షోడశ మహాజన పదాలు - మగధ వైభవం
•దీనిని బుద్ధుని యుగం, షోడశ మహాజన పదాల యుగం అని పిలుస్తారు .
రాజకీయ పరిస్థితులు :-
•అంగుత్తర నికయ అనే బౌద్ధమత గ్రంధంలో 16 రాజ్యాల వివరాలు ఉన్నాయి.
•వీటినే షోడశ మహాజన పదాలు అని పిలిచేవారు .
•జైన మత గ్రందాలు ప్రాకృత బాషలో వ్రాయబడ్డాయి .
•బౌద్ధ మత గ్రంధాలు పాళీ బాషలో వ్రాయబడ్డాయి .
•ప్రాకృతం సామాన్య ప్రజల బాష .
•షోఢశమహాజన పదాలు గురించి మొదటగా పేర్కొన్నది సుత్త పీఠకంలోని "అంగుత్తర నికాయ" .
క్రీ.పూ 6 వ శ||లో ఏర్పడిన 16 జన పదాలు:-
రాజ్యం - రాజ ధానులు:-
1.మగధ(బీహార్) | రాజగృహ(గిరి వజ్రము ) |
2.అంగ (బీహార్) | చంపా నగరి |
3.కాశి (ఉత్తర ప్రదేశ్ ) | వారణాశి |
4.కోసల(ఉత్తర ప్రదేశ్ ) | శ్రావస్థి |
5.వత్స (ఉత్తర ప్రదేశ్ ) | కౌశాంబి |
6.కురు (ఉత్తర ప్రదేశ్ ) | హస్తినాపూర్ / ఇంద్రప్రస్థ |
7.వజ్జి (బీహార్) | వైశాలి |
8.మల్ల (బీహార్) | పావ , కుషి నార (ఇవి పుణ్య క్షేత్రాలు) |
9.మత్స్య (రాజస్థాన్) | విరాట |
10.శౌరసేన(ఉత్తర ప్రదేశ్ ) | మధుర |
11.చేది (మధ్య ప్రదేశ్ ) | సుక్తి మతి |
12.అవంతి (మధ్య ప్రదేశ్ ) | ఉజ్జయిని |
13.పంచాల (ఉత్తర ప్రదేశ్ ) | అహిచ్చత్రము & కాంపిల్య్ |
14.గంధార (ఆఫ్ఘనిస్తాన్) | తక్ష శిల |
15.కాభోజ (పాకిస్తాన్) | రాజ పురం |
16.అస్మక | పోదన ,పటన(బోధన) |
• షోడశ మహాజన పదాలలో నర్మదా నదికి దక్షిణాన లేదా దక్షిణ భారత దేశంలో విస్తరించి ఉన్న ఏకైక రాజ్యం -అస్మక
• దీని రాజధాని బోధన్ (పోదన) నిజామాబాద్ జిల్లాలో కలదు .
• వీటిలో గణరాజ్యాలు (రాజుకి ప్రజలను ఎన్నుకొనేవి) - మల,వజ్జి
మగధ వైభవం :-
•షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం అత్యంత శక్తి వంతంగా రూపు దిద్దుకుంది .దీనికి కారణాలు
1.సారవంతమైన గంగా మైదానంలో విస్తరించి ఉండుట
2.మగధ సమీపంలో ఇనుప గనులుండుట
3. సమీపం లోని అడవులలో ఏనుగులు లభించుట
4.పీఠభూమి , పర్వత ప్రాంతాలు కోటల నిర్మాణంకు అనుకూలంగా ఉండుట.
మగధను పాలించిన వంశాలు:-
1. హర్యాంక
2.శిశునాగు
3.నంద
4.మౌర్య
5.శుంగ
6.కణ్వ
హర్యంక వంశం (క్రీ.పూ 545-413):-
• ఇతి హాస కాలంలో మగధను బృహదృద వంశస్థులు పాలించారు .
• జరా సంధుడు ఈ వంశానికి చెందినవాడు .
• రిపుంజయుడు ఈ వంశంలో చివరి వాడు .
• ఇతనిని ఓడించి హర్యాంక వంశం ను బింబిసారుడు స్థాపించాడు .
• ఇతను బుద్దుని సమకాలీకుడు .
• ఇతని ఆస్థన వైద్యుడు జీవకుడు
• ఇతను సేనియ అనే బిరుదు పొందాడు
• కోసల రాణి కోసల మహాదేవి ని వివాహం చెసుకొని కాశీని వరకట్నం గా తీసుకున్నాడు.
అజాత శత్రువు :-
• బింబిసారుని కుమారుడు అజాత శత్రువు .ఇతని బిరుదు కుణీక .
• ఇతడు తండ్రిని చంపి రాజ్యానికి వచ్చాడు . ఇతనిని పితృ హంతకుడిగా బౌద్ధ గ్రందాలు నిందిస్తున్నాయి .
ఇతను ప్రవేశ పెట్టిన నూతన ఆయుధాలు :-
1.మహాశిల కంటక - పెద్ద రాళ్ళను విసిరే యంత్రం .
2.రధము సలము - రధానికి కట్టిన ఇనుప దూలం .
• కోసల , వజ్జి , మల్ల రాజ్యాలను జయించాడు .
• 16 సం|| యుద్దం చేసి జయించిన రాజ్యం - వజ్జి .
• ఇతను , గంగా , సోన్ నదుల సంగమ స్థానంలో "పాటలీపుత్రం" అనే నూతన నగరాన్ని నిర్మించాడు .
• ఇతను బుద్దుని శిష్యుడిగా మారాడు .
• బుద్ధుని మరణానంతరం రాజగృహంలో మొదటి బౌద్ధ సంగీతి ను ఏర్పాటు చేశాడు.
• ఇతని ప్రియురాలు అమ్రపాలి అనే రాజ నర్తకి .
• ఇతను రాణుల సమేతంగా బుద్ధుని సందర్శించినట్లు బార్హుత్ స్థూపం తెలుపుతుంది .
ఉదయనుడు :-
• ఇతను పాటలీ పుత్రమ్ను రాజధాని నగరంగా చేశాడు .
• ఈ వంశంలో చివరి వాడు నాగ దాసకుడు .
శిశు నాగ వంశం క్రీ.పూ (413-364 )
1. శిశు నాగుడు :-
• ఇతడు శిశునాగ వంశ పాలనను మగధలో స్థాపించాడు .
2.కాలాశోకుడు (శిశునాగుని కుమారుడు ) :-
• ఇతను వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతి ని నిర్వహించాడు .
• ఇతను వంశంలో చివరి వాడు .
• ఇతని సేనాధిపతి మహాపద్మనంధుడు .
• ఇతడిని చంపి మగధను ఆక్రమించాడు .
నంద వంశం (క్రీ.పూ.364-321)
మహా పద్మ నందుడు:-
•ఇతను నంద రాజ్య స్థాపకుడు .
•క్రీ.పూ.364 ప్రంతంలో మగధకు రాజయ్యాడు .
• షోడశ మహా జాన పదాలలో మిగిలిన రాజ్యాలన్నీటినీ జయించాడు .
• కళింగను జయించినట్టు హతీగుఫా శాసనం తెలుపుతుంది .
• భారత దేశాన్ని పాలించిన మొదటి శూద్ర వంశం నంద వంశం .
• గ్రీకు రచయితలు ఇతన్ని అగ్రమింగా వర్ణించారు
• హేమ చంద్రుని పరిశిష్ట పర్వాన్ ఇతనిని శూద్రునిగా వర్ణిస్తుంది.
• ఇతను జైన మతాభిమాని.
2.ధన నందుడు :-
• నంద వంశంలో చివరి వాడు .
• క్రీ.పూ 321 లో ధన నందుని ఓడించి చంద్ర గుప్త మౌర్యుడు మౌర్య వంశాన్ని స్థాపించాడు .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.