కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
బ్రహ్మ సమాజం :-
బ్రహ్మ సమాజం ను రాజా రాం మోహన్ రాయ్ స్థాపించాడు .
1774 ఆగస్టు 14 న బెంగాల్ లోని రాధా నగరంలో జన్మించాడు .
ఇతను 1815 లో ఆత్మీయ సభ ను స్థాపించాడు .
దీని పేరును 1828 లో బ్రహ్మ సభ గా , 1829 లో బ్రహ్మ సమాజంగా మార్చారు .
ఇతను కృషి వలన 1829 లో సతీ సహగమన చట్టం చేయబడింది .
1831 లో మొఘల్ చక్రవర్తి అక్బర్ -2 ఇతనికి రాజా అనే బిరుదునిచ్చాడు . ఇతని ఇతర బిరుదులు
ఆధునిక భారత దేశ పితా మహ,పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా .
1833 లో ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ నగరంలో జన్మించాడు .
రామ్మోహన రాయ్ మరణం తర్వాత ఈ సంస్థను నడిపినారు .
1.దేవేంధ్ర నాధ్ ఠాగూర్ - తత్వబోధిని సభ ను స్థాపించాడు . తత్వ బోదిని పత్రిక నడిపాడు .
2. కేశవ చంద్ర సేన్ - 1872 లో ఇతని కృషి వల్ల Civil Marriages Act చేయబడింది .
వీరి ఇరువురు మధ్య గొడవల వలన బ్రహ్మ సమాజం రెండుగా చీలి పోయింది .
1.ఆది బ్రహ్మ సమాజం(దేవేంద్ర నాధ్ ఠాగూర్)
2.భారతీయ బ్రహ్మ సమాజ్ (కేశవ చంద్ర సేన్ ).
కేశవ చంద్రసేన్ స్థాపించిన పత్రిక - Indian mirror
కేశవ్ చంద్రసేన్ స్పూర్తితో ప్రారంభించబడిన సంస్థలు
ప్రార్ధనా సమాజ్ -ఆత్మారాం పాండురంగ (1867)
వేద సమాజం
1878 లో కేశవ్ చంద్ర సేన్ బ్రహ్మ సమాజ సూత్రాలకు విరుద్ధంగా 13 సం|| ల తన కుమార్తెను కూచ్ బిహార్ రాజుకి ఇచ్చి వివాహం జరిపెను .
దీని వలన బ్రహ్మ సమాజం లో రెండవ చీలిక ఏర్పడినది .
రాజా రామ్మోహన రావు స్థాపించిన పత్రికలు :-
1.సంవాద కౌముది - భరత దేశంలో భారతీయుడు స్థాపించిన మొదటి పత్రిక సంవాద కౌముది.
భారత దేశంలో మొదటి పత్రిక బెంగాల్ గెజిట్ .
తెలుగు మొదటి పత్రిక సత్య దూత . దీనిని 1835 బళ్ళారి క్రైస్తవ సంగం ప్రచురించింది .
2.మిరాతుల్ అక్బర్ : పర్షియన్ బాష లో రాజా రామ్మొహన్ రాయ్ ప్రారంభించెను .
భారత దేశంలో మొదటి పర్షియా పత్రిక
3.భంగ దూత - చాలా భాషల్లో ప్రచురించ బడింది .
ప్రార్ధనా సమాజ్ :-
ప్రార్ధనా సమాజ్ ఆత్మారాం పాండు రంగ నాయకత్వంలో ప్రారంభించబడినది.
ఈ సంస్థ సుబోధ అనే పత్రికను నడిపినది.
యువ బెంగాల్ ఉద్యమం ను హెన్రీ వివియన్ డోరోజియో అనే ఆంగ్లో ఇండియన్ ప్రారంబించెను .
ఇతనికి భారత దేశ మొదటి కవిగా పేరు .
ఆర్య సమాజం - దయానంద సరస్వతి : -
ఇతని అసలు పేరు -మూల శంకర్ .మధురలోని స్వామి విరజానంద ఇతనికి స్వామి దయానంద సరస్వతి అనే పేరు పెట్టెను .
1875 లో ముంబాయి లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు .
ఇతని నినాదం - గో బ్యాక్ టు హోం .
ఇతని బోధనలలో ముఖ్యమైనవి -
ఏకేశ్వరోపాసన
విగ్రహారాధన నిషేధం
వేదాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం
హిందీని జాతీయ బాష గా ప్రకటించిన మొదటి వ్యక్తి -స్వామి దయానంద .
ఇతను స్వధర్మ ,స్వభాష ,స్వరాజ్ అనే పదాలను మొదటి సారి వాడారు .
హిందూ మతం వదిలి వేరే మతంలోకి చేరే వారిని తిరిగి హిందూ మతంలో తీసుకొచ్చుటకు శుద్ధి ఉద్యమాన్ని నిర్వహిం చెను .
ఈశ్వర చంద్ర విద్యా సాగర్ :-
ఈశ్వర చంద్ర విద్యా సాగర్ కృషి వలన డల్ హౌసీ 1856 లో వితంతు పునరివాహ చట్టం చేసెను .
కలకత్తాలో బాలికల కోసం రాత్రి పాఠశాలను ప్రారంభించాడు
ఇతని బిరుదులు పండిట్ ఛాంపియన్ ఆఫ్ ఉమన్
1916 లో కార్వే భారతీయ మహిళా విద్యాలయాన్ని స్థాపించాడు.
రామకృష్ణ ఉద్యమం :-
రామకృష్ణ పరమ హంస :-
ఇతని అసలు పేరు గదాధర్ చటోపాధ్యాయ
ఇతని శిష్యులలో ముఖ్యమైనవాడు నరేంద్రనాధ్ దత్తా (స్వామి వివేవాకానంద ).
1893 లో చికాగోలో జరిగిన సర్వమత సమావేశం లో పాల్గొని హిందూ మత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు .
ఇతను బేలూరు వద్ద 1897 రామకృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించాడు .
దీనిలో రెండు భాగాలు
1.రామకృష్ణ మఠం
2.రామకృష్ణ మిషన్
వివేకానందుని పత్రికలు ప్రబుద్ధ భారత ,ఉద్భోదన
ఇతని నినాదం దరిద్ర దేవో భవ .
దివ్య ఙ్ఞాన సమాజం:-
న్యూయార్క్ లో స్థాపించబడింది .
స్థాపకులు : కల్నల్ ఓల్కాట్ (అమెరికా పోరాటం )
2.మేడం బ్లావట్ స్కీ (రష్యా) .
థియస్ అనగా దైవం , సోషియా అనగా ఙ్ఞానం .
ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం విశ్వ మానవ సౌబ్రాతృత్వం పెంపొందించుట .
ఈ సంస్థ కు అద్యక్షుడు కల్నల్ ఒల్కాట్ .
ఇతని మరణం తర్వాత అనిబిసెంట్ అద్యక్షురాలైంది .
అనిబిసెంట్ ఐర్లాండ్ దేశ మహిళ .ఈమె హోం రూల్ ఉద్యమాన్ని నిర్వహించెను .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.