మరాఠాలు

శివాజి :-
• శివాజి తండ్రి పేరు షాజీ బోన్ స్లే .తల్లి పేరు జిజియాబాయ్ .
• శివాజీ 1627 లో శివనేరు వద్ద జన్మించాడు .
• శివాజీ కి యుద్ధ విద్య నేర్పిన గురువు మరియు సం రక్షకుడు -దాదాజీ కొండా దేవ్
• శివాజీ మొదట 1646 లో మొదట తోరణ దుర్గాన్ని తర్వాత చకణ,పురంధర్ లను ఆక్రమించాడు .
• తర్వాత బీజాపూర్ సుల్తాన్ అధీనం లో ఉన్న 32 కోటలను ఆక్రమించాడు .
• 1659 లో శివాజీని చంపడానికి బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను పంపాడు .కానీ ప్రతాప్ ఘడ్ లో శివాజీ చే హత్య చేయబడ్డాడు .
• శివాజీ పోర్చు గీసు స్థావరం దామన్ ను దోపిడీ చేశాడు .
• 1666 లో ఔరంగ జేబుతో కలవడానికి ఢిల్లీ కి వెళ్ళిన శివాజీని ఔరంగ జేబు జైల్లో బంధించాడు .
• జైలు నుంచి తప్పించుకోని మహారాష్ట్ర చేరుకోని ఛత్రపతి అనే బిరుదుతో సన్మానం చేయిచుకున్నాడు .
• 1680 లో మరణించాడు .
శివాజీ పాలన :-
• ఇతని రాజ్యానికి స్వరాజ్యం అని పేరు దీనిని నాలుగు భాగాలు చేశాడు
• పరిపాలన కొరకు అష్ట సూత్రాలు ప్రకటించాడు .
• శివాజీ ఆస్థానం లో అష్ట ప్రధానులు అనే మంత్రి వర్గం ఉండేది .
• శివాజీ గిరి దుర్గాల సంఖ్య 240
• శివాజీ కాలంలో వ్యవసాయంపై పన్ను 40% (2/5) .
• శంభాజీ (1680-89):-
• శివాజీ మరణాంతరం పరిపాలించాడు .
• ఔరంగ జేబు కుమారుడికి ఆశ్రయము ఇచ్చి అతని ఆగ్రహానికి లోను అయ్యాడు .
• ఔరంగ జేబు సైన్యా లు 1689 లో ఇతనిని వధించాయి .
• తర్వాత
• రాజారాం (1689-1700)
• రెండవ శివాజీ (1700-1707)
• సాహు (1707- 1748) లు పాలించారు .
పీష్వా యుగం :-
• పీష్వాల సంఖ్య -7
• 1) బాలాజీ విశ్వనాథ్ - (1713-1720 )
• 2)మొదటి బాజీరావ్ (1720-1740)
• 3) బాలాజీ బాజీరావ్ (1740-1761)
• 4) మాధవరావు (1761-1795)
• 5) నారాయణ రావు (1772- 73 )
• 6 ) సవాయ్ మాధవరావు(1773 - 1795)
• 7 ) రెండవ బాజీరావ్(1795-1818)