ప్రధాన మంత్రి

• పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రిని ప్రభుత్వాధినేతగా పిలుస్తారు.
• ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో మంత్రి మండలిని వాస్తవ కార్యనిర్వహణాధికారి అని పిలుస్తారు .
• ఆర్టికల్ 75 ప్రకారం లోక్ సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తాడు.
• ప్రధానమంత్రిగా నియమించబడుటకు ఉండవలసిన కనీస వయసు 25 సంవత్సరాలు .
• ప్రధానమంత్రి పదవి పొందుటకు పార్లమెంట్ లో సభ్యుడై ఉండాలి.
లేదా 6 నెలలలోపు పార్లమెంట్ కు ఎన్నిక అవ్వాలి.
• ప్రధాన మంత్రి పదవీ కాలం 5 సమత్సరాలు లేదా లోక్ సభలో విశ్వాసం ఉన్నంతవరకు
• ప్రధానమంత్రి చేత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు .
• ప్రధానమంత్రి తన రాజీనామా ని రాష్ట్రపతికి సమర్పిస్తాడు.
• పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం ఈ క్రింది పరిస్థితుల్లో ప్రధానమంత్రి తన పదవిని కోల్పోతాడు .
• ప్రతిపక్ష పార్టీ లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు
• ప్రభుత్వ బిల్లు వీగిపోయినపుడు
• ఒక ప్రైవేట్ సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లు ప్రభుత్వం వ్యతిరేకించగా పార్లమెంట్ దానికి ఆమోదం తెలిపినపుడు
• లోక్ సభ యొక్క బడ్జెట్ ను తిరస్కరించినప్పుడు
• రాష్ట్రపతికి తెలిపే ధన్యవాద తీర్మానం వీగిపోయినప్పుడు
• ప్రధానమంత్రి మంత్రి వర్గ నిర్ణయాలను ,ప్రభుత్వ విధానాలను రాష్ట్రపతికి తెలియచేస్తాడు.
• రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను మంత్రి మండలి కి తెలియచేసి ఇద్దరి మధ్య వారధిగా పని చేస్తారు .
• ప్రధానమంత్రి ఈ క్రింది వాటికి అధ్యక్షత వహిస్తారు .
క్యాబినేట్ సమావేశాలు
ప్రణాళికా సంఘం
జాతీయ అభివృద్ధి మండలి
జాతీయ సమైక్యతా మండలి
అంతర్రాష్ట్రమండలి
ప్రధాని అధికారాలు :-
రాష్ట్రపతికి రాజ్యాంగ సలహాదారు
మంత్రిమడలి నాయకుడు
మంత్రి మండలి అధ్యక్షుడు
లోక్ సభ నాయకుడు
జాతినాయకుడు
మంత్రులను నియమించి శాఖలు కేటాయిస్తాడు .
• ప్రధానమంత్రి ఈ క్రింది వాటికి అధ్యక్షత వహిస్తారు .
•అనేక కీలక పదవులను ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు.
•ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి లోక్ సభను రద్దు చేస్తాడు .
•పార్లమెంట్ సమావేశ తేదీలను నిర్ణయిస్తాడు .
•నియామకాల కమిటీ ,అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ,రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉంటాడు.
ముఖ్యాంశాలు :-
• మొట్ట మొదటి భారత ప్రధాని - జవహర్ లాల్ నెహ్రూ
• విదేశాలలో చనిపోయిన ప్రధాని - లాల్ బహదూర్ శాస్త్రి
• మొదటి మహిళా ప్రధాని - శ్రీమతి ఇందిరా గాంధీ
• పదవి లో ఉండగా హత్యగావించబడిన ప్రధాని -ఇందిరా గాంధీ
• లోక్ సభ కు రాని ప్రధాని - చరణ్ సింగ్
• పార్లమెంట్ లో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన మొదటి వ్యక్తి - పి.వి.నర సిం హరావు .
• ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని -సిరిమావో బండారు నాయకే
ప్రధానమంత్రిపై ప్రముఖుల అభిప్రాయం :-
• కేబినేట్ సౌధానికి మూలస్థంభం - గ్లాడ్ స్టోన్
• రాజ్యమనే నౌకకు ప్రధాని చోదక యంత్రం - రాం సేమ్యూర్
• ప్రధాని ఏన్నికైన రారాజు -హింటన్
Name Political Party & Alliance Tenure
Jawaharlal Nehru Indian National Congress 15th August 1947 – 27th May 1964
Gulzarilal Nanda (acting) Indian National Congress 27 May 1964 – 9 June 1964
Lal Bahadur Shastri Indian National Congress 9 June 1964 – 11 January 1966
Gulzarilal Nanda (acting) Indian National Congress 11 January 1966 – 24 January 1966
Indira Gandhi Indian National Congress 24 January 1966 – 24 March 1977
Morarji Desai Janata Party 24 March 1977 – 28 July 1979
Charan Singh Janata Party (Secular) with INC 28 July 1979 – 14 January 1980
Indira Gandhi Indian National Congress (I) 14 January 1980 – 31 October 1984
Rajiv Gandhi Indian National Congress (I) 31 October 1984 – 2 December 1989
V. P. Singh Janata Dal (National Front) 2 December 1989 – 10 November 1990
Chandra Shekhar Samajwadi Janata Party with INC 10 November 1990 – 21 June 1991
P. V. Narasimha Rao Indian National Congress (I) 21 June 1991 – 16 May 1996
Atal Bihari Vajpayee Bharatiya Janata Party 16 May 1996 – 1 June 1996
H. D. Deve Gowda Janata Dal (United Front) 1 June 1996 – 21 April 1997
Inder Kumar Gujral Janata Dal (United Front) 21 April 1997 – 19 March 1998
Atal Bihari Vajpayee Bharatiya Janata Party (NDA) 19 March 1998 – 22 May 2004
Manmohan Singh Indian National Congress (UPA) 22 May 2004 – 26 May 2014
Narendra Modi Bharatiya Janata Party – NDA Incumbent – From 26th May 2014