•జైన మత ప్రవక్తలను
తీర్దంకరులు అన్నారు . వీరు 24 మంది .
•తీర్దంకరులు అనగా జీవ ప్రవాహం దాటుటకు వారధిని నిర్మించేవారు .
తీర్ధంకరుడు |
పేరు |
గుర్తు |
1 వ తీర్ధంకరుడు |
వృషభనాభుడు | ఎద్దు |
22 వ తీర్ధంకరుడు |
నేమినాథ | సముద్రపు గవ్వ |
23 వ తీర్ధంకరుడు |
పార్శ్వ నాథుడు | పాము |
24 వ తీర్ధంకరుడు |
మహావీరుడు | సిం హం |
•మొదటి 22 మంది తీర్ధంకరుల వివరాలు లేవు .
•వీరు పౌరాణిక వ్యక్తులు 23 ,24 తీర్దంకరుల చారిత్రక వ్యక్తులు .
•పార్శ్వనాధుడు క్రీ.పూ 8 వ శతాబ్ధానికి చెందిన వాడు . ఇతడు కాశి యువరాజు .
•ఇతను తండ్రి పేరు అశ్వసేనుడు , తల్లి వామలాదేవి.
•30 వ యేట సన్యాసం తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
•ఇతను ప్రారంభించిన మతం పేరు నిర్ఘంద అనగా ప్రాపంచిక బంధాలను తెంచుకున్నవాడు .
•ఇతను నాలుగు సూత్రాలు ప్రతిపాదించాడు.
అవి .
1.అహింస - హింసను విడిచి పెట్టాలి .
2.అసత్యం - అబద్దం చెప్పరాదు .
3.అపరిగ్రహం - అధిక ఆస్తిని సమకూర్చుకోరాదు.
4.అసతేయ - దొంగతనం చేయరాదు .
మహా వీరుడు (క్రీ.పూ. 540-468):-
•ఇతను బీహార్ లోని వైశాలి సమీపంలో కుంద గ్రామంలో జన్మించాడు .
•ఙ్ఞాత్రిక వంశానికి చెందిన క్షత్రియుడు .
•తండ్రి సిద్ధార్దుడు , తల్లి త్రిశాల దేవి .
•ఇతని భార్య యశోద . కుమార్తె - ప్రియ దర్శిని . అల్లుడు - జామాలి .
•తల్లి తండ్రులు చనిపోయాక తన 30 వ యేట సన్యాసిగా మారాడు .
•5 సం|| ల పాటు అజీవక మత స్థాపకుడు గోశాల మస్కరి పుత్రిని వద్ద శిష్యరికం చేశాడు.
•మహావీరుడు సన్యాసిగా మారిన 12 సం || ల తర్వాత తూర్పు భారత దేశంలోని జృంబికా గ్రామం వద్ద ఋజుపాలిక నదీ తీరాన సాల వృక్షం క్రింద ఙ్ఞానోదయం అయింది .
•తన 42 వ ఏట కైవల్యం పొంది జీనుడయ్యాడు .
•ఇతని బిరుదులు - కేవలి , జీనుడు , నిర్ఘంధుడు ,దేహ దిన్న .
•కేవలి - కైవల్య ఙ్ఞానం పొందిన వాడు ,
•జిన - ఇంద్రియాలు జయించిన వాడు
•జినుడు-యొక్క అనుచరులు జైనులు .
•మహావీరుని మొట్ట మొదటి శిష్యుడు -జామాలి (అల్లుడు)
•చారిత్రకంగా జైన మత స్థాపకుడు - పార్శ్వ నాధుడు .
•సాంప్రదాయకంగా జైన మత స్థాపకుడు - వృషభ నాధుడు .
•జైన మత వాస్తవ స్థాపకుడు - వర్ధమాన మహావీరుడు .
•ముక్తిని సాధించటానికి సల్లేఖన వ్రతమును ఆశ్రయించాలి.
•మహా వీరుడు తన 72 వ యేట పావ నగరంలొ సల్లేఖన వ్రతం ఆచరించి మరణించాడు.
జైన మత సిద్ధాంతాలు :-
పంచ వ్రతాలు:-
1.అహింస
2.అసత్య
3.అసతేయ
4.అపరిగ్రహ
5. బ్రహ్మ చర్యం
త్రిరత్నాలు :-
1.సమ్యక్ క్రియ 2.సమ్యక్ ఙ్ఞానం 3.సమ్యక్ విశ్వాసం
జైన మతంలోని చీలికలు :-
•క్రీ . పూ 300 కాలంలో జైనం రెండు శాఖలుగా విడి పోయింది.
1. శ్వేతాంబరులు
2. దిగంబరులు
•శ్వేతాంబరులు 23వ తీర్ధంకరుని అనుచరులు
•శ్వేతంబర శాఖకు నాయకుడు - స్థూల భద్రుడు .
•దిగంబర శాఖకు నాయకుడు - బద్రబాహు .
•క్రీ .శ 12 వ శతాబ్దంలో జీవించిన హేమ చంద్రుడు (కలికాల సర్వఙ్ఞ ) అనే గుజరాతి వాసి . "పరిశిష్టపర్వన్" లో శ్వేతంబరులు , దిగంబరులు గూర్చి వ్రాశాడు .
•దిగంబర జైన మతానికి పుట్టిన ప్రాంతం "శ్రావణ బెళగొల" కర్ణాటక.
•శ్రావణ బెల్గోళాలోని చాలా పెద్దదైన గోమఠేశ్వర లేదా బాహుబలి విగ్రహం గలదు .
•శ్రావణ బెళగొలలో 12 సం" ఒకసారి " మహామస్తకాభిషేకం" జరుగుతుంది.
•క్రీ . శ . 982 లో మైసూర్ ను పాలించే రాచమల్లుడు యొక్క మంత్రి.
•"చాముండ రాయలు " ఈ విగ్రహాన్ని నిర్మింప చేశాడు . రాచమల్లుడు పశ్చిమ గంగా వంశానికి చెందిన వాడు .
జైన మత సమావేశాలు :-
•మొదటి సమావేశం క్రీ. పూ . 3 శతాబ్దంలో పాటలీ పుత్రంలో జరిగింది.
•దీనిని దిగంబరులు బహిష్కరించారు.ఇక్కడ 12 అంగాలు క్రొడీకరించారు .
•రెండవ సమావేశం క్రీ.శ. 5 లేద 6 వ శతాబ్దంలో " వల్లభి " (గుజరాత్) నగరంలో జరిగింది.దీనిని శ్వేతాంబరులు నిర్వహించారు.
•దీనికి అధ్యక్షుడు " దేవర దక్షమశ్రమణ"
•ఇచ్చట జైన మత పవిత్ర గ్రంధాలు సంస్కరించబడ్డాయి.
•వీటిని ద్వాదశాగములు(12) అంటారు .
•ప్రముఖ జైన నిర్మాణాలు
1.ఒడిషాలోని హతీగుఫా గుహలు , ఉదయగిరి , కందగిరి ప్రాంతాలు.
2.మౌంట్ అబూ (రాజస్థాన్ ) లోని దిల్వారా ఆలయం.
3.బీహార్ పావా, రాజగృహ జైనాలయలు
4.కర్ణాటక లోని శ్రావణ బెల్గోళ .
క్రీ .పూ 6 వ శతాబ్దంలో ఏర్పడిన ఇతర మతాలు :-
అజీవక మతం :-
•దీని స్థాపకుడు గోశాల మస్కరిపుత్రుడు.
•మానవుని ప్రతిచర్య విధి నిర్ణయాత్మకమైనదని విశ్వసించారు.
•దీనినే నియత విధి అంటారు .
•అన్ని రకాల అనుభవాలు ఉండే జీవితాన్ని గడిపే "సంసార విశుద్ధి" మార్గాన్ని అనుసరించారు .
•ఈ మతాన్ని ఆచరించిన మౌర్య చక్రవర్తి - బిందుసారుడు.
లోకాయతన మతం :-
•వీరినే చార్వాకులు అంటారు .
•చార్వాణ అనగా తినుట . జీవించినంత కాలం సుఖాలు అనుభవించాలని వీరి వాదన.
•ఇది సంపూర్ణ బౌతిక వాదాన్ని అనుసరించాలని భోదించారు .
•మరణాంతరం మానవుని దేహం మట్టి , నీఎరు , అగ్ని , వాయువు అనే వాటిలో కలసిపోతాయని విశ్వసించారు .
•భౌతిక చర్యలు ఆత్మను అంటజాలవని భావించారు
•దీని స్థాపకుడు - అంజిత కేశ కంబలిన్.
పురాణ కాశ్యప :-
•ఇతను ఆత్మ ,శరీరం వేర్వేరు అని వాదించాడు .
•ఇతని భోదనలు ఆధారం అభివృద్ది చెందింది - సాంఖ్య సిద్దాంతం
పకుద కాత్సాయన :-
•విచారం , జీవితమును , సంతోషం ను ఎవరూ నాశనం చేయలేరని ఇతను వాదించాడు .