బౌద్ధ మతం

గౌతమ బుద్ధుడు (563-483)
జననం లుంబినీ వనం (పద్మం)
మహాభినిష్క్రమణంకపిలవస్థు (గుర్రం)
సంబోధి గయ (బోధి వృక్షం)
ధర్మ చక్ర పరివర్తనం సారనాధ్ (చక్రం)
మరణంకుసీనగరం (స్థూపం )
•క్రీ.పూ 6 వ శతాబ్దంలో హిందూ మతానికి వ్యతిరేకంగా 62 మత ఉద్యమాలు జరిగాయి వాటిలో ప్రదానమైనవి .
1.బౌద్ధ మతం
2. జైన మతం
3. అజీవిక
4.చార్వాక
బౌద్ధమతం :-
•బుద్ధుడు మొదట ప్రస్థావించిన విదేశీయుడు - క్లిమెంట్
•ఈ మతాన్ని గౌతమ బుద్ధుడు క్రీ.పూ 563-483 స్థాపించాడు .బుద్ధుని అసలు పేరు సిద్ధార్ధుడు .
•బుద్ధునికి గల ఇతర పేర్లు - శాక్యముని , తధాగతుడు , అంగీరసుడు అని కూడా పిలుస్తారు .ఇతను గౌతమి గోత్రానికి చెందిన వాడు .
•ఇతడు శాఖ్య తెగకు చెందిన వాడు .ఇతనిని శాక్యముని అని కూడా పిలుస్తారు .
•శాఖ్య తెగ కపిలవస్తు అనే రాజ్యాన్ని పాలించింది .
•తండ్రి శుద్ధోధనుడు , తల్లి మహా మాయ.
•మహామాయ కపిలస్తు నుంచి , శ్రావస్థకి వెలుతుండగా మార్గ మధ్యలో "లుంబిని" అనే గ్రామంలో సిద్ధార్ధుడు జన్మించాడు .
•సిద్ధార్ధుడు జన్మించిన ఏడు దినములకు మహా మాయ చనిపోగా , అతని పిన తల్లి గౌతమీ ప్రజాపతి ఇతడిని పెంచి పోషించింది.
•బౌద్ధమతంలో చేరిన మొదటి మహిళ గౌతమీ ప్రజా పతి .
•సిద్దార్ధుని భార్య పేరు యశోదర , కుమారుడు - రాహులుడు , రధ సారధి-చెన్న.
•బుద్ధుడి గుర్రం పేరు "కంఠక"
•29 వ ఏట కపిలవస్తు నగరంలో నాలుగు అంశాలను గమనించాడు
1. వృద్దుడు
2.రోగి
3.శవం
4.సన్యాసి
•ఈ దృశ్యాల ప్రభావం వలన ఙ్ఞానన్వేషణ చేయుచు ఇల్లు వదిలి వెల్లిపోయాడు .
•ఈ ఘటనను "మహాభినిష్క్రమణం" అంటారు.
•బుద్ధుని గురువులు - రుద్రక రామ పుత్ర , అలారకలామ .
•35 ఏళ్ళ వయసులో "గయ" లో భోది వృక్షం క్రింద 49 రోజులు ధ్యానం చేశాడు.
• బీహార్ లోని గయ నిరంజన నదీ తీరాన గలదు. ఇచ్చటనే బుద్ధుడు ఙ్ఞానోదయం పొందాడు . దీనిని "సంబోధి " అని పిలుస్తారు .
•ఈ చెట్టు పై నుండి బుద్ధుని దీక్ష భగ్నం చెయటానికి ప్రయత్నించింది "మార" అనే దుష్ట శక్తి .
•అప్పటి నుంచి సిద్దార్ధుడు బుద్ధుడు అయ్యాడు.బుద్ధుడు అనగా పూర్ణ జ్ఞానం కలవాడు .
•ఙ్ఞానోదయం తర్వాత సార్ నాధ్ లోని జింకల వనంలో మొదటి సారిగా తన ఐదుగురు శిష్యులకి ఉపదేశం చేశాడు .
•ఈ ఉపదేశాన్ని ధర్మ చక్ర పరివర్తనం అంటారు .
•క్రీ.పూ 483 లో తన 80 వ యేట కుసి నగరంలో చనిపోయాడు .
•దీనిని "మహా పరి నిర్యాణం " అంటారు .
బుద్ధుని జీవితంలో ఇతర ప్రముఖులు:-
బింబి సారుడు - రాజ గృహంలో వేణు వనాన్ని బహుమతిగా ఇచ్చాడు .
ఆనంద పిండధుడు - శ్రావస్థిలో జేత వనం బుద్ధునికి కొని ఇచ్చాడు .
అమ్రపాలి - బౌద్ధమతం స్వీకరించిన వేశ్య .
అంగుళీ మాలుడు - బుద్ధుని శిష్యునిగా మారిన బందిపోటు.
చుందుడు (చంఢ ) -బుద్ధునికి చివరగా ఆహారం ఇచ్చిన వ్యక్తి.
సుభద్రకుడు-బుద్ధునిచే చివరగా బోధన పొందిన వ్యక్తి .
•బుద్ధుని శిష్యులలో ముఖ్యమైనవారు-ఆనందుడు,ఉపాలి .
బుద్ధుని భోదనలు
ఆర్య సత్యాలు (4) :-
1.ప్రపంచమంతా దుఖఃం తో కూడు కున్నది .
2.కోరికలే దుఃఖానికి హేతువులు .
3.కోరికలు జయిస్తే దుః ఖాన్ని నిరోదించవచ్చు .
4.దీన్ని సాధించుటకు అష్టాంగ మార్గం తోడ్పడును .
అష్టాంగ మార్గం
1. సరియైన దృష్టి
2.సత్క్రియ
3.సరియైన వాక్కు
4.సరియైన లక్ష్యం
5.సరియైన ప్రయత్నం
6.సరియైన జీవనోపాధి .
7.సరియైన ఙ్ఞానము /చెతన్యము .
8.సరియైన ధ్యానము
మధ్యే మార్గం
లౌకిక మార్గానికి , భక్తి మార్గానికి మధ్యస్థంగా జీవించాలి . బౌద్ధ మతానికి మధ్యే మార్గమని పేరు .
•బుద్ధుని లైట్ ఆఫ్ ఏసియా అని వర్ణించింది - ఎడ్విన్ ఆర్నాల్డ్ .
•బుద్ధుని ప్రపంచ జ్యోతి అని వర్ణించింది - శ్రీమతి రైస్ డేవిడ్స్ .
•బౌద్ధ మత గ్రంధాలు
1.త్రి పీఠకములు
2.జాతక కథలు
•త్రి పీఠకములు మూడు - వినయ,సుత్త,అభిదమ్మ పీఠకములు .
•బుద్ధుని గత జన్మ వృత్తంతములు తెలుపునవి .జాతక కధలు ఇవి 500 .
•బౌద్ధ మత సమావేశాలు - వీటిని "సంగీతి " అంటారు .
పీరియడ్ నగరం అధ్యక్షుడు నిర్వహించిన రాజు కారణం ఫలితం
483 BC రాజగృహ మహాకశ్యపుడు అజాత శత్రువు బుద్ధుని బోధనలు గ్రంధస్థం చేయటం ఆనందుడు సుత్తపీఠిక గానం చేశాడు . ఉపాలి,వినయపీఠికను పఠనం చేసాడు .
383 BC వైశాలి సభకామి కాలాశోకుడు వజ్జి బౌద్ధ సన్యాసులు , అవంతి సన్యాసుల మధ్య రాజీ కొరకు ఈ సమావేశం ఏర్పాటు బౌద్ధమతంలో చీలిక
250 BC పాటలీ పుత్రం మొగలి పుతస్త అశోకుడు అనేక అంశాలపై చర్య మూడవ పీఠక అభిదమ్మ పీఠిక ను గ్రంధస్థం చేసారు . బౌద్ధమత ప్రచారం కోసం మిషనరీలు ఏర్పాటు చేయబడ్డాయి .
క్రీ.శ. 1 వ శతాబ్దం కుందల వనం వసుమిత్రుడు కనిష్కుడు 18 బౌద్ధమత శాఖలను ఏకం చేయటం 18 శాఖలు 2 ప్రధాన శాఖలుగా అవతరించాయి
•3వ సంగీతిలో జరిగిన చర్చల ఆధారంగా వ్రాయబడింది -కథావత్తు
•4 వ సంగీతిలో చర్చల సారాంశం ఆధారంగా వసుమిత్రుడు మహావిభాష్య శాస్త్రం ను రచించాడు.
•బౌద్ధ మతం లో ప్రధాన శాఖలు -హీనయానం , మహాయానం .
•మహాయాన మతస్థులు బుద్ధునితో పాటు , భొది సత్వుని ప్రతిమలను కూడా తయారు చేసి పూజించారు .
•భవిష్యత్ లో జన్మించబోయే బుద్ధుని పేరు - మైత్రేయ
•క్రీ. శ. 5 వ శతాబ్దం నుంచి బౌద్ధమతం లో "వజ్ర యానం " అనే మూడవ శాఖ ప్రారంభమైంది. ఇది మంత్ర తంత్రాలతో కూడింది.
•స్థూపాలు : బుద్ధుని అస్థికలపై నిర్మించిన కట్టడాలు . ఇవి వారి దేవాలయాలుగా విలసిల్లుతున్నయి.
స్థూపాలు మూడు రకాలు
1.ధాతు గర్భ స్థూపాలు : బుద్ధుని గానీ , బౌద్ధ సన్యాసుల యొక్క గానీ అస్థికలను ఉంచి నిర్మించిన స్థూపాలు .
2.పారి భోజకాలు : మత గ్రంధాలు , లేదా భిక్షవుల వస్తువలను నిక్షిప్తం చేసి వాటిపై నిర్మించిన స్థూపాలు .
3.ఉద్దేశిక స్థూపాలు : ఏ వస్తువులు లేకుండా నిర్మించిన స్థూపం .
•భారతదేశం లో అతి పెద్ద స్థూపం - సాంచీ స్థూపం (మధ్యప్రదేశ్ ).
•ప్రపంచంలో అతి పెద్ద స్థూపం - బోరోబుదురు స్థూపం జావా ఇండోనేషియా .
•భారతదేశం లో ప్రాచీన స్థూపం - పిప్రావహ .
•దక్షిణ భారతదేశంలో ప్రాచీన స్థూపం - భట్టిప్రోలు .
•ప్రాచీన భారత దేశంలో 84,000 స్థూపాలు నిర్మించింది - అశోకుడు .
•బుద్ధుని ధాతువు భట్టిప్రోలు స్థూపం లో ఉంది .
•ఆరామం-బౌద్ధ సన్యాసులు నివాస గృహాలు లేదా విశ్రాంతి గదులు.
•చైత్యము-పూజా మందిరాలు.
•బౌద్ధ మత బిక్షవుల వ్యవస్థను సంఘం అంటారు .