ఆంగ్లేయ రాజ్య స్థాపన

ప్లాసీ యుద్ధం (1757 జూన్ 23):-
• మొఘల్ సామ్రాజ్యం నుండి విడిపోయిన మొదటి రాజ్యం బెంగాల్ .
• 1717లో ముర్షీద్ ఖులీఖాన్ అనే గవర్నర్ బెంగాల్ ను స్వతంత్రంగా పాలించటం ప్రారంభించారు .
• 1740 లో గవర్నర్ గా వచ్చిన అలీవర్దీఖాన్ బెంగాల్ ను పూర్తిగా స్వతంత్ర రాజ్యం గా ఏర్పరిచాడు .
• ఇతని తర్వాత సిరాజుద్దౌల 1756 లో బెంగాల్ కు నవాబయ్యాడు .
సిరాజుద్దౌల , అంగ్లేయులు మధ్య విభేదాలకు కారణాలు :-
• కోటల వివాదం - ఆంగ్లేయులు సిరాజుద్దౌలా ఆఙ్ఞలు ధిక్కరించి బెంగాల్లోని తమ స్థావరాల చుట్టూ కోటలు నిర్మించటం ప్రారంభించారు .
• దస్తకల వివాదం - ఆంగ్లేయుల వస్తువులను గుర్తిస్తూ గవర్నర్ జారీ చేసే పత్రాలను దస్తక్ లు అంటారు. వీటిని అంగ్లేయుల దుర్వినియోగం చేసారు .
• ఆంగ్లేయులు సిరాజుద్దౌలా ప్రధానమంత్రి మీర్ జాఫర్ ను చేరదీసి అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహించారు .
• సిరాజుద్దౌలా పై తిరుగుబాటు చేసిన ఢాకా గవర్నర్ రాజ్ వల్లభ్ ,అతని కుమారుడు కృష్ణ వల్లభ్ లకు డ్రేక్ అనే ఆంగ్లేయ అధికారి లంచం తీసుకోని పోర్టు విలియం కోటలో ఆశ్రయమిచ్చారు .
• దీనితో సిరాజుద్దౌలా పోర్ట్ విలియం కోటను ముట్టడించి 147 మందిని ఒక చిన్న చీకటి గదిలో బంధించాడు .
• వీరిలో 17 మంది తప్ప మిగతా వారు మరణించారు .
• దీనిని కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు .
• దీనితో ఆంగ్లేయులు రాబర్ట్ క్లైవ్ కు కొంత సైన్యాన్నిచ్చి సిరాజుద్దవులాతో యుద్ధానికి పంపారు .
• రాబర్ట్ క్లైవ్ ,సిరాజుద్దౌలా ప్రధాని మీర్ జాఫర్ తో సంధి చేసుకోని ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ను చంపేశారు .
• మీర్ జాఫర్ ను బెంగాల్ నవాబుగా నియమించాడు .
• భారత దేశం లో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వంటిది -ప్లాసీ యుద్ధం .
• భారత దేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపకుడు - రాబర్ట్ క్లైవ్ .
మీర్ జాఫర్ (1757-1761) :-
• 24 పరగణాలను ఆంగ్లేయులకు ఇచ్చేశాడు .
• రాబర్ట్ క్లైవ్ వంటి అధికారులకు పెద్ద మొత్తంలో కానుకలు ముట్ట చెప్పాడు .
• 1761 లో ఎదురు తిరిగిన ఇతన్ని తొలగించి ఇతని అల్లుడు మీర్ ఖాసిం ను నవాబు గా చేశారు .
మీర్ ఖాసిం (1761-64) :-
• ఆంగ్లేయుల జోక్యాన్ని భరించలేక సైన్యాన్ని బలోపేతం చేయటం , భారతీయ వర్తకులకు పన్ను మినహాయింపు ను ఇవ్వటం వంటి చర్యలు తీసుకున్నాడు .
• దీనితో ఇతన్ని తొలగించి మీర్ జాఫర్ ను నవాబు గా నియమించాడు .
బక్సార్ యుద్ధం(1764):-
• మీర్ ఖాసిం , అయొద్య నవాబు ఘజా ఉద్దౌలా & మొఘల్ చక్రవర్తి షా ఆలం - 2 లు కూటములుగా ఏర్పడి ఆంగ్లేయులు పై యుద్ధం ప్రకటించారు . ఇదే బక్సార్ యుద్ధం .
• అంగ్లేయ సేనాని హెక్టర్ మన్రో ఈ కూటమిని ఓడించాడు .
• రెండవ షా ఆలం 1765 లో రాబర్ట్ క్లైవ్ తో అలహా బాద్ వద్ద సంధి చేసుకున్నాడు . దీనినే అలహాబాద్ సంధి అంటారు .
• ఈ సంధి ప్రకారం బెంగాల్,బీహార్ ,ఒరిస్సా లలో శిస్తు వసూలు చేసుకొనే అధికారం ఆంగ్లేయులకు దక్కింది .
• శాంతి భద్రతలు మరియు ఇతర అధికారాలు నవాబు ఆధీనం లో ఉంచారు .
• దీనిని ద్వంద్వ పాలన అంటారు
• బెంగాల్ ద్వంద్వ పాలన ఏర్పరిచిన గవర్నర్ - రాబర్ట్ క్లైవ్ .
ఆంగ్లో మైసూరు యుద్ధాలు :-
• 1610 లో విజయ నగర సామ్రాజ్యం అంతం తరువాత మైసూరు ప్రాంతానికి గవర్నర్ గా ఉన్న ఒడయార్ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు .
• వీరి రాజధాని శ్రీరంగ పట్నం
• సాధారణ సిపాయిగా జీవితాన్ని ప్రారంభించిన హైదర్ అలీ దిండిగల్ కు ఫౌజుదార్ గా నియమించబడ్డాడు .
• 1761 లో మైసూరు నవాబు అయ్యాడు హైదర్ అలీ
• హైదరాబాద్ నిజాం ను మరియు మహారాష్ట్రులను ఓడించాడు .
ఆంగ్లేయులతో యుద్ధాలు :-
మొదటి యుద్ధం( 1766 - 69):-
• ఈ యుద్ధం లో హైదర్ అలీ మద్రాస్ గవర్నర్ లార్డ్ మెకార్టీ ని ఓడించాడు .
• హైదర్ అలీ ప్రగతిని చూసి ఆంగ్లేయులు ,మరాఠులు ,హైదరాబాద్ నిజాం ఈర్ష్య చెందారు .
• దీని ఫలితంగా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభమైనది .
• మద్రాస్ సంధి తో ఈ యుద్ధం ముగిసింది .
రెండవ యుద్ధం (1780-84) :-
• ఈ యుద్ధం లో హైదర్ అలీ మరియు అతని కుమారుడు టిప్పు సుల్తాన్ కలిసి ఆంగ్లేయ గవర్నర్ వారన్ హేస్టింగ్స్ తో యుద్ధం చేశారు .
• ఈ యుద్ధం జరుగుతుండగానే హైదర్ అలీ మరణించాడు .
• టిప్పు సుల్తాన్ పట్టాభిషేకము చేసుకోని యుద్ధాన్ని కొనసాగించాడు .
• ఓడిపోయిన ఆంగ్లేయులు మంగుళూరు వద్ద సంధి చేసుకున్నారు .
మూడవ యుద్ధం (1789-92) :-
• టిప్పు సుల్తాన్ బిరుదు మైసూర్ పులి .
• ఇతను యూరోపియన్ తరహాలో మైసూర్ ను పరిపాలించాడు .
• శ్రీ రంగ పట్నం లో స్వేచ్చా వృక్షాన్ని నాటాడు .
• టిప్పు 1790 లో ఆంగ్లేయుల రక్షణలో ఉన్న ట్రావెన్ కోర్ పై దాడి చేయుటతో ఈ యుద్ధం ప్రారంభమైనది .
• ఈ యుద్ధం లో ఆంగ్లేయ గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ టిప్పు సుల్తానును ఓడించి అతని సగం రాజ్యాన్ని ఆక్రమించాడు .
• శ్రీ రంగ పట్నం సంధి తో ఈ యుద్ధం ముగిసింది .
• ఈ సంధి ద్వారా ఆంగ్లేయులకు 3 కోట్ల నష్ట పరిహారం టిప్పు సుల్తాన్ చెల్లించాలి .
నాల్గవ యుద్ధం :-
• టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ వారికి ఆశ్రయం కల్పిస్తున్నాడనే నెపంతో ఆంగ్లేయులు మైసూర్ పై దాడి చేశారు .
• ఈ యుద్ధం లో లార్డ్ వెల్లస్లీ టిప్పు ను చంపేశాడు .
• 1799 లో సైన్య సహకార ఒప్పందం పై సంతకం చేయించుకోని ఒడయార్ వంశానికి చెందిన చిట్ట కృష్ణరాజ -2 ని మైసూరు కు నవాబుగా నియమించాడు .
ఆంగ్ల - మరాఠ యుద్ధాలు :-
మొదటి యుద్ధం (1775 - 82 )
• 1775 లో పీష్వా గా ఉన్న నారాయణ రావును అతని పినతండ్రి రఘోబా హత్య చేయించి తాను పీష్వా కావడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా 1775 లో ఆంగ్లేయులతో సూరత్ వద్ద సంధి చేసుకున్నాడు .
• ఈ సంధి ప్రకారం బేసిన్,సాల్సెట్టి లను ఆంగ్లేయులకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు .
• నానా ఫడ్నవీస్ మహాదాజి సింధియా మొదలగు సర్దార్ లు 2 వ మాధవరావును పీష్వా ప్రకటించి అతని తరుపున యుద్ధం ప్రారంభించారు .
రెండవ యుద్ధం (1803-1805 ):- క్రీ.శ. 1800 లో రెండవ మాధవరావు మరణించటం తో రఘోబా కుమారుడు 2 వ బాజీరావు ఆంగ్లేయుల సహాయముతో పీష్వా అయ్యాడు .
• ఇతడు 1802 లో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడు.
• దీనిని వ్యతిరేకిస్తూ కొందరు మరాఠా సర్దార్ లు ఆంగ్లేయులపై యుద్ధం చేసి ఓడిపోయారు .
మూడవ యుద్ధం (1817 - 1818 ) :-
• పరిపాలనలో ఆంగ్లేయుల జోక్యాన్ని వ్యతిరేకించిన 2 వ బాజీరావు తిరుగుబాటు చేశాడు .
• ఈ యుద్ధం లో ఆంగ్లేయులు గెలిచారు .
సింధ్ ఆక్రమణ(1843) :-
• సింధ్ ప్రాంతాన్ని అమీరులు పరిపాలించేవారు .
• 1843 లో గవర్నర్ జనరల్ ఎలెన్ బరో కాలం లో ఛార్లెస్ నేపియర్ అనే గవర్నర్ సింద్ ను ఆక్రమించాడు .
• మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం (1845-46)
• రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం (1848-49)
• అవధ్ రాజ్య ఆక్రమణ -1856 లో