వైదిక /ఆర్యుల నాగరికత

• ఆర్యులు నార్టిక్ జాతికి చెందిన ప్రజలు
• ఆర్యుల చరిత్రకు ఆధారం వేద సాహిత్యం
• వేద అనే పదం విద్ నుంచి ఆవిర్భవించింది. విద్ అనగా గ్రహించటం.
• వేదాలు వ్రాయబడిన కాలం క్రీ.పూ 500-600
• వేదాలు అపౌరుషనీయాలు . అనగా ఎవరు రచించ లేదు. సృష్టి కర్తే వీటిని అందచేశాడు .
వేద సాహిత్యము
1.వేద సంహితాలు
2. బ్రాహ్మణాలు
3.అరణ్యకాలు
4.ఉపనిషత్తులు
5.వేదాంగాలు
6.సూత్రాలు
7.పురాణాలు
8.ఉపవేదాలు
9.ఇతిహాసాలు
10. దర్శనములు
వేద సంహితాలు :-
ఇవి నాలుగు
1. ఋగ్వేదం :-
• ఇది ప్రాచీన వేదం .
• దీనిలో మంత్రాలు ,ప్రార్ధనలు , శ్లోకాల రూపంలో ఉంటాయి. దీనినే స్తొత్ర వేదం అంటారు .
• 1017 + 11 =1028 శ్లోకాలున్నాయి .
• మొత్తం 10 మండలాలు కలవు (భాగాలు) .
"గాయత్రీ మంత్రం "(సావిత్రిని ప్రార్ధించటం ) 3 వ మండలంలో కలదు .
• 7 వ మండలంలో దశరాజగణ యుద్దం గూర్చి కలదు .
• 9 వ మండలంలో సోమదేవుని ప్రార్దన కలదు .
• 10 వ మండలంలో విశ్వ జననం వర్ణ వ్యవస్థ గూర్చి కలదు .
•10 వ మండలంలో పురుష సూక్తంలో మొదటి సారి శూద్రం అనే పదం కలదు.
•10 వ మండలంలో 4 వర్ణాల ప్రస్థావన కలదు.
•ఋగ్వేదమును పఠించే పూజారిని హోత్రీ అంటారు .
సామ వేదం :
• సామ =సంగీతం
•ఇది సంగీతానికి సంబంధించినది.
•భారత దేశంలో సంగీతానికి మొదటి గ్రంధం.
•దీనిని ఆలపించు వారిని ఉద్గాత్రి అందురు .
యజుర్వేదం :-
•కృష్ణ యజుర్వేదం :
ఇది గద్య రూపంలో వ్రాయ బడింది .
•శుక్ల యజుర్వేదం :
ఇది పద్య రూపంలో వ్రాయబడింది .
•యజుర్వేదం యజ్ఞ ,యాగానికి క్రతువులను గూర్చి తెలియ చేస్తుంది .
•దీనిని అద్యయనం చేయు వారిని "అధ్వర్వు " అందురు .
అధర్వణ వేదం :
•ఇది ఆర్యేతరులు రచించారు
•ఇది భూత ప్రేత పిశాచాలను అంతం చేయుట గూర్చి తెలుపుతుంది.
•రోగాలను నయం చేయటానికి మంత్రాలు ఉంటాయి.
•వైద్యం గూర్చి చెప్పిన మొదటి గ్రంధం ఇది .
•మంత్రాలు ,మాయలు , వింతలు ఉంటాయి .
•దీనిని అద్యయనం చేయు వారిని బ్రాహ్మాణ అని పిలుస్తారు .
బ్రాహ్మణాలు : -
•బ్రాహ్మణాలు = యజ్ఞయాగాలు .
•గద్య రూపంలో సరళంగా సులభంగా అర్ధమయ్యే విదంగా వేదాలను బ్రాహ్మణాల రూపంలో వ్రాయబడ్డాయి .
•వీటిలో యజ్ఞాల గూర్చి ఉంటుంది .
వివిధ రకాల బ్రాహ్మణాలు :-
1.ఐతరేయ బ్రాహ్మాణం
2.కౌశాటకి బ్రహ్మణం
3.శతపత బ్రహ్మణం
•ఋగ్వేదంలో గల బ్రాహ్మణాలు -ఐతరేయ , కౌశటకి (లేదా సంఖ్యాన)
•సామ వేదంలో గలవి -చాందోగ్య , జైమినేయ , పాంచవిష
•యజుర్వేదంలో గలవి-శతపథ , తైతరీయ .
•అధర్వణ వేదంలో గలవి -గోపధ బ్రాహ్మణం
•అతి పెద్ద బ్రాహ్మణం -శతపథ బ్రాహ్మణం
•ఇందులో వడ్డీ వ్యాపారం ఉపనయనం మృత్యువు ,భర్తలో భార్య సగం మొదలైనవి కలవు .
అరణ్యకాలు :-
•ఇవి అడవులలో నివసించే మునులు, ఋషులకు సంభందించింది . వీటిని అటవీ గ్రంధాలు అని పిలుస్తారు .
•ఇవి బ్రాహ్మణాలకు అనుబంధాలు (చివరి భాగాలు)గా వ్రాయ బడ్డాయి.
ఉదా : ఐతరేయ అరణ్యకము .
•తపస్సు ద్వార మోక్షం సాదించవచ్చు అని తెలుపుతున్నాయి.
ఉపనిషత్తులు :-
• వీటినే వేదాంతం అందురు.
• ఙ్ఞానం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చునని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి .
• ఉపనిషత్తులలో ప్రాచీనమైనది -బృహదారన్యకోపనిషత్తు .
• మొత్తం ఉపనిషత్తుల సంఖ్య -108
1.చాందోగ్యోపనిషత్ - తత్వమసి , బ్రహ్మసత్యం , జగన్మిద్య అనే వాక్యాలున్నాయి .
2.బృహదారణ్యకోపనిషత్తు - (అతీ ప్రాచీనమైనది )
3.ఈశానోపనిషత్
4.శ్వేతేశ్వతారోపనిషత్
5.ముండ కోపనిషత్ (సత్య మేవ జయతే అనే వాక్యం ఉంది).
6.కఠోపనిషత్ మృత్యువు గురుంచి నచికేతుని యముని మద్య సంభాషణ ఉంది.
వేదాంగాలు :-
1.శిక్ష - ఉచ్చారణకు
2.నిరుక్తి-శబ్ద ఉత్పత్తి గూర్చి ఉంటుంది
3. చందస్సు
4.వ్యాకరణం
5.జ్యోతిష్యం
6.కల్ప,యజ్ఞ ,యాగాలను గురించి తెలుపుతుంది
సూత్రాలు :-
ఇవి నాలుగు
1.గృహ -గృహ కార్యములు గురించి వివరించుము .
2.శ్రౌత - అగ్ని , సోమ యఙ్ఞాలు గూర్చి తెలుపుము .
3.సుళువ - సాధారణ జీవన నియమాలు తెలియచేయును .
4.ధర్మ -గృహ ధర్మాలు గూర్చి తెలియ చేయును .
పురాణాలు
• 18 పురాణాలు ఉన్నాయి
• మత్స్య పురాణం అత్యంత పురాతనం అయింది .
ఉప వేదాలు
ప్రదాన వేదాలకు 4 ఉప వేదాలు
1ఆయుర్వేదం -ఋగ్వేదానికి ఉపవేదం - వైద్యం
2.గాంధర్వ వేదం - సామవేదానికి ఉప వేదం - సంగీతం
3.ధనుర్వేదం -యజుర్వేదానికి ఉపవేదం - యుద్ద విద్యలు
4.శిల్ప వేదం -అధర్వణ వేదానికి ఉప వేదం - వాస్తు , శిల్ప కళలు
ఇతిహాసములు
రామాయణం
• రామాయణం అయొధ్యను ఏలిన శ్రీ రాముడు గూర్చి తెలుపును .
• శ్రీ రాముడు ఇక్ష్వాకు వంశానికి చెందిన వాడు.
• దీనిని అది కావ్యంగా పిలుస్తారు . దీనిని సంస్కృతంలో రచించిన వాల్మికీ ఆది కవిగా పేరొందాడు .
• ఇందులో 7 కాండాలు గలవు .
• ఇది ఆర్య నాగరికత దక్షిణ భారతానికి విస్తరణ గురించి తెల్పును .
• ఆర్య సంస్కృతి దక్షిణానికి విస్తరింప చేసింది- ఆగస్త్యుడు
• సంస్కృత రామయణం ను మొదట వివిద భాషలలో అనువాదం చేసింది .
1.తెలుగు - గోన బుద్ధా రెడ్డి
2.తమిళం - కంబన్
3.కన్నడం - పంపా
4.బెంగాలి - కృతి వ్యాసుడు
5. హిందీ -తులసీ దాస్ (రామ చరిత మానస్)
• రామచరిత మానస్ లో హనుమాన్ చాలీసా కలదు .
మహాభారతం :-
• దీనిని వేద వ్యాసుడు రచించాడు
• పంచమ వేదమని పేరు
• ఇందులో లక్ష శ్లోకాలు గలవు .
• ద్వాపర యుగానికి చెందినది
• 18 పర్వాలుగా విభజించ బడింది
• ప్రపంచంలో అతి పెద్ద గ్రంధం
•దీనికి జయసoహిత,పంచమ వేదం అనే పేర్లు కలవు .
•మరో పేరు శత సహస్ర సంహిత (1 లక్ష పద్యాలు)
•6 వ పర్వం భీష్మ పర్వంలో భగవద్గీత కలదు .
•మహా భారతం ను ఆంధ్రీకరించినది
1.నన్నయ (2 1/2)
2.తిక్కన్న(15 పర్వాలు)
3.ఎర్రా ప్రగడ (1/2 పర్వం )
దర్శనములు
ఇవి మొత్తం ఆరు
•వీటిని షడ్ దర్శనాలు అంటారు
•ఇవి తత్వానికి సంబంధించి తెలియజేస్తాయి .
1)సాంఖ్య దర్శనం - కపిలుడు స్థాపించాడు .
2)యోగ దర్శనం -పతంజలి ప్రారంభించాడు .
3)వైశ్లేషిక దర్పణం -కణాద ఋషి - పరమాణు సిద్ధాంతం ఉంది .
4) న్యాయ దర్శనం - గౌతముడు
5) మీమాంస - పూర్వ మీ మాంస - జైమిని మహర్షి
6) ఉత్తర మీమంస - వేదంతం - బాదరయునుడు
•బాదరయునుడు బ్రహ్మ సూత్రలు లేద వేదంత సూత్రాలు అనే పుస్తకాన్ని రాశాడు .
ఆర్యుల జన్మ స్థలం గూర్చి చరిత్ర కారుల అభి ప్రాయం :-
•వీరి జన్మ స్థలం భారత దేశంలోని సప్త సింధు ప్రాంతం అని అభిప్రాయ పడింది - ఎ.సి.దాస్
•సప్త సింధు అనగా
1. జీలం - వితస్థ నది
2.బియస్ -విపస
3.సట్లెజ్ -సతుద్రి
4.రావి-పరుషిణి
5.చీనాబ్ -అసికిని
•బాల గంగాధర్ తిలక్ అర్కిటిక్ హోం ఆఫ్ ఆర్యన్స్ అనే గ్రంధంలో ఆర్యులలో ఉత్తర ధృవం నుంచి వలస వచ్చారని అభిప్రాయ పడ్డాడు .
•దయానoద సరస్వతి టిబెట్ నుంచి వచ్చారని సిద్ధాంతీకరించాడు .
•మాక్స్ ముల్లర్ ప్రకారం మధ్య ఆసియా నుంచి వచ్చారు . ఇతను ఇండాలజిస్ట్ (ఇండియాను అద్యయనం చేసే శాస్త్రం ).