స్వదేశీ సంస్థానాల విలీనం

• స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ,పాకిస్థాన్ మొదటి గవర్నర్ జనరల్ -మహ్మదాలీ జిన్నా
• పాకిస్థాన్ ప్రధమ రాజధాని - కరాచీ
• స్వాతంత్రానంతరం 562 సంస్థానాలలో కాశ్మీర్,హైదరాబాద్, జూనాగఢ్,ట్రావెన్ కోర్ మినహా మిగిలిన రాజ్యాలు భారతదేశంలో విలీనం అయ్యాయి .
• 7 వ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ రాజ్యాన్ని 1948 లో సైనిక చర్య ద్వారా భారత దేశంలో విలీనం చేశాడు .
• ఈ సైనిక చర్యకే ఆపరేషన్ పోలో అని పేరు . ఇది 1948 సెప్టెంబర్ 13 నుండి 17 మధ్య జనరల్ జె.యన్.చౌదరి ఆధ్వర్యంలో జరిగినది .
• జూనాఘడ్ పాలకుడు మూడవ మహబత్ ఖాన్ .
• ఇతని ప్రధాని షానవాజ్ భుట్టోలు జూనాఘడ్ ను పాకిస్థాన్ లో కలుపుటకు ప్రయత్నించాడు .
• భారత సైన్యం ఈ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది .
• అధిక సంఖ్యాకులు భారత్ లో విలీనం అగుటకు అనుకూలముగా ఉండుటతో ఈ రాజ్యం భారత దేశం లో అంతర్భాగము అయ్యినది .
• జమ్మూ కాశ్మీర్ ను బ్రిటిష్ వారి నుండి గులాబ్ సింగ్ 50 లక్షల రూపాయలకి కొనుగోలు చేసాడు .
• 1947 లో కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉంటుందని రాజు హర్ సింగ్ తెలిపాడు .కానీ పాకిస్థాన్ తన సైన్యాలను భారత భూభాగంలోనికి పంప సాగింది .
• దీనితో హర సింగ్ కాశ్మీర్ ని భారత దేశంలో విలీన చేస్తూ నాటి ప్రధాని నెహ్రూ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు .
• భారత సైన్యం పాక్ సైన్యం ను వెనక్కి పంపుటతో ఇది యుద్ధంగా మారినది .
• పాకిస్థాన్ ఆధీనం లో కాశ్మీర్ లోని కొంత భాగం ఇంకా ఉంది .
• దీనినే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని అంటారు .
• హర్ సింగ్ కోరిక మేరకు కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ భారత రాజ్యాంగంలో 370 అధికరణం ఏర్పాటు చేయటం జరిగినది .
• కేరళ లోని ట్రావెన్ కోర్ రాజ్యాన్ని కుల శేఖర వంశానికి చెందిన బలరాం వర్మ భారతదేశం లో విలీనం చేశాడు
• పాండిచ్చేరీ ని ఫ్రెంచి వారు భారత దేశం లో 1954 ఒప్పందం ద్వారా విలీనం చేసారు .
• దీనిలో మొత్తం 4 జిల్లాలు కలవు .
• పాండీచ్చేరి
• యానాం ఆంధ్ర ప్రదేశ్
• కరైకల్ తమిళనాడు
• మహే కేరళ
• పోర్చుగీసు ఆధీనం లో ఉన్న గోవా-డయ్యూ -డామన్ లు 1961 లో ఆపరేషన్ విజయ్ ద్వారా భారత సైన్యాలు బలవంతంగా ఆక్రమించాయి .