సింధూ నాగరికత

సింధూ నాగరికత (2500 బి.సి నుండి 1750 బి.సి):-
•సింధు నాగరికత 1921 లో బయల్పడింది.
•ఈ నాగరికత తవ్వకాలు సర్.జాన్ మార్షల్ నాయకత్వంలో సాగాయి.
•ఈ నాగరికత క్రీస్తు పూర్వం 2500-1750(వీలర్ ప్రకారం) కాలానికి చెందింది.
•భారతదేశపు మొదటి సర్వే జనరల్ - సర్.జాన్ మార్షల్.
•ఇతను మెహంజొదారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్ అనే పుస్తకం వ్రాసెను.
•ఇతనిని భారతీయ ఫాక్ చరిత్ర పితామహుడు గా వర్ణిస్తారు .
సరిహద్దులు : ఉత్తరాన జమ్ము కాశ్మీర్ లోని మాండా,
దక్షిణాన మహారాష్ట్ర లోని దైమాబాద్,
పశ్చిమాన బెలూచిస్థాన్,
తూర్పున ఆలంగీర్ పూర్ (ఉత్తర ప్రదేశ్)
•మన దేశం లో సింధు నాగరికత ప్రదేశాలు అధికముగా గుజరాత్ లో బయట పడ్డాయి
ఈ నాగరికతకు గల ఇతర పేర్లు :-
•హరప్పా నాగరికత : మొదటి సారి సింధు త్రవ్వకాల్లో బయటపడ్డ ప్రాంతం .
•కాంస్య యుగ నాగరికత : కాంస్యం అనగా రాగి తగరంల మిశ్రమం
•చారిత్రక సంధి యుగ నాగరికత :సింధు ప్రజల లిపి బొమ్మల లిపి .దీనిని ఎవ్వరు వివరించలేక పోయారు .
•భారత దేశ మూల నాగరికత: భారత దేశంలో మొదటి నాగరికత .
•ఈ యుగానికి చారిత్రక సంధి యుగం అని పేరు పెట్టింది . H.D శంకాలియా.
•మొత్తం 13,00,000 చ.కి.మీ.లో ఈ నాగరికత విస్తరించి ఉంది.
•ప్రపంచoలో విస్తీర్ణం దృష్ట్యా పెద్ద కాంస్య యుగ నాగరికత ఇదే.
సింధూ నాగరికత నిర్మాతలు :-
1.మంగోలాయిడ్లు
2.ప్రోటోఆస్ట్రలాయిడ్లు
3.ఆల్బినాయిడ్లు
4.మెడిటేరియన్ జాతి
వీరు ద్రవిడ భాష అబివృద్ధి చేశారు. కాబట్టి ద్రవిడులు / ద్రవిడ జాతి ప్రజలు అంటారు .
సింధూ నాగరికతలో ముఖ్యమైన నగరాలు
1) ఇండియా - 925
2) పాకిస్థాన్ 475
మొత్తం 1400
నగరం పేరు త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్త నది పేరు ప్రస్థుతం ఉన్న రాష్ట్రం ప్రత్యేకతలు
హరప్పా 1921 దయారాం సహానీ రావి పంజాబ్ ధాన్యాగారాలు, కాంస్యంతోచేసిన ఎడ్ల బొమ్మ, చిక్కాలు , శవ పేటిక , కంచు అద్దాలు , రాతి నటరాజు విగ్రహం
మొహంజొదారో R.D.బెనర్జీ. సింధూ నదికి కుడివైపు సింధీ రాష్ట్రం పాకిస్థాన్ మొహంజొదారో అనగా హిందీలో మృతుల దిబ్బ అని అర్ధం . అన్నిటికంటే పెద్ద నగరం మహాస్నాన వాటిక మహాధాన్యాగారం కాంస్యపు నాట్యకత్తె విగ్రహం
ఛానహూదారో 1935 మంజూదార్ సింధూ సింధూ రాష్ట్రం పూసల తయారీ పరిశ్రమ , పిల్లికి సంబంధించిన ఆనవాళ్ళు , లిప్ స్టిక్ , సిరా బుడ్డి
లోథాల్ 1955 S.R. రావ్ భోగావో నది గుజరాత్ ప్రధాన రేవు పట్టణం , హోమగుండం దొరికింది
కాళీబంగన్ లాల్,థాపర్ గగ్గర్ రాజస్థాన్ ఏడు హోమ గుండాలు వాటి ప్రక్కన జంతువుల ఎముకలు
ధోలవీర 1991 జోషి బిస్త్ లూనీ గుజరాత్ ప్రపంచంలో మొదటి రిజర్వాయర్ ఇచట లభించింది . ఏకైక స్టేడియం
బన్వాలీ 1973-74 బిస్త్ సరస్వతి హర్యానా గ్రిడ్ విధానంలో కాకుండా వంకర టింకర రోడ్ల నిర్మాణం
సుర్కోటడ్ జోష్ తపతి __ గుర్రం యొక్క అవశేషాలు లభించిన నగరం. రాతి గోడలు కల ఏకైక నగరం
• సింధు ప్రజలు పట్టణాలలో నివశించే వారు
• నగర పశ్చిమ భాగంలో కోటల రూపం లో ప్రధాన నిర్మాణాలు కలవు.
• రక్షణ గోడ కోట లేని ఏకైక నగరం -చాన్ హుదారో
• మూడు భాగాలుగా విభజించబడిన నగరం -ధోలవీర
• రోడ్ల నిర్మాణం చదరంగం పోలి ఉంటుంది(గ్రిడ్ వ్యవస్థ) .
• గ్రిడ్ వ్యవస్థ లో లేని నగరం - బన్వాలి
• ప్రస్తుతం గ్రిడ్ వ్యవస్తలో నిర్మిచబడిన ఏకైక నగరం - చండీఘర్
• గ్రిడ్ పద్దతిలో నిర్మించబడిన కట్టడం - తాజ్ మహల్
• కాల్చిన ఇటుకులను నిర్మాణాలకు ఉపయోగించారు . వీరు ఇటుకల తయారీలో గొప్ప నైపుణ్యం ప్రదర్శించారు .
• జాన్ మార్షల్ అబిప్రాయం ప్రకారం మాతృస్వామ్య వ్యవస్థ ఉంది.
• సింధు నాగరికతకు సంభందించిన పరిపాలన స్వరూపం గూర్చిన సమాచారం లభించుట లేదు.
• వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం.
• వీరు ప్రధానoగా వ్యవసాయం రభీ పంట కాలంలో చేసేవారు .
• వరద నీటికి అడ్డు కట్టలు నిర్మించి వ్యవసాయం చేసేవారు .వీటిని గబర్ బంద్ లు అనే వారు .
• వీరి ప్రదాన పంటలు -గోదుమ,భార్లీ ,వరి,నువ్వులు, పత్తి.
• ప్రపంచంలో తొలి సారి ప్రత్తి , వరిని సాగు చేసిన వారు - సింధు
• లోథాల్ లో వరి గింజలు , రంగా పూర్ లో వరి పొట్టు (గుజరాత్ ) లభించాయి.
• బనవాలి (హర్యానా ) టెర్ర కోటలో నాగలి బొమ్మ లభించింది.
• కాళీ భంగన్ (రాజస్థాన్) నాగలి చారలు కలిగిన భూములు కంపించాయి.
• వీరికి గుర్రం తెలియదని బావిస్తారు కానీ గుర్రం ఆధారాలు బయటపడిన ప్రాంతం -
1.లోథాల్ -టెర్రకోట గుర్రం బొమ్మ.
2.సుర్కోటడ(గుజరథ్)-గుర్రం అస్థి పంజరం .
• నౌకా పరిశ్రమ కేంద్రం - లోథల్
• ప్రపంచంలో వెండిని మొదటి సారిగా వాడిని వారు-సింధు ప్రజలు.
• వీరు మెసపటోనియా ,పర్షియా, ఆఫ్గనిస్థాన్ లతో విదేశీ వ్యాపారం చేసేవారు.
• హరప్పా , మెసపటోనియాల మధ్య వ్యాపార కేంద్రంగా 'దిల్ మున్ '(బహ్రెయిన్) ద్వీపకల్పం వ్యవహరించేది.
• సుమేరియ గ్రంధాలు సింధు ప్రాంతాన్ని మొలహగా వర్ణించాయి.
• వీరు కుమ్మరి చక్రాన్ని విస్తృతంగా ఉపయోగించారు .
• వీరు తూకాలలో 16 యొక్క గుణిజాలు వాడారు .
• వీరు నిర్మాణాలలో ఇంగ్లీష్ బాండ్ అనే పద్దతి ఉపయోగిస్తారు.
• సింధు ప్రజలు ముద్రలు మెత్తటి రాతి స్వీయటైట్ పై ముద్రించే వారు
• వీరి లిపికి బొమ్మల లిపి అని పేరు
• ఈ లిపిని ఎవరి వివరిoచలేక పోయారు . ఇది ద్రవిడ లిపిని పోలి ఉంది.
• వీరు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి వ్రాసేవారు. ఈ విధానానికి సర్ప లేఖనము అని పేరు .
• వస్తు మార్పిడి పద్దతి ద్వార వ్యాపారం .
మత వ్యవస్థ :-
•అమ్మ తల్లి అనే స్రీ దేవతను పూజించే వారు .
•పశుపతి మహదేవ అనే పురుష దైవాన్ని పూజించే వారు.
•పశుపతి మహదేవ్ ముద్రల పై గల జంతువులు- ఏనుగు , పులి , ఖడ్గ మృగం , దున్న
•సింధు ప్రజలకి పవిత్రమైనవి , పూజనీయమైనవి.
జంతువు - మూపురం గల ఎద్దు
పక్షి -పావురం
చెట్టు -రావి చెట్టు
గుర్తు - స్వస్థిక్
నదీ జంతువు -మొసలి
•సింధు ప్రజలకి తెలియనవి
జంతువు -గుర్రం
అడవి జంతువు - సిoహం
లోహం -ఇనుము
పంట -చెరకు
ఆయుధాలు - డాలు , శిరస్త్రాణం
•సింధు నాగరికత అంతానికి కారణాలు :
1.మార్టిమర్ వీలర్ (1945) ప్రకారం , ఆర్యుల దండ యాత్ర వలన అంతం అయింది.
2. జి.ఎఫ్ డేల్స్ ప్రకారం భూకంపాల వల్ల అంత మైంది .
3.రాబర్ట్ ఎల్ రైక్స్ ప్రకారం భూకంపం వల్ల.
4.సింధు సమాజంలోని అంతర్గత క్షీణిత వలన పతనం చెందింది.- గార్డెన్ చైల్డ్
5. 7 సార్లు వరదల వల్ల అంతమై , పునర్నిర్మించబడింది -మొహంజొదారో
•సమాధులలో శవాలతో పాటు కానుకులు వస్తువులు ఉంచేవారు .
•లోథాల్ లో సతీసహగమనం తెలిపే సమాది బయట పడింది .


కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం

అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)

చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.