తుగ్లక్ వంశం :1320-1414

గియాజుద్దీన్ తుగ్లక్ (1320-1325 ):-
ఇతని అసలు పేరు గాజి మాలిక్ .
1320 లో ఖుస్రూఖాన్ ను చంపి రాజ్యానికి వచ్చాడు .
1323 లో ఇతడు రెండవ ప్రతాప రుద్రుడ్ని ఓడించి బంధీగా డిల్లీకి తీసుకెళుతుండగా నర్మదా నదీలో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు .
ఈ దండ యాత్రకు నాయకుడు జునాఖాన్ (మహ్మద్ బీన్ తుగ్లక్ )
ఓరుగల్లును సుల్తాన్ పూర్ అనే పేరుతో ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో విలీనం చేయబడినది .
ఇతని అస్థానకవి అమీర్ ఖుస్రూ తుగ్లక్ నామా రచించాడు .
అమీర్ ఖుస్రూ తబలా,సితార్ లను కనుగొన్నాడు .
గియాజుద్దిన్ డిల్లీ సమీపం లో తుగ్లకాబాద్ నిర్మించాడు .
మహ్మద్ బీన్ తుగ్లక్ (క్రీ.శ1325-51 ):-
ఈయన అసలు పేరు జూనాఖాన్ .
కొందరు ఆధునిక చరిత్ర కారులు ఇతడు ప్రవేశ పెట్టిన ప్రయత్నాలలో సమయ స్పూర్తి లోపించిందని భావించి ఇతనిని పిచ్చి సుల్తాను గా వి.ఎన్ స్మిత్ , లేన్ పూల్ భావించారు .
కరువు నియమావళిని ఏర్పరచిన ఢిల్లీ సుల్తాన్
రాజధాని రాజ్యం మధ్యన ఉండాలనే ఉద్దేశ్యంతో 1327 లో రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడు.
ఘోరీ అనే ఇంటిపన్ను మరియు చరి అనే మరొక పన్ను విధించబడ్డాయి .
నాణెములు సంస్కరణలు :-
తుగ్లక్ ను ప్రిన్స్ ఆఫ్ మోనెయర్స్ అని థామస్ పేర్కొన్నాడు .
ఇతను ప్రవేశ పెట్టిన ఇత్తడి రాగి నాణెములకు బిరంజ్ అని పేరు .
1336 లో ముసునూరి కాయప నాయకుడు ఓరుగల్లు ను ఆక్రమించుకున్నాడు .
హోళీ పండుగలో పాల్గొన్న మొదటి సుల్తాన్ .
ఈయన సతీ దురాచారాన్ని నిర్మూలించడానికి పయత్నించాడు.
ఫిరోజ్ షా తుగ్లక్ (1351 - 1388) :-
రెండు సార్లు ఖలీఫా నుండి అనుమతి పత్రం పొందిన ఏకైక సుల్తాను .
జాగిర్దారి విధానం తిరిగి ప్రవేశ పెట్టాడు .
ఇతన్ని రైతు బాంధవుడు అని పిలుస్తారు .
వంశపారంపర్యమైన సైనిక విధానం ప్రవేశపెట్టాడు .
తుగ్లక్ వంశం లో గొప్పవాడు
కాలువలు,చెరువులు త్రవ్వించాడు .
యమునా నదికి కాలువలు త్రవ్వించాడు ఇతనిని రైతు బాంధవుడు అంటారు .
భారత దేశం లో స్వీయ చరిత్ర రాసుకున్న మొదటి రాజు ఫిరోజ్ షా తుగ్లక్
బ్రాహ్మణులపై జిజియా పన్నులు విధించాడు .
బిందు సేద్యాన్ని ప్రవేశపెట్టాడు .
ఇతని ప్రధాని మాలిక్ మక్బూల్ .
భారత దేశం ను ఇస్లాం రాజ్యం గా మార్చే ప్రయత్నం చేశాడు .
పూరి జగన్నాధ ఆలయాన్ని కూల్చేశాడు .
ఇతను విధించిన పన్నులు
జకాత్ - ధనికులైన ముస్లింలపై విధించే పన్ను .
ఖరజ్ - భూమి శిస్తు 10%.
జిజియా - ముస్లిం మేతరులుపై విధించే పన్ను .
ఖుంస్ -యుద్దంలో జయించిన వాటాలో 20 %
ఘనిమా -యుద్దంలో జయించ బడిన సంపదలో సైనికుల వాటా 80%.
నసీరుద్దీన్ మహ్మద్ తుగ్లక్ :-
తుగ్లక్ వంశం లో చివరి వాడు .ఇతని పరి పాలనా కాలంలో 1398 లో సమర్ ఖండ్ పాలకుడు తైమూరు డిల్లీ పై దండెత్తి లక్షల మంది హిందువులను వధించాడు .
తైమూర్ బర్లాస్ తెగకు చెందిన వాడు .ఇతనికి గల ఇతర పేర్లు తామర్లేన్ తైమూర్ లంగ్ .
తైమూర్ భారత దేశం లో తన ప్రతినిధి గా ఖిజిర్ ఖాన్ ను నియమించాడు .
తైమూర్ దండ యాత్ర డిల్లీ సుల్తాన్ ల పునాదిని కదిలించింది .