తొలివేద కాలం (క్రీ.పూ.1500-1000)
•క్రీ.పూ 1500-1000 మధ్య గల కాలం.
•దీనికే ఋగ్వేద కాల నాగరికత అని పేరు .
రాజకీయ వ్యవస్థ :-
•వీరు తెగలుతెగలుగా జీవించే వారు.
ఉదా:-భారత,పురు
•పశువులతో తిరిగే అర్య బృందాలను గ్రామం అంటారు.
•గ్రామాధిపతిని
గ్రామణి అంటారు .
•గ్రామాల సముదాయముని
విశ్ అని అంటారు .
•ఆర్య గణము (తెగ)ల మధ్య పచ్చిక బయళ్ళు కొరకు యుద్ధాలు జరుగు తుండేవి.
•వీటికే
గవిస్థి అని పేరు . గవిస్థి అంగా గోవుల కొరకు అన్వేషణ అని అర్దం .
•గణ నాయకుడను
రాజన్ , సామ్రాట్ అంటారు
రాజుకు సలహాలు ఇచ్చే సంస్థలు :-
1.సభ - వయోవృద్ధుల సభ ,కార్య నిర్వాహక విధులు కల్గి ఉండేవి.
2.సమితి - సాధారణ శాసనసభ
3.గణ - యుద్ధ మండలి , ఆయుధాలు , గుర్రాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటుంది.
4. విధాత -మహిళల సభ
•సభ,సమితులను అధర్వణ వేదం కవల పిల్లలు గా వర్ణించింది .
•ఈ కాలంలో రాజు అంటే గణ ప్రముఖుడు మాత్రమే .
•గణ సభ్యులు రాజుకు చెల్లించేది.-బలి.
•నాటి సమాజంలో సాధారణ నేరాలు - గోగ్రహణం(గొవుల దొంగతనం), బందిపోటు మోసం చేయటం .
•వీరికి స్థిర సైన్యం లేదు .
తొలి వేద కాలం నాటి ముఖ్య అదికారులు: -
సేనాని -సైన్యాధ్యక్షుడు
పురోహితుడు - జ్యోతిష్య,క్రతువుల నిర్వహణ.
భాగదుగ - పన్నులు వసూలు చేయు అధికారి.
శతపతి - వంద స్థలాలకి అధిపతి.
స్థపతి - బాహ్య స్థలాలకి అధిపతి .
సంగిహిత్రి -కోశాధికారి .
సమాజం
•వీరి గణ వ్యవస్థ కలిగిన సామాజిక వ్యవస్థ .
•వీరిది పితృ స్వామిక కుటుంబం .
•ఋగ్వేద ఆర్యులలో వర్ణ వ్యవస్థ లేదు.
•వీరు గణాలుగా గోత్రాలు కల్గి ఉండే వారు.గోత్రం అనే మాటకు పశువుల కొట్టం అనే అర్ధం .
•కుటుంబ పెద్ద తండ్రి .ఇతన్ని కులాపా అని పిలిచేవారు .
•స్రీలకు స్వేచ్చ ఉంది పురుషులతో సమానంగా మత కార్యక్రమాలలో పాల్గొనే వారు .
•ఆర్యులందరూ మాంసాహారులే . పురడాశయం(పాయసం) అత్యంత ఇష్టమైన భోజనం .
•అత్యంత ఇష్టమైన పానీయం - 'సోమా. దీని గురించి ఋగ్వేదంలోని 9 వ మండలంలో కలదు .
•ప్రధాన ఆహారం -భార్లీ , గోధుమ .
•ఉత్తరీయం(పైన),అంతరీయం(ధోవతి) ధరించేవారు.
•వీరు నిష్క అనే బంగారు నగ మెడలో ధరించేవారు .
•ఓపశ -స్రీల శిరోభూషణం , కపర్ధ - పురుషులు స్రీల వలే జుట్టు పెంచుకొనుట .
•ప్రధాన క్రీడలు - జూదం , చదరంగం , రధాల పందాలు
•దౌహిత్రీ అనగా కుమార్తె.
•బాల్య వివాహాలు , సతీ ఆచారం ,పరదా పద్దతి , వితంతు పునర్వివాహాలు అమలులో లేవు .
•తొలి వేద కాలం లో విద్యా వంతులైన స్రీలు - విశ్వావర , అపాల ,గోష ,లోపా ముద్ర .
ఆర్ధిక వ్యవస్థ
•వీరి ప్రధాన వృత్తి పశు పోషణ .తర్వాత వ్యవసాయం .
•వీరిది గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ .
•వీరు భూమిని రెండు బాగాలు చేసే వారు .
1. క్షేత్రం - యవలు పండించు భూమి .
2.అరణ్యం - పశువులను మేపుకునే ప్రాంతం .
•కృషి వల అనగా వ్యవసాయ దారుడు .
•పశువులను వ్యవసాయం కొరకు కాక మాంసం కొరకు పెంచు కొనే వారు .
•వీరికి నాగలి తెలుసు .వీరికి ఇనుము తెలియదు .
•వీరు వస్తు మార్పిడికి ప్రధానంగా గోవును ప్రమాణంగా ఉపయోగించారు .
•ఋగ్వేద కాలం నాటి వర్తక సంఘాలకు గణ అని పేరు .
•వణిజ వడ్డీ వ్యాపారం చేసే అనార్య తెగ .
•చేతి వృత్తులలో ప్రదాన వర్గం - వడ్రంగి .
•కర్మారా అనగా లోహ పరికరాలు తయారు చేయు వారు.
•హిరణ్యకార అనగా బంగారు ఆభరణాలు తయారు చేయు వారు.
మత పరిస్థితులు
•వీరు ప్రకృతి శక్తులని ఆరాదించేవారు .
•వీరు పితృ స్వామిక వ్యవస్థను కల్గి ఉన్నారు . కావున దేవతలలో అధికులు పురుషులే .
•33 మంది దేవతలను ఆరాధించారు .
•వీరి దేవతలను మూడు రకాలుగా వర్గీకరించారు .
1. స్వర్ణ దేవతలు - డ్యూస్ (స్వర్గానికి దేవుడు)
2.వాతావరణ దేవతలు - వరుణుడు , మారుతి .
3. భూదేవతలు - అగ్ని , సోముడు .
వీరి ప్రధాన దేవతలు
1. ఇంద్రుడు - మొదటి స్థానం యుద్ధ దేవుడు .
2.అగ్ని (ధూమకేతు )- దేవతలకు ఆర్యులకు మధ్య వర్తి .
3. వరుణుడు -వాతావరణ దేవత , నీతి , ధర్మ , శీలం మొ " దేవుడు .
4.సోముడు - వృక్షాదిపతి , ఇతని పేరు సోమ రసం అని పిలువ బడింది .
5.అశ్వినీ దేవతలు - వైద్యానికి ప్రధానంగా .
•స్త్రీ దేవతలు :
అదితి - సకల దైవాలకు తల్లి
ఉషస్ - ప్రాతః కాల దేవత
మరుత్తు - తూఫాన్ దేవత
సావిత్రి - సౌర దేవత
పుషాన్- వివాహాల దైవం
•ఋగ్వేద కాలంలో దేవాలయాలు లేవు . విగ్రహారాధన తెలియదు .
•పూజా విధానాలు - ప్రార్దనలు , శ్లోకాలు , యఙ్ఞాలు , యాగాలు .
ఇతర అంశాలు :-
•ఋగ్వేద కాలంలో అత్యంత ప్రాదాన్యత పొందింది -సరస్వతి.
•సరస్వతిని ఋగ్వేదంలో నదీతమ (నదులలో ఉత్తమమైనది ) గా వర్ణించబడింది .
•తొలి వేద కాలం లో సముద్రం గురించి తెలియదు .సముద్రం అనగా సింధువు (జలాశయం).
•వీరికి పులి తెలియదు .
•ఋగ్వేద కాలంలో సింధు నది ఉపనదులు ఈ విధంగా వర్ణించ బడ్డాయి .
ప్రస్థుతం | ఋగ్వేదంలో |
సట్లెజ్ | శతుద్రి |
బియాస్ | విపాస , అర్గికేయ |
రావి (ఐరావతి ) | పరూషిణీ |
చినాబ్ (చంధ్ర భాగ) | అసికిని |
జీలం (హైడాస్పస్) | వితస్థ |
•ఆసియాలో గుర్రపు స్వారిని ఆర్యులు ప్రవేశపెట్టారు.
•గాయత్రీ మంత్రం ఋగ్వేదంలో 3 వ మండలంలో కలదు .
•తొలి వేద కాలంలో జరిగిన అతి ప్రదాన యుద్ధం -దశ రాజు గణ యుద్ధం .
•భరత వంశానికి చెందిన సుదాముడు , పురుష వంశానికి చెందిన పురుకుత్సల మధ్య రావి నదీ తీరాన జరిగింది .
•పురుకుత్స కు 10 మంది రాజులు సహక రించారు .
•పురుకుత్స ప్రధాని విశ్వా మిత్ర , సుదాముని ప్రధాని వశిష్ట .
•దశ రాజ్య యుద్ధం జరుగుటకు కారణం .- రావి నది జలాల , పచ్చిక బయళ్ళ పంపిణీ.