• క్రీ.శ.1453 లో మహ్మద్ -2 అనే తురుష్క చక్రవర్తి కానిస్టాంట్ నోపిల్ ముఖ్య కేంద్రంగా గల బైజాంటియన్ సామ్రాజ్యాన్ని జయించాడు .
•
ఇతడు ఐరోపా వాసులు తూర్పు దేశాలతో వ్యాపారానికి ఉపయోగించే భూ మార్గాన్ని మూసివేశాడు.
•
దీనితో భారత దేశానికి కొత్త మార్గం కనుగొనే ప్రయత్నంలో
•
వాస్కోడిగామా అనే పోర్చు గీసు నావికుడు 1498 మే 17 న భారత దేశం యొక్క పశ్చిమ తీరం లో ఉన్న కాలికట్ చేరుకున్నాడు .
•
అప్పుడు కాలికట్ ను పాలిస్తున్న రాజు జామొరిన్
•
జామొరిన్ వాస్కోడిగామాను ఆదరించి అతనికి కావలసిన వస్తువులను కొనిపించెను .
•
వాస్కోడిగామా 1502 అక్టోబర్ 30 న రెండవ సారి భారతదేశానికి వచ్చాడు .
ఐరోపావాసుల రాక
•
1. పోర్చుగీసువారు :-
•
క్రీ.శ. 1500 లో ఎస్టోడ -డ-ఇండియా అనే కంపెనీ పేరుతో తూర్పు దేశాలతో వ్యాపారానికి వచ్చారు .
•
వీరి మొదటి స్థావరం సూరత్
•
వీరి ప్రధాన స్థావరం కొచ్చిన్ .1510 తర్వాత ప్రధాన స్థావరం గోవా
•
వీరి వ్యాపారాలు నిర్వహించుటకు 3 సం|| పదవీ కాలం కలిగిన గవర్నర్ పదవిని సృష్టించారు .
•
వీరి మొదటి గవ్రనర్ ఫ్రాన్సిస్ -డి-అల్మిడా
•
ఇతను బ్లూ-వాటర్ -పాలసీని ప్రవేశపెట్టాడు .
•
రెండవవాడు అల్బూక్కర్ .ఇతను భూభాగాలు జయించెను .
•
ఇతను 1510 లో గోవాను జయించాడు .
•
1511 లో మలక్కాను జయించాడు .
•
మరాఠాల పీష్వా బాజీరావ్ బేసిన్,సాల్సెట్టిల నుండి పోర్చుగీసువారిని తరిమివేశాడు.
•
గోవా తప్ప మిగతా స్థావరాలను వీరు కోల్పోయారు .
•
1961 లో ఆపరేషన్ విజయ్ పేరుతో సైనిక చర్య జరిపి పోర్చుగీసు వారిని తరిమి గోవాను భారత దేశం లో కలిపారు .
•
భారత్ నుండి చివరిగా వెళ్ళిన ఐరోపావారు - పోర్చుగీసువారు .
•
డచ్ వారు :-
•
క్రీ.శ. 1602 లో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో తూర్పు దేశాలతో వ్యాపారానికి వచ్చారు .
•
వీరి మొదటి స్థావరం - సూరత్
•
ప్రధాన స్థావరం -పులికాట్
•
1759 లో ఆంగ్లేయులతో బదెర అనే ప్రదేశం వద్ద జరిగిన యుద్ధంలో ఓడిపోయి భారత దేశం వదిలి వెళ్ళిపోయారు .
•
ఆంగ్లేయులు :-
•
1600 సం|| డిసెంబర్ 31 న ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు .
•
ఆంగ్లేయుల మొదటి స్థావరం - సూరత్ 1608
•
భారత దేశం లో ఆంగ్లేయులకు వ్యాపారానికి అనుమతి ఇచ్చిన మొఘల్ - జహంగీర్
•
మచిలీపట్నం లో వ్యాపారానికి అనుమతించిన గోల్కొండ సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్ షా
•
ఆంగ్లేయుల ప్రధాన స్థావరాలు :-
•
బ్రిటిష్ అధికారి ప్రావిన్స్ డే 1639 లో చంద్రగిరి పాలకుడు 3 వ వెంకటపతి రాయలు వద్ద మద్రాస్ ప్రాంతాన్ని పొందాడు .
•
మద్రాస్ పొందటం లో ఆంగ్లేయులకు దామెర్ల వెంకటాద్రి ,అతని సోదరుడు అయ్యప్పలు సహకరించారు .
•
ఆంగ్లేయులు మద్రాస్ లో సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు .
•
1661 లో బ్రిటిష్ యువరాజు 2 వ చార్లెస్ పోర్చుగీసు యువరాని క్యాథరీన్ ను వివాహమాడిన సందర్భంగా బొంబాయిని పోర్చుగీసు వారి నుండి కట్నం గా పొందారు .
•
1689 లో మొఘల్ చక్రవర్తి ఔరంగ జేబు నుండి జాబ్ చార్నాక్ అనే ఆంగ్లేయాధికారి కాళీఘాట్,సుతనతి ,గోవింద పూర్ అనే గ్రామాలను ₹1300 లకు కొనుగోలు చేశాడు .
•
అచ్చట విలియం కోటను ఆంగ్లేయులు నిర్మించారు .
•
ఈ మూడు గ్రామాలు కలకత్తాగా అభివృద్ధి చెందాయి .
•
డేన్స్ (డెన్మార్క్ ):-
•
1616 లో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇండియా కి వచ్చారు .
•
ముఖ్య స్థావరాలు :-
•
సేరంపూర్,ట్రాంకుబార్
•
తమ వర్తక స్థావరాలు ఆంగ్లేయులకి 1845 లో అమ్మేసి భారత్ నుంచి వెళ్ళిపోయారు .
•
ఫ్రెంచి వారు :-
•
1664 లో ఫ్రాన్స్ ఆర్ధిక మంత్రి కోల్బర్ట్ ఫ్రెంచి వ్యాపార కంపెనీలో 1/3 వ వంతు ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టి తూర్పు దేశాలతో వ్యాపారానికి పంపారు .
•
అందుకే దీనికి కోల్బర్ట్ సంఘం అని పేరు .
•
1668 లో ఫ్రెంచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం పేరుతో ఇండియాకి వచ్చారు .
•
మొదటి స్థావరం - సూరత్
•
ప్రధాన స్థావరం -పాండిచ్చేరీ
•
పాండిచ్చేరీ నగర నిర్మాత -ఫ్రాంకోయిజ్ మార్టీన్
•
1954 వరకు పాండిచ్చేరి ఫ్రెంచి వారి ఆధీనం లో ఉండేది .
•
1954 లో ఇండియా స్వాధీనం చేసుకోని 1962 లో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.