భక్తి , సూఫీ ఉద్యమాలు

• మధ్య యుగం లో యఙ్ఞ యాగాలు , సామాజిక వివక్షతను వ్యతిరేకిస్తూ హిందూ మతంలో వచ్చిన ఊద్యమమే భక్తి ఉద్యమం .
• ఏకేస్వరోపాసనకు భక్తి ఉద్యమకారులు ప్రాధాన్యత ఇచ్చారు .
ఆది శంకరాచార్యులు(క్రీ.శ.788-820) :-
• ఈయన కేరళ పూర్ణ నదీ తీరాన కాలడి గ్రామంలో జన్మించాడు .
• ఈయన ప్రవేశ పెట్టిన మాయావాద సిద్ధాంతానికి బౌద్దమతం లోని శూన్య వాద సిద్ధాంతానికి మద్ష్య సారుప్యత ఉంది.అందుకే ఇతనిని ప్రచ్చన్న బుద్ధ అంటారు .
• శంకరాచార్యుని అనుచరులు స్మార్తులు . వీరికి స్మృతులు ప్రమాణ గ్రంధాలు .
• ఇతను అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు .
• ఈయన తన సిద్ధాంతములను ప్రచారం చేయటానికి
ఉత్తరం - బదరీనాధ్
దక్షిణం - శృంగేరీ (శృంగేరీ ) , కంచి
తూర్పు - పూరి(ఒరిస్సా )
పశ్చిమం - ద్వారక (గుజరాత్ )
• ఈయన రచనలు
సౌందర్య లహరి ,భజగోవిందం ,బ్రహ్మ సూత్రాలు , భగవద్గీత ,ఉపనిషత్ లకు భాష్యాలు
రామానుజాచార్యులు (క్రీ.శ 1017-1137) :-
• ఈయనని వైష్ణవులు ఆది శేషుని అవతారంగా విశ్వ సించారు .
• తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ వద్ద జన్మించాడు .
• ఈయనను బహిష్కరించిన కంచి పాలకుడు-కులోత్తుంగ చోళ
• ఈయన విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించాడు .
• ఈయనకి ఆశ్రయం కల్పించిన హోయసాల రాజు విష్ణు వర్ధనుడు
• ఈయన రచనలు - శ్రీ భాష్యం , వేదాంత సంగ్రహం , వేదాంత దీపం , వేదాంత సారం
నింబార్కుడు :-
• ఈయన తెలుగు బ్రాహ్మణుడు .ఈయన గోదావరీ తీరంలో సుదర్శన ఆశ్రమంలో జన్మించాడు .
• ఈయన వేదాంతాన్ని ద్వైతా ద్వైతం అంటారు . ఈయన కృష్ణ భక్తిని ప్రతిపాదించారు .
• రాధా మాధవులను పూజించే పద్దతి మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టెను .
మధ్వాచార్యులు :-
• ఈయన కర్ణాటకా లోని ఊడిపి పట్టణ సమీపంలో వేలి గ్రామంలో జన్మించాడు .
• ఈయన అసలు పేరు వాసు దేవుడు .
• ఈయన తత్వం ద్వైత తత్వం .
• ఈయన కన్నడ బాషలో బ్రహ్మ సూత్రాలపై మొదటి సారిగా వ్యాఖ్యానం చేశాడు.
వల్లభాచార్యుడు (1497-1539):-
• ఈయన బెనారస్ లో స్థిర పడ్డ తెలుగు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .
• ఇతను శుద్దాద్వైతం ప్రభోదించాడు.
• ఇతని ఇల వేల్పు - శ్రీ కృష్ణుడు . ఈయన మార్గం పుష్టి మార్గం .
• ఈయన కుమారుడు విఠల నాధుడు .
• వల్లభా చార్యుని రచనలు .- సుభోధిని ,సిద్ధాంత రహస్యం
• ఈయనని అచినిత భద్ర గా పిలుస్తారు .
జయ దేవుడు :-
• తూర్పు భారత దేశంలో మొదటి సంస్కర్త , భక్తి ఉద్యమ వాది .
• ఈయన రాధాకృష్ణుల ఇతి వృత్తంగా సంస్కృతంలో గీతా గోవిందం రచించాడు .
చైతన్యుడుక్రీ.శ. 1485-1533 ) :-
• ఈయన బెంగాల్ లోని నవ ద్వీపం లో జన్మించి పూరీలో మరణించాడు
• ఇతని అసలు పేరు విశ్వంభర , హరే రామ హరే కృష్ణ ఇతని నినాదం .
• ఇతను మధుర భక్తి మార్గమును భోదించాడు
• భక్తి ఉద్యమంలో మొదటి సారి కీర్తనలను ప్రవేశ పెట్టాడు
• ఇతను ఉపయోగించిన భాష బెంగాలి .
రామానందుడు :-
• ఈయన ఉత్తర భారత దేశ సంస్కర్తలలో గొప్ప వాడు .
• ఈయన ప్రయాగలో జన్మించాడు . కుల దైవం శ్రీ రాముడు .
• ఈయన హిందీ భాషలో తన బోధనలను ప్రచారం చేసిన మొదటి వ్యక్తి
• ఈయన శిష్యులు
కబీర్
రైదాస్ /రవిదాస్
అయిన ధన్న
సేనదాస
కబీర్ :-
• మధ్య యుగపు కార్ల్ మార్క్స్
• ఈయన సికందర్ లోఢీ కి సమకాలీకుడు
• ఈయన హిందూ ముస్లిం ల ఐక్యత ప్రభోదించాడు .
• అల్లా,రాముల శిశువుగా తనని ప్రకటించు కున్నాడు .
• ఈయన రచనలను దోహా అంటారు .
• కబీర్ ను ఉరి తీయించినది - సికిందర్ లోడీ
• ఇతని ప్రధాన సంగీత వాయిద్యం - రబాబ్
మీరాబాయి :-
• ఈమె మేవార్ రాజు రాజా రతన్ సింగ్ కుమార్తె .
• రాణా సంగ్రామ సిం హుని కోడలు .
• ఈమె కృష్ణుని భక్తురాలు .
• ఈమె భక్తి ఉద్యమం లో మొదటి సారిగా భజనలు చేసే సంప్రదాయాన్ని ప్రవేశ పెట్టింది .
గురునానక్ :-
• సిక్కు మత స్థాపకుడు
• ఇతను అనేక సార్లు మక్కాను దర్శించాడు .
• హిందూ ముస్లిం ఐక్యతను బోధించాడు .
• సిక్కు అనగా పంజాబీ భాషలో శిష్యుడు-
• ఇతను కబీర్ వల్ల ప్రభావితుడు అయ్యాడు .
భక్తి -కవులు :-
తులసీదాస్ :-
• ఈయన హిందీలో రామ చరిత మానస్ రచించాడు .
• ఇతన్ని అభినవ వాల్మీకి అంటారు .
సూర్ దాస్ :-
• ఈయన కృష్ణ భక్తుడు
• ఈయన వల్లభాచార్యుని శిష్యులలో అష్టాచావగా పేరొందాడు .
• రచనలు
సూర సాగర్ ,సూరా సారావళి
సుందర్ దాస్ :-
• సుందర విలాసం రచించాడు .
సూఫీ మత వాదం :-
• ప్రారంభ దశలో ఇస్లాం లో ఆవిర్భవించిన మార్మిక వాదులే సూఫీలు
• వీరికి కర్మ, పునర్జన్మ పట్ల నమ్మకం కలదు .
• వీరు గురువును పీర్ గా భావిస్తారు .
• భారతదేశం లో ప్రధానమైన సూఫీ వర్గాలు
ఛిస్తీ వర్గం
సుహ్రవర్ది వర్గం
ఖాద్రి వర్గం
నక్ష బందీ వర్గం
• ఇతర ముస్లిం శాఖలు - ఉద్యమాలు
మహదవి ఉద్యమం
పత్తారీ వర్గం