గాంధీ యుగం (1920-1947)


1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోరు బందర్ లో జన్మించాడు .
• తండ్రి -కరంచంద్ .
• తల్లి - పుత్లీబాయి .
• 13 ఏళ్ళ వయసులో కస్తుర్భాతో వివాహం జరిగింది .
• బెనర్జీ స్వామి అనే జైన సన్యాసీ సహాయంతో లండన్ లో న్యాయ విధ్యను అభ్యసించాడు .(1887-1891)
• 1893 లో దక్షిణాఫ్రికాకు దాదా అబ్ధుల్లా కేసు వాదించటానికి వెళ్ళి , 22 ఏళ్ళు ఉన్నాడు .
• డర్బన్ నుండి ప్రిటోరియాకు వెళ్ళుటకు మొదటి తరగతి కంపార్ట్ మెంట్ ఎక్కగా స్టాండర్టన్ అనే ప్రాంతం వద్ద శ్వేత జాతీయులు రైలు నుండి బయటకు నెట్టి వేశారు .
• గాంధీజీ ఆ రాత్రి సెయింట్ పీటర్ మారిట్జ్ బర్గ్ రైల్వే స్టేషన్ లో గడిపాడు .
• దక్షిణ ఆఫ్రికాలో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ సంస్థ ను , ఇండియన్ ఒపీనియన్ పత్రికను స్థాపించారు .
• 1906 లో దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ మొదటి సారి సత్యాగ్రహాన్ని చేశాడు .
• తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేయబడింది .
1910 లో గాంధీజీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహాల కొరకు ఫీనిక్స్ ,పాం ను స్థాపించాడు .దీనికి అలెన్ బక్ అనే జర్మనీ దేశస్థుడు సాయపడ్డాడు .
• గాంధీజీని ప్రభావితం చేసిన పుస్తకాలు -
• 1.ఆన్ టు ద లాస్ట్ - రస్కిన్ బాండ్
• 2.కింగ్ డం ఆఫ్ ది గాడ్ ఈజ్ విత్ ఇన్ యు - టాల్ స్టాయ్ .
• దక్షిణాఫ్రికాలోని బ్రిటీష్ ప్రభుత్వం 1913 లో నల్ల జాతీయులను అవమానిస్తూ రెండు చట్టాలు చేసినది .
• వీటి రద్దు కొరకు గాంధీజి రెండవ సారి సత్యాగ్రహం చేశాడు.
• దక్షిణాఫ్రికా గవర్నర్ జనరల్ స్మట్స్ గాంధీజీ ని అరెస్ట్ చేశాడు .
• ఈ చట్టాలు 1914 లో రద్దు చేయబడ్డాయి . 1915 లో గాంధీ విడుదల చేయ బడ్డాడు .
• గోఖలే సలహా మేరకు గాంధీజి 1915 జనవరి 9 భారత్ కు చేరుకున్నాడు .
• గాంధీజి -రాజకీయ గురువు - గోపాల కృష్ణ గోఖులే
• గాంధీజీ కాన్షియస్ కీపర్ - సి. రాజగోపాల చారి .
• దక్షిణాఫ్రికాలో గాంధీజీని భాయ్ అనే వారు .
• 1916 లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమం ను ఏర్పాటు చేసుకున్నాడు .
• మొదటి ఉద్యమం - చంపారణ్ సత్యాగ్రహం (1917)
• రెండవది-ఖైదా ఉద్యమం
• మూడవది -అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ (1918) .
గాంధీజి యొక్క బిరుదులు - ఇచ్చిన వారు
• జాతి పిత - సుభాష్ చంద్రబోస్ .
• మహాత్మా - రవీంద్రనాధ్ ఠాగూర్
• బాపూజి -జవహార్ లాల్ నెహ్రు
• కైజర్ -ఇ-హింద్ - బ్రిటీష్ ప్రభుత్వం
• గిర్మిటీయ సోదరుడు - దక్షిణాఫ్రికాలోని గిర్మిటీయా జాతి ప్రజలు
• నగ్న ఫకీర్ -విన్ స్టన్ చర్చిల్ .
గాంధీజీ ఇతరులకి ఇచ్చిన బిరుదులు
• సర్ధార్ - వల్లభాయ్ పటేల్
• దేశ భక్తుల్లో కెల్లా భక్తుడు - సుభాష్ చంద్రబోస్
• గురు దేవ్ - రవీంద్ర నాధ్ ఠాగూర్ .
• గాంధీజీ రచనలు- మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్ , హింద్ స్వరాజ్ , ది వాయిస్ ఆఫ్ ట్రూత్ , ది వే టూ కమ్యూనల్ హార్మోనీ , కీ టూ హెల్త్ .
• గాంధీజీ పత్రికలు - యంగ్ ఇండియా,హరిజన్ .
• బీహార్ లో చంపారన్ ప్రాంతంలో నీలి మందు తోటల పెంపకంలో తీన్ కథియా విధానం ఉండేది .
• ఈ విధానం లో రైతులు తీవ్రంగా నష్టపోయారు .
• రాజీవ్ కుమార్ శుక్లా యొక్క విజ్ఞప్తితో గాంధీజీ చంపారన్ సందర్శించి తీన్ కథియా కు వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించెను .
• ఇది భారతదేశం లోని గాంధీ మొదటి సత్యాగ్రహం .
• 1918 లో అహ్మదాబాద్ లో నూలుమిల్లు కార్మికుల వేతనాల పెంపునకు కార్మికులు చేసిన సమ్మెకు నాయకత్వం వహించాడు .
• ఇచ్చట గాంధీ మొదటి సారి నిరాహారదీక్ష చేపట్టెను .
• గాంధీజీ కాంగ్రెస్ కు ఒక్క సారి మాత్రమే 1924 లో బెల్గాం సమావేశానికి అధ్యక్షత వహిం చాడు .
• కాంగ్రెస్ పార్టీ కి 1934 లో రాజీనామా చేశాడు .
• గాంధీ నినాదాలు - సత్యం,అహింస
• గాంధీ నిర్వహించిన జాతీయ ఉద్యమాలు
• 1. సహాయ నిరాకరణ ఉద్యమం
• 2. శాసనోల్లంఘనోద్యమము (1930-34)
• 3. క్విట్ ఇండియా ఉద్యమం (1942-45)
ఖిలాఫత్ ఉద్యమం :- టర్కీ సుల్తానును ఖలీఫా అంటారు .
• మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ తరపున టర్కీ పాల్గొని ఓడిపోయింది .
• టర్కీని ఆక్రమించున్న ఇంగ్లాండ్ ఖలీఫా పదవి రద్దు చేసింది .
• దీనికి వ్యతిరేకంగా ఇండియాలో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభించబడినది .
• ఖిలాఫత్ ఉద్యమానికి కాంగ్రెస్ ,గాంధీ మద్దతు పలికారు .
• ఆగస్ట్ 1,1920 న సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించబడినది .
• బ్రిటిష్ వారు ఇచ్చిన కైజర్ -ఎ-హింద్ బిరుదును గాంధీజీ జయించారు.
• చౌరిచౌరాలో శాంతీయుతంగా ఉద్యమిస్తున్న ప్రజలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.
• ఫిబ్రవరి 5,1922 న చౌరిచౌరా సంఘటన జరిగినది .
• ప్రజలు చౌరి చౌరాలో 22 మంది పోలీసులని సజీవ దహనం చేశాడు .
• దీనితో గాంధీజి ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 11 న రద్దు చేశారు ఉద్యమ నిలిపివేతను నేతాజీ జాతీయ విపత్తుగా వర్ణించాడు .
1922-1930 మధ్య సంఘటనలు :-
• స్వరాజ్ పార్టీ స్థాపన (1922-33)
• దీనిని స్థాపించినది
• చిత్తరాంజన్ దాస్ -అధ్యక్షుడు
• మోతీలాల్ నెహ్రూ - సెక్రటరీ
• 1922 లో జరిగిన కాంగ్రెస్ సమావేశం లో కాంగ్రెస్ లో చీలిక ఏర్పడింది .
• 1925 లో సి.ఆర్ దాస్ మరణం తర్వాత ఈ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనది .
ఉప్పు సత్యాగ్రహం :-
• 1930 జనవరి 31 న గాంధీజీ 11 డిమాండ్లను గవర్నర్ జనరల్ ఇర్విన్ కు పంపాడు .
• ఉప్పు చట్టాలను ఉల్లంఘించాలని తీర్మానించారు .
• 1930 మార్చి 12 న సబర్మతి నుంచి 78 మంది అనుచరులతో దండియాత్ర ప్రారంభించాడు .
• మొదటి రౌండ్ టేబుల్ సమావేశం - (నవంబర్ 1930 - జనవరి 1931)
• రెండవ రౌండ్ టేబుల్ సమావేశం - (సెప్టెంబర్ 1931) :-
• 3 వ రౌండ్ టేబుల్ సమావేశం - 1932
• క్విట్ ఇండియా ఉద్యమం (1942 ఆగష్ట్ -డిసెంబర్ ) :-
• అమెరికా చైనా ఒత్తిడి మేరకు భారతదేశ మద్దతు పొందేందుకు 1912 లో ఇంగ్లాండ్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ రాయబారం పంపాడు.
• భారత దేశం యుద్ధంలో సహకరిస్తే
• స్వతంత్య్ర ప్రతిపత్తి ఇవ్వటానికి ,
• రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు క్రిప్స్ సమ్మతించాడు .
• 1942 ఆగష్ట్ 8న ముంబాయిలో సమావేశమై క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది.
• ఉద్యమం ప్రారంభమైన మొదటి వారం లో 150 పోలీసు స్టేషన్ లు ,250 రైల్వే స్టేషన్లు ,500 పోస్ట్ ఆఫీసులు నాశనము అయ్యెను .
• దాదాపు 1000 మంది మరణించారు .