కేంద్ర మంత్రి మండలి

• కేంద్ర మంత్రి మండలి ఆర్టికల్ 74 ప్రకారం పరిపాలనలో రాష్ట్రపతికి సలహా సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మంత్రి మండలి ఉంటుంది .
• 74(1) ప్రకారం రాష్ట్రపతి విధి నిర్వహణలో సహకరించటకు ప్రధాని అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది .
• ఆర్టికల్ 75 ప్రకారం లోక్ సభలో మెజారిటీ పార్టీ నాయకుణ్ణి ప్రధానిగా రాష్ట్రపతి నియమిస్తే ప్రధాని సలహాపై ఇతర మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తాడు .
• 75 (1 ఎ) ప్రకారం మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభలో మొత్తం సభ్యులలో 15 శాతం మించరాదు.
• ఆర్టికల్ 75 (3) ప్రకారం మంత్రులు సమిష్టిగా లోక్ సభకు భాద్యత వహిస్తారు. వ్యక్తిగతంగా రాష్ట్రపతికి భాద్యత వహిస్తారు.
• మంత్రులుగా నియమించబడేవారు ఏ సభలోను సభ్యత్వం లేకుండా ఉంటే 6 నెలలలో ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాలి.
• ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ లేనప్పుడు రాష్ట్రపతి తనవిచక్షణాధికారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరితే ఒక నెల రోజుల్లో తన మెజారిటీని నిరూపించుకోవాలి .
• లోక్ సభ సభ్యుడు స్పీకర్ యొక్క అనుమతి లేకుండా 60 రోజులు నిరంతరంగా సభకు హాజరు కాకపోతే తన పదవి కోల్పోతాడు.
• గోపాల స్వామి అయ్యంగార్ కమిటీ మంత్రి వర్గాన్ని మూడు వర్గాలుగా విభజించారు.
1.క్యాబినేట్ మంత్రులు
2.స్టేట్ మంత్రులు
3.సహాయక మంత్రులు
• 352 వ అధికరణలో క్యాబినేట్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో 44 వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా చేర్చారు.
• కేబినేట్ మంత్రులు - తమశాఖలపై పూర్తి ఆధిపత్యం కల్గి ఉంటారు .కేంద్రమంత్రి మండలి తరుపున విధాన నిర్ణయాలు చేస్తారు .
• స్టేట్ మంత్రులు - పరిపాలనా శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తారు .వీరు ప్రధానికి జవాబుదారీగా ఉంటారు .
• డిప్యూటీ మంత్రులు -కేబినేట్ మంత్రులకు సహాయంగా ఉంటారు .వీరినే సహాయమంత్రులుగా పిలుస్తారు.
• రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ ఒకే హోదాని కలిగి ఉంటారు.
• మంత్రిమండలి సమిష్టి వ్యక్తిగత భాద్యతలు కలిగి ఉంటారు .
కేబినేట్ విధులు :-
1) ప్రభుత్వ విధానాల రూపకల్పన
2) శాఖల మధ్య పరిపాలనా సమన్వయం
3) పరిపాలనపై అత్యున్నత నియంత్రణ
4) వార్షిక బడ్జెట్ రూపకల్పన పార్లమెంటులో ప్రవేశపెట్టుట
5) అత్యవసర ఆర్డినెన్స్ జారీకి రూపకల్పన చేయుట
6) విదేశాంగ విధాన రూపకల్పన
• భారత దేశంలో మొదటి మంత్రిమండలి సభ్యుల సంఖ్య - 14
1947 జవహర్ లాల్ నెహ్రు మంత్రి వర్గం :-
జవహర్ లాల్ నెహ్రు ప్రధాని ,విదేశీ వ్యవహారాలు,కామన్వెల్త్ సంబంధాలు
సర్దార్ వల్లభ బాయ్ పటేల్ హోమ్,సమాచార ప్రసారాలు , రాష్ట్రాలు
రాజేంద్ర ప్రసాద్ఆహారం ,వ్యవసాయం
మౌలానా అబుల్ కలాం ఆజాద్విద్య
జాన్ మతాయ్రైల్వే ,రవాణా
సర్దార్ బల్దేవ్ సింగ్రక్షణ
జగజ్జీవన్ రామ్ కార్మిక శాఖ
సి.హెచ్.బాబా వాణిజ్యం
రఫీ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్లు
రాజకుమారి అమృతకౌర్ ఆరాగ్యం
బి.ఆర్ .అంబేద్కర్ లా
ఆర్.కె.షణ్ముఖం చెట్టి ఫైనాన్స్
శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండస్ట్రీస్ అండ్ సప్లై
వి.ఎన్.గాడ్గిల్ వర్క్స్,గనులు ,విద్యుత్