జాతీయోద్యమం

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (INC):-
• భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 25 న స్థాపించ బడింది .
• 1885 డిసెంబర్ 28 - 30 ల మధ్య బొంబాయి లోని తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు .
• జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు , పితామహుడు ఏ.ఓ .హ్యూం .
• తను 1907 లో జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి గా పని చేశాడు .
• ఇతని గురువు దాదా భాయ్ నౌరోజి .
• ఇతని విధానానికి రక్షణ కవాటం అని పేరు .
• ఈ సమావేశానికి హాజరు అయిన వ్యక్తుల సంఖ్య -72 .
• ఈ సమావేశానికి అద్యక్షత వహించింది - డబ్ల్యు.సీ బెనర్జీ .
• దీనికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరు సూచించింది - దాదా బాయి నౌరోజి .
• ఈ సమావేశం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ - లార్డ్ డఫ్రీన్ .
• ఇతను కాంగ్రెస్ మైక్రోస్కోపిక్ మైనారిటి అని విమర్శించాడు .
• ఈ సమయం లో సెక్రేటరీ ఆఫ్ స్టేట్స్ -లార్డ్ క్రాస్ .
ఈ సమావేశానికి హాజరు అయిన ముఖ్యులు : -
• 1.దాదా బాయి నౌరోజి :
• ఇంగ్లండ్ పార్లమెంట్ కు హాజరు అయిన తొలి భారతీయుడు .ఇతను లిబరల్ పార్టీ సభ్యుడుగా ప్రిన్స్బరీ నియోజక వర్గం నుండి ఎంపిక అయ్యాడు .
• భరత దేశం లో తొలి ఆర్ధిక వేత్త .
• ఇండియాలో మొదటి సారి జాతీయ ఆదాయం గణించాడు .
• బ్రిటీష్ వారి దోపిడీని డ్రెయిన్ సిద్దాంతం ద్వారా వివరించాడు .
• ఇతడు రాసిన గ్రంధం - "పోవర్టి అండ్ అన్ బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా "
• బిరుదు - ది గ్రాండ్ ఓల్డ్ మెన్ ఇన్ ఈండియా "(భారత దేశ కురు వృద్దుడు ).
• 1886 లో కలకత్తాలో జరిగిన రెండవ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు .
• మొత్తం 3 సార్లు అధ్యక్షత వహించాడు .
2.బద్రుద్దీన్ త్యాబ్జి :-
• 1887 లో మద్రాస్ లో జరిగిన 3 వ కంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు .
• కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం .
3.జార్జ్ యూల్ :-
• 1888 లో అలహాబాద్ లో జరిగిన 7 వ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు .
• కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు .
4.పి.అనoదాచార్యులు :-
• 1891 లో నాగపూర్లో జరిగిన 7 వ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు .
• కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి అంధ్రుడు .
• భారత జాతీయ కాంగ్రెస్ ను 3 భాగాలు గా విభజించారు .
• 1.మిత వాద దశ (1885-1905)
• 2.అతివాద దశ (1905-1920)
• 3.గాంధీ యుగం (1920-1947).