కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
•ప్రపంచంలో రాజ్యాంగం అనే పదాన్ని మొదటి సారి ఉపయోగించినవారు - అరిస్టాటిల్
•ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం - భారత రాజ్యాంగం
•ప్రపంచంలో చిన్న రాజ్యాంగం -అమెరికా రాజ్యాంగం
•ప్రపంచంలో ఎక్కువ సార్లు రద్దైన రాజ్యాంగం - ఫ్రెంచి రాజ్యాంగం
భారత దేశంలో రాజ్యాంగ పరిణామం :-
•భారత రాజ్యాంగ పరిణామాన్ని బి.పి,రావత్ 6 దశలుగా విభజించారు .
మొదటి దశ(1600- 1773):-
•ఈస్టిండియా కంపెనీ తూర్పు దేశాల వ్యాపారానికి ఎలిజిబెత్ రాణి 1600 డిసెంబర్ 31 న అనుమతించింది .
•ఈ కంపెనీ భారతదేశం లో 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంది - బెంగాల్,బొంబాయి,మద్రాస్
రెండవ దశ (1773- 1858):-
రెగ్యులేటింగ్ చట్టం -1773
•భారత్ లో బ్రిటీష్ వారు చేసిన మొదటి లిఖిత చట్టం
•ఈస్టిండియా కంపెనీ పాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించటం కోసం ప్రవేశపెట్టబడిన చట్టం
•ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చారు
•మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ -వారన్ హేస్టింగ్స్
•కోల్ కత్తా లోని పోర్టు విలియం కోటలో 1774 లో సుప్రింకోర్టుని ఏర్పాటు చేసారు .
•సుప్రీంకోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి - ఎలీజా ఇంఫే
•భారత దేశంలో మొదటి మున్సిపల్ కార్పోరేషన్ - మద్రాస్ (1687)
1781 విస్తరణ చట్టం:-
•బ్రిటిష్ ప్రభుత్వం మొదటి సారిగా మనదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని ఈ చట్టం ద్వారా ప్రస్తావించినది
పిట్స్ ఇండియా చట్టం 1784 (వారన్ హేస్టింగ్స్ ):-
•రెగ్యులేటింగ్ చట్టం లోని లోపాలను సవరించటంకోసం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు .
•ఈస్టిండియా కంపెనీలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడినది .
•కంపెనీ వ్యవహారాలను రెండుగా విభజించారు .
1) బోర్డ్ ఆఫ్ కంట్రోల్
2) కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్
•గవర్నర్ కౌన్సిల్ లో సభ్యుల సంఖ్య 4 నుండీ 3 కి తగ్గించారు .
1813 చార్టర్ చట్టం :-
•ఈస్టిండియా కంపెనీకి మరో 20 సంవత్సరాలు అధికారం ఇవ్వబడినది .
•భారత దేశం లో ఆధునిక విద్యాభివృద్ధికి మొదటి సారిగా ఒక లక్ష రూపాయిలు కేటాయించబడినది .
•స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించే అధికారం ,అవకాశం కల్పించారు .
1833 చార్టర్ చట్టం (విలియం బెంటింక్ ):-
•ఈస్టిండియా కంపెనీకి మరో 20 సంవత్సరాలపాటు అధికారాన్ని ఇచ్చింది.
•ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీని ట్రస్ట్ గా మార్చారు .
•బెంగాల్ గవర్నర్ జనరల్ ను భారత గవర్నర్ జనరల్ గా మార్చారు .
•మొదటి భారత గవర్నర్ జనరల్ - విలియం బెంటింక్
•భారత శాసనాలను క్రోఢీకరించుటకు మెకాలే అధ్యక్షతన భారతీయ లా కమీషన్ ఏర్పాటు చేయటం జరిగినది.
•ఈ చట్టం ప్రకారం బానిసత్వం రద్దు చేయబడినది.
•సివిల్ సర్వీసుల నియామకాలలో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు.
1853 చార్టర్ చట్టం:-
•చివరి చార్టర్ చట్టం .
•సివిల్ సర్వీసుల నియామకాలు పోటీ పరిక్షల ద్వారా జరిగాయి.
•1843 లో లర్డ్ ఎలిన్ బరో బానిసత్వాన్ని రద్దు చేసాడు .
•1853 చార్టర్ చట్టం ద్వారా లా కమీషన్ సిఫారసు ప్రకారం 1859 లో సివిల్ ప్రొసీజర్ కోడ్ ను ,1860 లో ఇండియన్ పీనల్ కోడ్ ను ,1861 లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను రూపొందించారు .
కౌన్సిళ్ళ చట్టాలు :-
•1773-1858 వరకు ఈస్టిండియా పాలన భారత దేశం లో కొన సాగింది .ఈ కాలం లో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అని అంటారు .
•1858 నుండి భారత దేశానికి సంబంధించి చేయబడిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు .
మూడవ దశ (1858-1909):-
1858 భారత ప్రభుత్వ చట్టం:-
•1858 భారత ప్రభుత్వ చట్టానికి ఆధారభూతమైన ప్రకటన -విక్టోరియా మహారాణి ప్రకటన
•భారత దేశం లో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దు చేయబడినది .
•గవర్నర్ జనరల్ పదవిని వైశ్రాయ్ లేదా రాజ ప్రతినిధిగా మార్చటం జరిగినది .
•మొదటి భారత రాజ్య కార్య దర్శి - సర్ చార్లెస్ వుడ్
•మొదటి వైశ్రాయ్ -లార్డ్ కానింగ్
•చిట్టచివరి వైశ్రాయ్ - లార్డ్ మౌంట్ బాటెన్
1861 భారత కౌన్సిల్ చట్టం:-
•ఈ చట్టం ద్వారా పోర్ట్ పోలియో ప్రవేశ పెట్టటం జరిగినది.
•ఈ చట్టం ప్రకారం తొలిసారి భారత దేశం లో శాసన మండలి లను ఏర్పాటు చేసారు .
•ఈ చట్ట ప్రకారం 1862 లో తొలి హైకోర్ట్ కలకత్తాలో ఏర్పాటు చేసారు .
•ఈ చట్టం ద్వారా పోర్ట్ పోలియో విధానం ప్రవేశపెట్టబడినది .
•1861 లో పోలీసు చట్టం ,పోలీసు శాఖ ఏర్పాటు చేయబడ్డాయి.
1892 భారత కౌన్సిళ్ళ చట్టం:-
•కేంద్ర శాసన సభలలో అనధికార సభ్యుల సంఖ్య 10-16 మధ్య ఉంటుంది.
•రాష్ట్ర శాసన సభలలో 8-20 మధ్య ఉంటుంది .
•అనధికార సభ్యులు బడ్జెట్ పై చర్చించవచ్చు.
జాతీయోద్యమం
•1885 వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది .
•బాంబే లో జరిగిన మొదటి సమావేశానికి W.C బెనర్జీ అధ్యక్షత వహించారు .
•భారత జాతీయోద్యమాన్ని ప్రముఖ చరిత్రకారుడు ఆర్.సి.మంజుదార్ మూడు దశలుగా విభజించాడు
1)అతివాద దశ
2) మితవాద దశ
3) గాంధీయుగం
•1905 లో లార్డ్ కర్జన్ బెంగాల్ ను రెండుగా విభజించాడు .
•1906 సం|| లో ఢాకా నవాబైన సలీముల్లా ఖాన్ ముస్లిం లీగ్ స్థాపించారు .
•1907 సం|| లో సూరత్ లో జర్గిన INC సమావేశం లో మితవాదులు ,అతివాదులుగా చీలిపోయారు .
నాల్గవ దశ (1909- 1935):-
భారత కౌన్సిళ్ళ చట్టం -1909 (మింటో మార్లే చట్టం ):-
•కేంద్ర,రాష్ట్ర శాసన సభలలో సభ్యుల సంఖ్యను పెంచారు .
•కేంద్రశాసన మండలి లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం 16 నుంచి 60 కి పెంచారు.
•ముస్లిం లకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించటంజరిగినది.
•1911 లో భారత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీ కి మార్చారు .
భారత ప్రభుత్వ చట్టం -1919
•కేంద్ర శాసన సభలల్లో మొదటి సారిగా ద్వి సభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
•కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేశారు.
•సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ ను వేరు చేశారు.
సైమన్ కమీషన్ (1927):-
•1919 భారత ప్రభుత్వ చట్టం యొక్క పనితీరుని పరిశీలించటానికి సైమన్ కమీషన్ ను 1927 లో ఏర్పాటు చేశారు .
•ఈ కమిటీ సభ్యులందరూ బ్రిటీషువారు కావటంతో INC దీనిని తెల్లవాళ్ళ సంఘం గా పేర్కొంది .
•సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చారు భారతీయులు
•సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా లాహోర్ లో పోరాడినవారు -లాలా లజపతి రాయ్
•లాలాలజపతిరాయ్ ను ఈ వ్యతిరేక ప్రదర్శనలో లాఠీ చార్జ్ ద్వారా చంపిన బ్రిటీష్ అధికారి -పాల్ సాండర్స్
నెహ్రూ రిపోర్ట్ (1928):-
•భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ 1927 నవంబర్ బ్రిటిష్ ఎగువ సభలో మాట్లాడుతూ అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా అనే సవాలు విసిరారు .
•ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928 మే 19 న బొంబాయిలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి
•రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో 1928 ఆగష్టు 10 వ తేదీన ఒక ఉపసంఘాన్ని నియమించింది .
ముఖ్యాంశాలు :-
•భారతదేశాన్ని డొమీనియన్ ప్రతిపత్తి ఇవ్వటం
•భాషా ప్రయుక్త రాష్ట్రాలు ,స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే రెండు అంశాల ఆధారంగా దేశం లో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయటం
•కార్యనిర్వహణ శాఖకు ,శాసన శాఖకు భాద్యత వహించటం
•19 ప్రాధమిక హక్కుల పస్థావన
రౌండ్ టేబుల్ సమావేశాలు :-
•సైమన్ కమీషన్ నివేదికలోని అంశాలపై చర్చించి భారతీయుల అభిప్రాయాలను తీసుకోని భవిషత్ లో భారత్ లో ప్రవేశ పెట్టబోయే చట్టాలకు రూపకల్పన చేయటం కోసం
•లండన్ లో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసినారు .
•మొదటి రౌండ్ టేబుల్ సమావేశం - 1930
•రెండవ రౌండ్ టేబుల్ సమావేశం-1931
•మూడవ రౌండ్ టేబుల్ సమావేశం-1932
•మూడు సమావేశాలకు హాజరైన భారతీయుడు -బి.ఆర్ .అంబేద్కర్
•రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక మహిళ - సరోజినీ నాయుడు
ఐదవ దశ(1935-1947):-
1935 భారత ప్రభుత్వ చట్టం :-
•ఈ చట్టం 1935 ,ఏప్రియల్ 1 న అమలుచేయబడినది .
•బ్రిటీషువారి కాలం లో చట్టాలలో అత్యంత విస్తృతమైనది .
•ఈ చట్టం ద్వారా కేంద్రం లో ద్వంద్వ పాలన ఏర్పాటు చేశారు .
•ఈ చట్టం భారత దేశం లో అఖిల భారత సమాఖ్య వ్యవస్థను ఏర్పరిచినది .
•ఈ చట్టం ద్వారా ప్రభుత్వ అధికారాలను 3 జాబితాలుగా విభజించారు .
1)కేంద్ర జాబితా
2)రాష్ట్ర జాబితా
3)ఉమ్మడి జాబితా
•ఈ చట్టం ద్వారా ఇండియా నుంచి బర్మాను వేరు చేశారు .
•రాష్ట్రాలకు స్వయం పాలనా అధికారం ఇచ్చారు .
•ఈ చట్టం లో భాగం గానే మహిళలకు తొలిసారిగా ఓటు హక్కును కల్పించారు
•ఈ చట్టం ద్వారా RBI 1935 లో ఏర్పాటు చేసారు .
1947 అట్లీ ప్రకటన :-
• బ్రిటిష్ ప్రధాని క్లేమెంట్ అట్లీ ప్రసంగిస్తూ 1948 జూన్ 30 నాటికి భారత్ లో బ్రిటిష్ ప్రభుత్వం అంతమవుతుందని ప్రకటించాడు .
•ఈ ప్రకటనలో పాకిస్తాన్ ఏర్పాటు అంశం లేదని ముస్లిం లీగ్ తీవ్ర నిరసన వ్యక్తంచేసింది .
•భారత విభజన అంశాన్ని అట్లీ మౌంట్ బాటెన్ కు అప్పగించాడు
లార్డ్ మౌంట్ బాటెన్ పథకం :-
•భారత దేశం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యకు దేశ విభజన పరిష్కారం అంటూ ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు .
•దీనినే డిక్కీబర్డ్ పథకం అంటారు .
•భారత దేశం భారత్-పాకిస్తాన్ అనే రెండు డొమినియన్ రిపబ్లిక్ లుగా విభజించబడతాయి .
•హిందువులు ఎక్కువగా నివశించే ప్రాంతాలు భారత్ లోను ,ముస్లిం లు ఎక్కువగా నివశించే ప్రాంతాలు పాకిస్థాన్ లోను భాగం అవుతాయి .
•స్వదేశీ సంస్థానాలు భారత్ లో కానీ లేక పాకిస్థాన్ లోకానీ విలీనం కావచ్చును .
ఆరవ దశ (1947-1950):-
1947 భారత ప్రభుత్వ చట్టం :-
•ఇది ఆంగ్లేయులచే చేయబడిన చివరి చట్టం
•ఈ చట్టం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటం జరిగినది .
•భారత దేశాన్ని ఇండియా-పాకిస్థాన్ అనే రెండు దేశాలుగా విభజించారు .
•బ్రిటిష్ రాజు లేదా రాణికి ఉన్న భారత చక్రవర్తి అన్న బిరుదు కూడా రద్దు అయినది .
•ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని తొలిసారి ప్రకటించిన వ్యక్తి - మహ్మద్ ఇక్బాల్
•పాకిస్థాన్ అనే పదాన్ని సృష్టించి ,ముస్లిం లకు ప్రత్యేక దేశం ఉండాలని ప్రకటించిన వ్యక్తి -రెహ్మత్ అలీ
•భారత దేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన బ్రిటన్ ప్రధాని -అట్లీ
•స్వాతంత్య్ర భారతదేశ మొట్టమొదటి మరియు చిట్టచివరి భారతీయ గవర్నర్ జనరల్ - సి.రాజగోపాలాచారి .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.