కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
• రాష్ట్రపతి ఆర్టికల్ 52 ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు.
• రాష్ట్రపతి భారత దేశానికి ప్రధమ పౌరుడు .
• రాష్ట్రపతిని రాజ్యాధినేత అని పిలుస్తారు .
• రాష్ట్రపతి నామమాత్రపు కార్య నిర్వహణాధికారి
• భారత త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి .
• యుద్ధమును ప్రకటించేది ,ఇతర దేశాలలో శాంతి సంధులను కుదిర్చేది రాష్ట్రపతి .
రాష్ట్రపతి ఎన్నిక:-
• రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ పరోక్ష పద్ధతి మరియు నైష్పత్తిక ఓటు బదిలీ పద్ధతి ప్రకారం ఎన్నుకుంటుంది .
• రాష్ట్రపతి ఎన్నికలలో రిటర్నింగ్ అధికారిగా లోక్ సభ లేదా రాజ్య సభ సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తారు.
• రాష్ట్రపతి ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజి లో ఈ క్రింది వారికి సభ్యత్వం ఉంటుంది .
ఎన్నిక కాబడిన పార్లమెంట్ సభ్యులు
ఎన్నిక కాబడిన రాష్ట్ర శాసన సభ్యులు
శాసన సభలు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ,పాండిచ్చేరీ, శాసన సభలకు ఎన్నిక కాబడిన సభ్యులు .
• రాష్ట్రపతిని ఎన్నుకొనే రాష్ట్రాల శాసన సభ ,పార్లమెంట్ సభ్యులు ఓటు విలువను ఈ క్రింది విధంగా లెక్క కడతారు .
• ఒక శాసన సభ సభ్యుని ఓటు విలువ = (ఆ రాష్ట్ర జనాభా /ఎన్నికైన శాసన సభ సభ్యుల సంఖ్య )/1000
• ఒక పార్లమెంట్ =మొత్తం రాష్ట్ర శాసన సభ్యుల ఓటు విలువ /ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల సంఖ్య
• రాష్ట్రపతి ఎన్నికలో ఆంధ్ర ప్రదేశ్ ఓటు విలువ - 148
• తెలంగాణ ఓటు విలువ - 132
• రాష్ట్రపతి ఎన్నికలో అత్యధిక ఓటు విలువ కల రాష్ట్రం - ఉత్తర ప్రదేశ్ 208
• అతి తక్కువ విలువ కల రాష్ట్రం - సిక్కిం 7
పదవీకాలం:-
• రాష్ట్రపతి పదవీకాలం - 5 సంవత్సరాలు
• రాష్ట్రపతి రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి.
• తన పదవీకాలం లో రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు .
అర్హతలు :-
• రాష్ట్రపతిగా పోటీచేయుటకు
• భారత పౌరుడై ఉండాలి.
• 35 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి .
• లోక్ సభకు పోటీ చేయుటకు ఉండావలసిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి .
• ప్రభుత్వ ఆదాయం వచ్చే ఏ పనీ చేయరాదు .
వేతనం:-
• నెలసరి వేతనం ₹ 5,00,000
• భారత రాజ్యాంగం ను సంరక్షిస్తానని ప్రమాణం చేయాలి .
మహాభియోగం :-
• ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విరుద్ధంగా ప్రప్రవర్తిస్తే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు .
• రాష్ట్రపతిని పదవీచ్యుతుణ్ణొ చేయవలసింది గా కోరుతూ తీర్మానాన్ని 11/4 వంతు సభ్యులు తమ సంతకాలతో 14 రోజుల వ్యవధిలో ముందుగా రాష్ట్రపతికి నోటీసు ఇవ్వాలి .
• ఆ విధంగా సమర్పించిన తీర్మానాన్ని ఒక సభ సభ్యులు 2/3 వంతు మెజారిటీ తో ఆమోదించాలి
• రాష్ట్రపతిపై వచ్చు ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్ట్ మాత్రమే పరిష్కరించకలదు.
ఆర్ధిక రక్షణలు :-
• రాష్ట్రపతిపై ఎటువంటి నేరారోపణ చేయలేరు .సివిల్ కేసు వేయాలంటే 2 నెలల ముందు గా రాష్ట్రపతికి నోటీసు ఇవ్వాలి .
• క్రిమినల్ చర్యలు చేపట్టలేరు .
• న్యాయ స్థానాలకు హాజరు కావాలని న్యాయస్థానాలు ఆదేశించలేవు .
• రాష్ట్రపతి భవన్ ఢిల్లీ లో కలదు .
• రాష్ట్రపతి శీతాకాలం విడిది -హైదరాబాద్ (బొల్లారం)
• రాష్ట్రపతి వేసవి కాలం విడిది - సింలా
రాష్ట్రపతి అధికారాలు:-
కార్యనిర్వహణాధికారాలు :-
• ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని ,అతని సలహా పై మంత్రి మండలి ని రాష్ట్రపతి నియమిస్తాడు .
• ఆర్టికల్ 76 ప్రకారం భారత అటార్నీ జనరల్ ను రాష్ట్ర పతి నియమిస్తాడు .
• ఆర్టికల్ 148 ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను రాష్ట్రపతి నియమిస్తాడు .
• ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్రాల గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తాడు .
• ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు .
• ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం అధికారిని ,ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు .
• ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ,ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు
• ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ,ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు .
• ఆర్టికల్ 312 ప్రకారం అఖిల భారత సర్వీసులకు అధికారులను రాష్ట్రపతి నియమిస్తాడు .
• ఆర్టికల్ 316 ప్రకారం యూ.పి.యస్.సి ఛైర్మన్ మరియు ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు .
• ఆర్టికల్ 338 ప్రకారం ఎస్.సి. ఆర్టికల్ 338 ఎ ప్రకారం ఎస్.టి. కమీషన్ చైర్మన్ ,ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు .
• అధికార భాషా సంఘ ఛైర్మన్ ను ,ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు .
• లెఫ్టినెంట్ గవర్నర్ లను రాష్ట్రపతి నియమిస్తాడు .
• విదేశాలలో భారత రాయబారులను రాష్ట్రపతి నియమిస్తాడు .
• త్రివిధ దళాధిపతులను రాష్ట్రపతి నియమిస్తాడు .
• రాష్ట్రపతికి 3 రకాలైన వీటో అధికారాలు ఉన్నాయి .
నిరపేక్ష ,సస్పెన్సివ్ , పాకెట్ వీటోలు
• వీటో అనే లాటిన్ పదానికి ఫర్ బిడెన్ అని అర్ధం .
•ప్రవేటు మెంబర్స్ బిల్లు,కేబినేట్ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందేలోపు ఆ ప్రభుత్వం పతనమయితే రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోని ఉపయోగిస్తాడు.
• ఇవి ఎట్టి పరిస్థితులలో చట్టం గా మారవు .
• పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఒక సారి తిరస్కరించే అధికారాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు .
• అదే బిల్లును పార్లమెంట్ రెండవ సారి అమోదిస్తే రాష్ట్రపతి తప్పక ఆమోదించాలి.
• పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి తన నిర్ణయాన్ని తెలపకుండా పెండింగ్ ఉంచుటను పాకెట్ వీటో అంటారు .
శాసన నిర్మాణాధికారాలు :-
• ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అనగా రాష్ట్రపతి ,లోక్ సభ ,రాజ్య సభ
• రాష్ట్రపతి పార్లమెంట్ ను సమావేశపరచవచ్చు.సమన్స్ వాయిదా వేయవచ్చు.లోక్ సభను రద్దు చేయవచ్చు .
• ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించవచ్చు.
• లోక్ సభ ఎన్నికల తర్వాత మొదటి సమావేశం లోను మరియు బడ్జెట్ సమావేశం లోను ప్రసంగించవచ్చు .
• ఆర్టికల్ 80 ప్రకారం రాష్ట్రపతి రాజ్య సభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నియమిస్తాడు .
• ఆర్టికల్ 331 ప్రకారం ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ను రాష్ట్రపతి నియమిస్తాడు .
• ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సం యుక్త సమావేశాలౌ రెండు సందర్భాలలో ఏర్పాటు చేస్తారు .
1.బిల్లుల ఆమోదం విషయం లో ప్రతిష్టంబన ఏర్పడినప్పుడు
2.విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు
• పార్లమెంట్ ఉభయసభల సమావేశాలు జరగని సమయంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు .
• ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి 7 1/2 నెలలు లేదా 6 నెలల 6 వారాలు .
ఆర్ధికాధికారాలు:-
• ఆర్టికల్ 110 ప్రకారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ద్రవ్య బిల్లు రాష్ట్రపతి పూర్వానుమతితో ప్రవేశపెట్టాలి
• దీనిని లోక్ సభ మాత్రమే ప్రవేశ పెట్టాలి.
• ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి పూర్వానుమతి తీసుకోవాలి.
• అగంతుక నిధి రాష్ట్రపతి అధీనం లో ఉంటుంది.
• భారత దేశంలో అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు దీని నుంచి ఖర్చు పెడతారు .
దీని గురించి ఆర్టికల్ 267 తెలుపుతుంది.
•సంఘటిత నిధి పార్లమెంట్ ఆధీనంలో ఉంటుంది .భారత దేశంలో రోజువారీ ఖర్చులకు ఈ నిధి నుంచి స్వీకరిస్తారు .(266 )
అత్యవసర అధికారాలు :-
• అత్యవసర అధికారాలను 18 వ భాగంలో ,ఆర్టికల్ 352 నుంచి 360 వరకు తెలుపుతాయి.
• అత్యవసర అధికారాలు మూడు కలవు .
అవి
• ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి
• ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన
• ఆర్టికల్ 360 ప్రకారం ఆర్ధిక అత్యవసర పరిస్థితి .
• జాతీయ అత్యవసర పరిస్థితిని
విదేశీ దురాక్రమణ
అంతర్గత కలహాలు
జరిగిన సమయాల్లో విధిస్తారు .
• ఇప్పటి వరకు ఆర్ధిక అత్యవసర పరిస్థితి కారణంగా రాష్ట్రపతి పాలన ఒకసారి కూడా విధించలేదు.
భారత రాష్ట్రపతులు
బాబూ రాజేంద్ర ప్రసాద్ (1950-62 ) :-
• బీహార్ కు చెందిన వారు .మొదటి సారి కె.టి.షా ,రెండవ సారి యన్.యన్.దాసు ని ఓడించారు .
• స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతి .
• అత్యంత మెజారిటీతో ఎన్నికయ్యారు .
• ఎక్కువ పర్యాయాలు సుప్రీం కోర్ట్ సలహాలు తీసుకున్నారు .
• సుదీర్ఘకాలం రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి . (12 సం|| 3 నెలల 18 రోజులు )
• హిందూ కోడ్ బిల్లు వివాదం పై ఆమోదించ కుండా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు .
సర్వేపల్లి రాధా కృష్ణన్ (1962-67) :-
• ఆంధ్ర ప్రదేశ్,తమిళనాడులో నివశించారు . వీరి ప్రత్యర్ధి సి.హెచ్.హరి రాయ్
• రెండు సార్లు ఉపరాష్ట్రపతి గా ఒక సారి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు .
• ఈయన జన్మదినం సెప్టెంబర్ 5 ను ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుతారు .
• భారత మొదటి ఉపరాష్ట్రపతి .
• స్టాలిన్ తో దౌత్యవేత్తగా ఇంటర్వ్యూ జరిపిన వ్యక్తి .
• భారత రత్న గ్రహీత ,టెంపుల్టన్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు .
• యునెస్కో చైర్మన్ గా పనిచేశాడు .
• చైనా యుద్ధానంతరం రక్షణ మంత్రిగా కృష్ణమీనన్ ను పదవ్వి నుంచి తొలగించుటకు ప్రధానిపై వత్తిడి తెచ్చారు .
జాకిర్ హుస్సేన్ ( 1967-69 ) :-
• ఉత్తర ప్రదేశ్ కు చెందినవారు .
• హైదరాబాద్ లో జన్మించారు ప్రత్యర్ధి కోకా సుబ్బారావు .
• తొలి ముస్లిం రాష్ట్రపతి .
• అతి తక్కువ కాలం(1 సం|| 11 నెలలు 20 రోజులు ) రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి
• పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి .
వరాహ వెంకట గిరి (మే 3 1969 - జులై 20,1969 ) :-
• తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన తొలి ఉప రాష్ట్రపతి
జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా (జులై 20 1969- ఆగస్ట్ 1969 ) :-
తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించిన ఏకైక సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి .
వరాహ వెంకట గిరి ( 1969-74 ) :-
• ఒడిశాలోని బరంపురం లో జన్మించాడు .
• ప్రత్యర్ధి నీలం సంజీవ రెడ్ది .
• స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి రాష్త్రపతిగా అయిన తొలి వ్యక్తి .
• తొలి కాంగ్రెసేతర రాష్ట్రపతి .
• అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించిన వ్యక్తి .
• సుప్రీం కోర్ట్ విచారణకు హాజరైన తొలి రాష్ట్రపతి .
• కార్మిక ఉద్యమాలలో సంబంధం ఉన్న వ్యక్తి .
• బ్యాంకుల జాతీయకరణ (1969) ,రాజాభరణాల రదు చట్టం పై సంతకం చేసిన రాష్ట్రపతి .
• వాయిస్ ఆఫ్ కన్సెషన్ అనే గ్రంధ రచయిత .
ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ : -
• అస్సాం రాష్ట్రానికి చెందిన వాడు .ప్రత్యర్ధి టి..చతుర్వేది .
• పదవిలో ఉండగా మరణించిన రెండవ రాష్ట్రపతి .
• రెండవ ముస్లిం రాష్ట్రపతి .
• జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రెండవ రాష్ట్రపతి .
• అత్యవసర పరిస్థితి ఆర్డినెన్స్ లు జారీచేసిన రాష్ట్రపతి .
బి.డి.జెట్టి (ఫిబ్రవరి 11 1977 - జులై 25 1977 ) :-
• తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన రెండవ ఉపరాష్ట్రపతి .
నీలం సంజీవరెడ్ది (1977-82) :-
• ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు .
• ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి వ్యక్తి మరియు ఏకైక వ్యక్తి.
• అతి తక్కువ వయస్సులో రాష్ట్రపతి అయిన వ్యక్తి .
• చరణ్ సింగ్ రాజీనామా తర్వాత బాబూ జగజ్జీవన్ రాం కు అవకాశం కల్పించకుండా వివాదాస్పదుడు అయ్యాడు .
• ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగాను పని చేశారు .
జ్ఞానీ జైల్ సింగ్ (1982- 87) :-
• పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు ప్రత్యర్ధి హెచ్.ఆర్.ఖన్నా
• తొలి సిక్కు రాష్ట్రపతి .
• వివాదాస్పద పోస్టల్ బిల్లులో పాకెట్ వీటో ఉపయోగించారు .
• అపరేషన్ బ్లూస్టార్ ఇతని కాలం లోనే జరిగినది .
• ఇతని సమాధి ఏక్తాస్థల్ .
రామస్వామి వెంకట్రామన్ (1987- 92) :-
• తమిళనాడు రాష్త్రానికి చెందిన వారు .ప్రత్యర్ధి క్రిష్ణయ్యర్ .
• అతి ఎక్కువ వయస్సులో రాష్ట్రపతి అయిన వ్యక్తి .
• నలుగురు ప్రధానులచే ప్రమాణ స్వీకారం చేయిచిన వ్యక్తి
• భారతదేశం లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు వి.పి.సింగ్ కు అవకాసం ఇచ్చారు .
శంకర్ దయాళ్ శర్మ (1992- 97) :-
• మధ్య ప్రదేశ్ కు చెందినవారు .
• ప్రత్యర్ధి g.s.స్వెల్ .
• ఆంధ్ర ప్రదేశ్ కు గవర్నర్ గా చేశారు .
• ఇతని సమాధి కర్మభూమి .
కె.ఆర్.నారాయణన్ :-
• కేరళకు చెందిన వారు .ప్రత్యర్ధి టి.యన్.శేషన్ .
• తొలి దళిత రాష్ట్రపతి .
• పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి .
• అత్యధిక మెజారిటీతో గెలిచిన రెండవ రాష్ట్రపతి
• అమెరికాలో భారత రాయభారిగా పనిచేశారు .
• ఇతని సమాధి పేరు ఉదయభూమి
ఎ.పి.జె .అబ్దుల్ కలాం (2002-2007) :-
• తమిళనాడు కు చెందినవారు .
• డి.ఆర్.డి.వో. డైరెక్టర్ గా పనిచేశారు .
• అగ్ని,త్రిశూల్,నాగ్,పృధ్వి క్షిపణులకు పేర్లు పెట్టారు .
• భారత క్షిపణి పితామహుడు .
• 1998 లో పోఖ్రాన్ -2 అణుపరిక్షలకు నాయకత్వం వహించారు .
• 1981 లో పద్మ భూషన్ ,1997 లో భారత రత్న అవార్డ్ లు పొందారు .
• రాష్ట్రపతి భవన్ ను ప్రజా దర్బార్ గా మార్చి విన్నపాలు స్వీకరించారు .
• సుఖోయ్ యుద్ధ విమానం లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి .
• లాభదాయక పదవుల విషయంలో సస్పెన్సివ్ వీటో ఉపయోగించారు .
• కలాం రచనలు - విజన్ 2020,మై జర్నీ,ద గైడింగ్ లైట్ మొదలగునవి.
• ఈయన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్
• ఇతని నినాదాలు -చిన్న లక్ష్యం నేరం ,సమస్యలకు పోరాటం దేవుడు ఇచ్చిన వరం
• వీరి పుట్టిన రోజు అక్టోబర్ 15 ను అంతర్జాతీయ విద్యార్ధి దినోత్సవం గా ఉనొ ప్రకటించింది .
ప్రతిభా పాటిల్ (2007-2012):-
• మహారాష్ట్రకు చెందిన వారు .
• భారత మొదటి మహిళా రాష్ట్రపతి .
• బ్రిటన్ రాణి ఆహ్వానం అందుకున్న తొలి దేశాధినేత .
• టి-90 యుద్ధ ట్యాంక్ లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి .
ప్రణభ్ ముఖర్జీ (2012-2017) :-
•రాష్త్రపతి పదవి పొందిన తొలి బెంగాలీ .
• అతి తక్కువ వయస్సులో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి .
• తనకు తానే ఓటు వేసుకున్న వ్యక్తి .
రాం నాథ్ కోవింద్ (2017- ___):-
• రాష్ట్రపతి భవన్ లో అడుగిడిన తొలి బీజేపీ నాయకుడు .
• వాజపేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో భారత్ కు ప్రాతినిధ్యం వహించారు .
• 2016-2017 లో బీహార్ గవర్నర్ గా చేశారు .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.