచుటకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు .
ప్రభుత్వ ఖాతాల సంఘం(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ) 1921 :-
• పదవీ కాలం ఒక సంవత్సరం
• సభ్యుల సంఖ్య -22 (15 లోక్ సభ సభ్యులు ,7 గురు రాజ్య సభ సభ్యులు )
• ప్రభుత్వ ఖాతాల సంఘానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సహకరిస్తారు .
అంచనాల సంఘం :-
• జాన్ మథాయ్ కమిటీ సిఫారసు మేరకు ఏర్పడింది .
• పార్లమెంట్ అన్ని కమిటీలలో పెద్దది .
• 1950 లో ఏర్పడింది .
• పదవీకాలం -ఒక సంవత్సరం
• సభ్యుల సంఖ్య -30 మంది.
• ఇందులో సభ్యులు అందరూ లోక్ సభ సభ్యులే .
• అంచనాల సంఘానికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షుడిగా ఉంటారు .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.