విప్లవ కారులు వారి చర్యలు

విప్లవకారులు - వారి చర్యలు:-
• విప్లవ పత్రికల స్థాపన /సాహిత్యం
• ప్రజా వ్యతిరేక అధికారులను హత్యచేయటం
• ఆయుధాలు సమకూర్చుకోవటం
• దోపిడీ వసూళ్ళు
• స్వాతంత్య్రోద్యమంలో విప్లవోద్యమాన్ని రెండు దశలుగా విభజించవచ్చు .
• మొదటి దశ :-
• భారత్ లో మొదటి విప్లవకారుడు బల్వంత్ పాడ్కే .
• ఇతడు భారత్ లో ఉగ్రవాద కార్యక్రమాలకు పితామహుడు .
• 1879 లో నిజాం ఇతనిని బ్రిటిష్ కు అప్పగిస్తే ,ఎడెన్ జైలుకు పంపారు .
• ఇతను జైల్లో నిరాహార దీక్ష చేస్తూ చనిపోయాడు .
• ఛాపేకర్ సోదరులు :-
• వీరు మహారాష్ట్రలో 1893 లో హిందూ ధర్మ సం రక్షణ సభను స్థాపించారు .
• వీరు 1897 లో తిలక్ వ్రాసిన వ్యాసాలతో ప్రభావితులై పూణేలో ప్లేగ్ వ్యాధి కమీషనర్ ర్యాండ్ ను , కాల్చి చంపారు .
• సావర్కార్ సోదరులు :-
• 1 వి.డి.సావర్కర్
• 2 గణేష్ సావర్కర్
• వి.డి. సావర్కర్ 1899 లో మిత్రమేళ అనే రహస్య సంఘం ను స్థాపించాడు .
• ఇది భారత దేశం లో మొదటి రహస్య విప్లవ సంస్థ .
• విదేశాలలో ఉగ్రవాద కార్యక్రమాలు
• 1905 లో లండన్ లో శ్యాంజీ కృష్ణవర్మ ఇండియన్ హోం రూల్ సొసైటీ స్థాపించెను .
• ఇతని గురువు స్వామి దయానంద.
• శాంఫ్రాన్సిస్కో లో 1913 నవంబర్ 1 న గదర్ పార్టీ స్థాపించబడినది .
• దీని స్థాపకులు
• సోహన్ సింగ్ బక్నా
• లాలా హర్ దయాళ్