కంపెనీ పరిపాలనలో భారత దేశం

1. పరి పాలన :-
1773 రెగ్యులేటింగ్ చట్టం - ఈ చట్టం ద్వారా
గవర్నర్ ఆఫ్ బెంగాల్ ను గవర్నర్ జనరల్ గా మార్చారు .
బొంబాయి మద్రాసుల గవర్నర్ లను యుద్ధము సంధుల విషయంలో ఇతని అధికార పరిధిలోకి తీసుకొచ్చారు .
గవర్నర్ జనరల్ కు 4 గురు సభ్యులు గల ఎగ్జిక్యుటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు .
గవర్నర్ జనరల్ కు వీరిలో ఇద్దరి మద్దతు తప్పని సరి .
ఇంగ్లాండ్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ లు 24 మంది సభ్యులు గల కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ను ఏర్పాటు చేశారు
. వీరు వ్యాపార వ్యవహారాలు మాత్రమే నిర్వహిస్తారు .
పోర్ట్ విలియం కోట లో 1774 లో సుప్రీం కోర్ట్ ను ఏర్పాటు చేశారు .
మొదటి ప్రధాన న్యాయ మూర్తి "సర్ ఎలిజా ఇంఫే "(3 + 1)
పిట్ ఇండియా చట్టం (1784) : -
ఇంగ్లాండ్ ప్రధాని పిట్ విలియం జూనియర్ పేరు మీదగా ఈ చట్టాన్ని ఈ పేరుతో పిలుస్తారు .
ఈ చట్టం ద్వారా 6 గురు సభ్యులు గల బోర్డ్ , గవర్నర్ జనరల్ , కార్య నిర్వహణా కౌన్సిల్ లోని సభ్యుల సంఖ్యని 4 నుంచి 3 కు తగ్గించారు .
వీరిలో ఒకరి మద్దతు సరిపోతుంది .
న్యాయ పాలన:-
1773 లో రెగ్యులేటింగ్ చట్టం ద్వారా సుప్రీం కోర్ట్ ను ఏర్పాటు చేశారు .
హిందూ న్యాయ సూత్రాలను గ్రంధస్తం చేయించింది -వారన్ హేస్టింగ్స్ .
కారన్ వాలీస్ :-
సంచార న్యాయ స్థానాలను ప్రవేశ పెట్టాడు .
Court of records ప్రవేశ పెట్టాడు
సంచార న్యాయ స్థానాలను రద్దు చేసింది - విలియం బెంటిక్
స్తానిక సంస్థల పితా మహుడు - లార్డ్ రిప్పన్ .
సివిల్ సర్వీసులు :-
శిస్తు వసూలు చేసే జిల్లా సూపర్ వైజర్ల పేరును కలెక్టర్ అని మార్చిన వాడు - వారెన్ హేస్టింగ్స్ .
మొట్టమొదటి భారతీయ ఐసిఎస్ అధికారి - సత్యేంద్రనాధ్ ఠాగూర్ (1863)
రెండవ వాడు -సురేంద్రనాధ్ బెనర్జీ
మూడవ వ్యక్తి -సుభాష్ చంద్ర బోస్
సివిల్ సర్వీసెస్ పై వేసిన కమీషన్ లు
1. అచ్చీసన్ కమీషన్ (1886)
2. లీ కమీషన్ (1924 )
ఆర్ధిక ,సామాజిక పాలన :-
1853 లో భారత దేశం లో మొదటి రైలు మార్గం బొంబాయి నుంచి థానే వరకు ప్రారంభించారు .
దీని పొడవు 34 కి.మీ.
గవర్నర్ జనరల్ డల్ హౌసి
రెండవ రైలు మార్గం రాణి గంజ్ -కోల్ కతా
1862 లో ఆంధ్రలో మొదటి రైలు మార్గం -పుత్తూరు నుండి రేణిగుంట
చట్టాలు : -
1. సతీ సహగమన నిషేధ చట్టం :
1829 గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఈ చట్టం చేసెను . ఈ చట్టం కోసం కృషి చేసిన వ్యక్తి రాజా రామ్మోహన రాయ్ .
2. భానిస వ్యవస్థ నిర్మూలనా చట్టం (1833-43):-
1833 లో చట్టం చేసింది - విలియం బెంటిక్ .
3.నరబలుల నిషేధ చట్టం 1846
గవర్నర్ జనరల్ హార్డింజ్ -1 ఈ చట్టం చేసెను .
ఒరిస్సాలోని కోండ్ అనే తెగలో నరబలులు ఎక్కువ .
కుల వివక్షత నిర్మూలన చట్టం (1850 )
గవర్నర్ జనరల్ డల్ హౌసీ జారీ చేసెను .
వితంతు పునర్ వివాహాల చట్టం 1856
విద్యా కమిటీలు
ఉడ్స్ డిస్పాచ్ కమిటీ : -
1854 లో లార్డ్ డల్ హౌసీ ఆమోదించెను .
సిఫారసులు
ప్రాధమిక విద్యావ్యాప్తి
శాస్త్ర సాంకేతిక విద్య
విశ్వ విద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి
ప్రాధమిక విద్య స్థానిక భాషలో ఉన్నంత విద్య ఆంగ్లం లో ఉండాలి .
ఉడ్స్ డిస్పాచ్ ను విద్యా విధానానికి మాగ్నాకార్టా అని పిలుస్తారు .
2. w హర్తోగ్ కమిటీ
3.థామస్ ర్యాలీ కమిటీ
4.శ్లాండార్ కమిటీ
5 .సార్జంట్ కమిటీ
6 జాకిర్ హుస్సేన్ కమిటీ లేదా వార్ధా ప్రణాళిక