కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
1857 సిపాయిల తిరుగుబాటు వర్ణనలు -
•
వి.డి . సావర్కర్ - ప్రప్రధమ స్వాతంత్ర సంగ్రామం
•
టి.ఆర్ .హోం -నాగరికులు , అనాగరీకులు మధ్య సంఘర్షణ .
•
రీస్ -సాంప్రదాయ శక్తులు క్రీస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు
•
మాలిసన్ , టేలర్ - హిందూ , ముస్లింల తిరుగుబాటు .
•
ఆర్ .సి మజుందార్ - ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం కాదు .
•
1857 తిరుగుబాటు పై ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే గ్రంధాన్ని వి.డి. సావర్కర్ రచించెను .
•
రాజకీయ కారణాలు :-
•
సైన్య సహకార పద్ధతిని వెల్లస్లీ ప్రవేశపెట్టడం .
•
డల్ హౌసీ ప్రవేశ పెట్టిన రాజ్య సంక్రమణ సిద్దాంతం .
•
దుష్ట పరిపాలన పేరుతో స్వదేశీ రాజ్యాలను ఆక్రమించటం .
•
సామాజిక మత కారణాలు : -
•
ప్రజల పై పన్నుల భారం ఎక్కువ .
•
ఆoగ్లేయుల విధానాల వలన చేనేత పరిశ్రమలు , నౌకా నిర్మాణ పరిశ్రమ దెబ్బతిన్నాయి .
•
సతీ సహగమన నిషేదం (1829) , బాల్య వివాహ నిషేదం , వితంతు పునర్వి వాహం (1856) మొదలగు చట్టాలు చేయటం .
•
క్రైస్తవ మిషనరీలు రాక (1833)
•
బలవంతపు మత మార్పిడిలు .
•
3. సైనిక కారణాలు :-
•
మొత్తం ఆంగ్లేయ సైన్యంలో 7/8 వంతు మంది సిపాయిలు భారతీయులు జీతభత్యాలలో గానీ , పదోన్నతులలో గానీ ఆంగ్లేయ సిపాయితో పోల్చినప్పుడు వీరి పట్ల వివక్ష చూపే వారు .
•
ప్రతీ రోజు గడ్డం తీయాలనే నిబందన విధించ బడింది .
•
1856 లో ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం చేయాలని జనరల్ ఎనలిస్ట్ మెంట్ Act చేశారు .
•
ఎన్ ఫీల్డ్ రైఫిల్స్ ప్రవేశ పెట్టారు .
•
ఈ తుపాకులలో ఉపయోగించే తూటాలు ఆవు క్రొవ్వు ,పంది కొవ్వుతో రూపొందించారనే వదంతి ఏర్పడింది .
•
ఈ తుపాకులు ఉపయోగించటానికి నిరాకరించి 1857 ఫిబ్రవరి లో మంగళ్ పాండే అనే సిపాయి బారక్ పూర్ లో తన పై అదికారి కల్నల్ బాగ్ పై కాల్పులు జరిపాడు .దీనితో మంగల్ పాండేను ఉరి తీసాడు .
•
మంగళ్ పాండే 34 వ భెటాలియన్ కు చెందిన సిపాయి .
•
ప్రారంభం : -
•
1857 ఏప్రిల్ లో మీరట్ లో సిపాయిలు ఎన్ ఫీల్డ్ తుపాకులు ఉపయోగించుటకు నిరాకరించారు .ఆంగ్లేయులు వారిని విచారించి 85 మందికి జైలు శిక్ష విధించారు .
•
దీనికి నిరసనగా సిపాయిలు తమ అనుచరు;లను విడిపించుకొని డిల్లీ వైపు బయలు దేరారు .
•
1857 మే 10 న మీరట్ తిరుగుబాటు ప్రారంభమైనది .
•
ఢిల్లీ :-
•
ఢిల్లీ చేరుకున్న సిపాయిలు ఎర్రకోటలోని ఆంగ్లేయ రెసిడెంట్ అధికారి సిమన్ రిఫ్లీ ని వధించి మొగల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా జాఫర్ ను తమ నాయకుడిగా ప్రకటించారు .
•
రెండవ బహదూర్ షా భారత చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు .
•
ఆంగ్లేయులు బహదూర్ షా ను బంధించి రంగూన్ జైలుకు పంపగా అచ్చటే మరణించాడు .
•
ఇతని కుమారుడు,భార్యను ఆంగ్లేయులు కాల్చి చంపారు.
•
దీనితో మొఘల్ వంశం అంతరించిపోయింది .
•
కాన్ పూర్ :-
•
కాంపూర్ తిరుగు బాట్లకు నానాసాహెబ్ నాయకత్వం వహించాడు .
•
ఇతని అసలు పేరు దొంతు పండిట్ చివరి పీష్వా బాజీరావు రెండవ దత్తపుత్రుడు .
•
ఇతని సేనకు తాంతియా తోపే ,అజీముల్లాలు నాయకత్వం వహించారు .
•
అలహాబాద్ లో 400 మంది ఆంగ్లేయులను తిరుగుబాటుదారులు చంపుటతో ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంది.
•
కాంపెబెల్ అనే సైనిక అధికారి కాన్ పూర్ లో తిరుగుబాటు దారులను అణచివేసెను .
•
నానాసాహెబ్ నేపాల్ పారిపోగా తాంతియా తోపే మధ్య భారత అడవులలోనికి వెళ్ళాడు.
•
మాన్ సింగ్ అనే మహారాష్ట్ర సర్దార్ నమ్మక ద్రోహం వలన తాంతియా తోపే ఆంగ్లేయులకు చిక్కగా 1859 ఏప్రీల్ 19 న ఉరి తీయబడ్డాడు .
•
ఝాన్సీ :-
ఝాన్సీ పాలకుడు గంగాధర రావు సంతానం లేక పోవటం వలన దామోదర్ రావ్ అనే బాలుడిని దత్తత తీసుకున్నారు .
•
ఆంగ్లేయులు దీనికి అంగీకరించలేదు .
•
గంగాధర్ రావ్ మరణం తో ఆంగ్లేయులపై అతని భార్య లక్ష్మీ బాయ్ పోరాటం ప్రారంభించినది .
•
ఈమె అసలు పేరు మణి కర్ణిక
•
లక్నో (అవధ్) :-
ఇక్కడ బేగం హజరత్ మహల్ తిరుగుబాటు చేసెను .
•
క్యాంప్ బెల్ ఈ తిరుగుబాటును అణచివేసెను .
•
ఆంధ్ర లో తిరుగుబాటు
•
1853 లో వహాబి ఉద్యమం సందర్భంగా కడప నవాబు గులాం రసూల్ ఖాన్ ఆంగ్లేయులపై జిహాద్ ప్రకటించాడు .
•
దాని ప్రభావం 1857 వరకు సాగింది .
•
ఫలితాలు :
•
1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఈస్టిండియా పాలన రద్దు చేయబడినది .
•
బ్రిటిష్ గవర్నర్ జనరల్ ను గవర్నర్ జనరల్& వైశ్రాయిగా మార్చారు .
•
మొదటి వైశ్రాయి లార్డ్ కానింగ్
•
మొదటి భారత రాజకీయ వ్యవహారాల మంత్రి - ఛార్లెస్ ఉడ్స్
•
1858 తరువాత 563 రాజ్యాలు స్వదేశీ రాజ్యాలుగా ఉన్నాయి .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.