మొఘల్ పతనం -స్వతంత్ర రాజ్యాలు

హైదరాబాద్ రాజ్యం (1724-1948 ) :-
• హైదరాబాద్ రాజ్యాన్ని 1724 లో మీర్ ఖమ్రుద్దిన్ చింకులిచ్ ఖాన్ స్థాపించాడు .
• ఇతని బిరుదు నిజాం-ఉల్-ముల్క్,అసఫ్ జా
• అందువలన వీరిని నిజాం లుగా పిలుస్తారు .
• ఇతను మొఘల్ ఆస్థానం లో ఉన్నత పదవులు నిర్వహించాడు .
• ఢిల్లీ హత్యలు మరియు కుట్రలకు నెలవు అవ్వటం తో దక్కన్ లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు .
• ఈ రాజ్యం 1948 వరకు సాగింది .
బెంగాల్ :-
• 1700 లో ముర్షిద్ కులీ ఖాన్ బెంగాల్ గవర్నర్ గా నియమించబడ్డాడు .ఇతను 1707 లో బెంగాల్ రాజధానిని ఢాకా నుంచి ముర్షీరాబాద్ కి మార్చి స్వతంత్రం గా పరిపాలించాడు .
• 1740 లో బెంగాల్ డిప్యూటీ గవర్నర్ అలీ వర్ధీఖాన్ తిరుగుబాటు చేసి బెంగాల్ ను ఆక్రమించుకున్నాడు .
• సిరాజుద్దౌలా కాలం లో కలకత్తా చీకటి గది ఉదంతం ,పాసీ యుద్ధం జరిగాయి .
• క్రమంగా బెంగాల్ ఆంగ్లేయుల వశం అయ్యింది .
రాజపుత్రులు :-
• మొదటి బహదూర్ షా అజిత్ సింగ్ ను మార్వార్ పాలకుడుగా 1708 లో నియమించాడు .
• తర్వాత అతను అజ్మీర్,గుజరాత్ లకు గవర్నర్ గా నియమించబడ్డాడు.
•సవాయ్ జై సింగ్ జైపూర్ నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు .