మొఘల్ సామ్రాజ్య పతనానంతర రాజ్యాలు

చివరి మొగలు చక్రవర్తులు :-
మొదటి బహదూర్ షా 1707-12
జహందర్ షా 1712-13
ఫరూక్ సియార్ 1713-19
రఫీ ఉద్ -దర్జా 1719
మహ్మద్ షా రంగీలా 1719-48
అహ్మద్ షా 1748-54
రెండవ అలంగీర్ 1754- 59
రెండవ షా ఆలం 1759 - 1806
రెండవ అక్బర్ 1806-37
రెండవ బహదూర్ షా 1837- 1862
మొఘలుల పతనం - చివరి మొఘలులు :-
మొఘలుల పతనం ఔరంగ జేబు కాలంలో ప్రారంభం అయింది .
ఇతను అనుసరించిన మత విధానం వలన ఇలా జరిగినది
ఇతని మరణానంతరం మువ్వాజం చక్రవర్తి అయ్యాడు .
బహుదూర్ షా :-
మువ్వాజం మొదటి బహదూర్ షా పేరు తో సిం హాసనాన్ని అధిష్టించాడు .
జిజియా పన్నును తొలగించాడు
ఔరంగ జేబు విధానాలకు వ్యతిరేకంగా అనేక జాతులతో సఖతకు ప్రయత్నించాడు .
జహందర్ షా 1712 లో రాజయ్యాడు .
ఇతని ప్రధానిగా జుల్ఫికర్ అలీ నియమించబడ్దాడు .
సోదరులు ఇతనిని హత్య చేశారు .
ఫరూక్ సియార్ :-
ఇతని కాలం లో చివరి సిక్కు మతగురువు ఉరి తీయబడ్డాడు .
ఫరూక్ సియార్ మొఘల్ చిత్రాలను ఎర్రకోటలో భద్రపరిచాడు .
మహ్మద్ షా :-
ఇతను రంగేళీ రాజా గా పేరు పొందాడు .
ఇతని కాలం లో పర్షియా పాలకుడు నాదిర్ షా 1739 లో ఢిల్లీ పై దండెత్తి నెమలి సిం హాసనం ,కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్ళాడు.
అహ్మద్ షా:-
ఇతని కాలం లో ఆఫ్ఘన్ పాలకుడు అహమద్ షా అబ్దాలీ దండయాత్రలు ప్రారంభం అయ్యాయి .
రెండవ అలంఘీర్ :-
ఇతని కాలం లో 3 వ పానిపట్టు యుద్ధం జరిగినది .
తర్వాత రెండవ షా ఆలం , రెండవ అక్బర్ , రెండవ బహదూర్ షా జాఫర్ పాలించారు .