కేంద్ర స్థాయిలో ప్రభుత్వం

• దేశం లో ప్రభుత్వాలు రెండుస్థాయిలలో కలవు
• కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం
•రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం :-
•కేంద్రంలో ప్రభుత్వ పాలనకై మూడు అంగాలను ఏర్పాటు చేసారు .
1) కార్య నిర్వాహక శాఖ (Executive):-
రాష్ట్రపతి
ప్రధానమంత్రి - మంత్రి మండలి
ఉపరాష్ట్రపతి
2) శాసన నిర్మాణ శాఖ (Legislative):-
లోక్ సభ స్పీకర్
రాష్ట్రపతి
రాజ్యసభ అధ్యక్షులు
3) న్యాయ శాఖ (Judiciary):-
సుప్రీం కోర్ట్
చీఫ్ జస్టిస్- న్యాయమూర్తులు

• కేంద్ర శాసన నిర్మాణ శాఖ శాసనాలు రూపొందిస్తుంది .
• శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలు అమలుపరచునది కార్యనిర్వాహణ శాఖ
• అనగా రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ,మంత్రి మండలి
• పార్లమెంట్ అనగా రాష్ట్రపతి ,లోక్ సభ మరియు రాజ్య సభ
• రాజ్యాంగరీత్యా ప్రభుత్వాధికారి ప్రధానమంత్రి,మంత్రి మండలి
• ప్రభుత్వాధికారం అంతా రాష్ట్ర పతి పేరు మీద జరుగును .
• రాష్ట్ర పతి అతన అధికారాలు స్వయంగా చలాయించక మంత్రిమండలి సలహా ప్రకారం చేస్తాడు .
• నాల్గవ అంగమైన వార్తాపత్రికను ఫోర్త్ ఎస్టేట్ అంటారు .