నీలి మందు విప్లవం (1859-60):-
•
బెంగాల్ ప్రాంతంలో బలవంతంగా నీలి మందు పండించటాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం ప్రారంభించారు .
•
నాయకులు : 1.దిగంబర విశ్వాస్
•
2.బిష్ణు విశ్వాస్ .
•
భారత దేశంలో మొదటి రైతు ఉద్యమం - నీలి మందు ఉద్యమం .
•
1860 లో బలవంతంగా పండించటాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు .
•
నీలి మందు రైతు బాధలను దీన బంధ మిత్ర నీల్ దర్పణ్ అనే నాటకంలో వివరించెను .
•
పబ్నా ఉద్యమం (బెంగాల్)(1872-76):-
•
తూర్పు బెంగాల్ లోని పబ్నా జిల్లాలో రైతులు సంఘాలు గా ఏర్పడి కొవులు చెల్లించ కుండ జమిందారులు పై దాడులు చేయ సాగారు .
•
ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచి వేసి 1885 లో బెంగాల్ కౌలు దారీ చట్టం చేసి కౌలు దార్లకు చట్టం కల్పించాడు .
•
దక్కన్ అలజడలు (1875) :-
•
వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా మహారష్ట్రలోని పూనా , అహ్మద్ నగర్ జిల్లాలలో సాయుధ తిరుగు బాటు జరిగింది .
•
వడ్డీ వ్యాపారుల పై దాడి చేసి ఋణపత్రాలు తగుల పెట్టారు .
•
సైన్యం ప్రవేశించి తిరుగు బాటును అణచివేసింది .
•
చంపారన్ సత్యాగ్రహం ( 1917):-
•
బీహార్లో చంపారన్ అనే ప్రదేశం లో తీన్ కథియా విదానాన్ని వ్యతిరేకిస్తూ గాందీజి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు .ఇది భారత దేశం లో గాందీజి నడిపిన మొదటి ఉద్యమం .
•
ఈ ఉద్యమంలో గాంధీజి సహాయకులు
•
1.బాబూ రాజేంద్ర ప్రసాద్
•
2.జె.బి.కృపలాని
•
3.మహదేవ్ దేశాయ్
•
4.అనుగ్రహ నారాయణ .
•
ఈ ఉద్యమం ఫలితంగా తీన్ కథియా విధానం రద్దు చేశారు .
•
ఖేడ/కైర సత్యాగ్రహం :(1918)(గుజరాత్ ) :-
•
ఆంగ్లేయుల చట్టం ప్రకారం 25% కంటే దిగుబడి తక్కువగా ఉండే ప్రాంతాన్ని కరువు ప్రంతంగా ప్రకటిస్తారు .
•
కానీ ఖేఢ ప్రాంతంలో 20% కన్నా తక్కువ దిగుబడీ ఉన్నప్పటికి అధికారులు పన్నులు కోసం వేధించారు .
•
ఈ ఉద్యమంలో గాంధీజి సహాయకులు
•
1.వల్లభబాయ్ పటేల్
•
2.ఇందులాల్ యాఙ్ఞిక్ .
•
ఈ ఉద్యమ ఫలితంగా పన్నులు రద్దు చేశారు .
•
మోప్లా రైతుల తిరుగు బాటు : -
•
కేరళ లోని ముస్లిం రైతులు హిందూ జమిందారులు , వడ్డీ వ్యాపారులు , ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ తిరుగు బాటు చేసారు .
•
పోలీసులు తిరురంగడి మసీద్ పై ఆయుదాలు కొరకు దాడి చేయగా ఈ ఉద్యమం ప్రారంభమయింది .
•
ప్రభుత్వ కార్యాలయాలు భూస్వాములు వడ్డీ వ్యాపారులపై దాడులు జరిగాయి .
•
బార్దోలి సత్యాగ్రహం (1928):-
•
గుజరాత్ లోని బార్దోలి అనే ప్రదేశం లో పన్నులను 22% పెంచారు .
•
ఈ ఉద్యమ నాయకుడూ వల్లబాయ్ పటేల్ .
•
ఈ ఉద్యమం తరువాత గాంధీజి సర్ధార్ అనే బిరుదు ను వల్లభాయ్ పటేల్ కి ఇచ్చాడు .
•
ఈ పోరాట ఫలితంగా ప్రభుత్వం విచారణ సంఘం నియమించి , భూశిస్తు తగ్గించింది .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.