కుల ఉద్యమాలు

సత్య శోధక సమాజం :-
• ఇది మహారాష్ట్రలోని వెనుకబడిన కూఅల వారి కోసం స్థాపించబడినది .
• జ్యోతీబా గోవిందరావు పూలే ఈ సంస్థను స్థాపించాడు .
• ఇతని బిరుదు మహాత్మ
• ఇతను రాసిన గ్రంధం - గులాం గిరి
• జ్యోతిబాపూలే తన భార్య సావిత్రి బాయి పూలే కలిసి పూనా వద్ద వెనక బడిన వర్గాల కోసం పాఠశాల స్థాపించెను .
• ఇతని అనుచరుడు - ముకుందరావు పాటిల్
• ముకుందరావు పాటిల్ దీనమిత్ర అనే సంస్థను స్థాపించాడు .
• ఇతని గ్రంధం -హిందూ బ్రాహ్మణ
• బాపూలే 1884 లో దీనబందు సర్వజనీక్ సభను స్థాపించాడు .
సాహు మహారాజ్ :-
• కొల్ హాపూర్ సంస్థానాధిపతి
• వేద విద్య పాఠ శాలలు స్థాపించి దళితులకు వేద విద్యను అందించాడు .
• తన సంస్థానం లో 50% ఉద్యోగాలు దళితులకు ఇచ్చాడు .
• అంబేద్కర్ విదేశాలలో చదువుకోవటానికి అర్ధిక సహాయం చేశాడు .
మెహర్ ఉద్యమం (1894) :-
• అంబేద్కర్ గురువు మరియు మెహర్ ఉద్యమ స్థాపకుడు -గోపాల్ బాబా వాగ్లేకర్
• 1920 నుంచి ఈ ఉద్యమాన్ని అంబేద్కర్ నడిపించాడు .
గాంధీ:-
• 1932 లో ఆల్ ఇండియా అన్ టచబిలిటీ లీగ్ ను స్థాపించాడు .
• 1933 లో హరిజన్ అనే పత్రికను స్థాపించాడు .
జావ /అరవిప్పుర ఉద్యమం (కేరళ ):-
• దీని స్థాపకుడు నారాయణ గురు .
• కేరళలో నిమ్న కులాల తరుపున పోరాడిన మొదటి వ్యక్తి
• ఇతని నినాద - ఒకే దైవం -ఒకే మతం -ఒకే కులం
• దీని తరపున బ్రాహ్మణ ఉద్యమం నడిపిన కాంగ్రెస్ నాయకులు
• టి.కె.మాధవన్
• కెలప్పన్
• సి.ఎఫ్.ఆండ్రూస్
జస్టిస్ ఉద్యమం మద్రాసు :- మద్రాస్ లో 1917 లో సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థను స్థాపించాడు .
• తర్వాత దీని నుండి జస్టిస్ రాజకీయ పార్టీ ఏర్పడినది .
• ఇది బ్రాహ్మణ ఆధిపత్యమునకు వ్యతిరేకముగా స్థాపించబడిన మొదటి పార్టీ
• 1924 లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన రామ స్వామి నాయకర్ ఈ సంస్థలో చేరాడు .
• ఇతను 1937 లో జస్టిస్ పార్టీ కి అధ్యక్షుడు అయ్యడు .
• 1944 లో దీని పేరు ద్రవిడ కజగం గా మార్చాడు .
• 1944 లో ఇతని శిష్యుడు అన్నాదురై వేరుపడి ద్రవిడ మున్నేట్ర కజగం ను స్థాపించాడు .
• 1972 లో ఎం.జి.రామచంద్రన్ వేరుపడి AIDMK ను స్థాపించాడు .