1.జలాలుద్దీన్ ఖిల్జీ (1290-1296):-
•70 సం || ల వయసు గల జలాలుద్దీన్ కైకుబాద్ ను సంహరించి కిలోఘరీ వద్ద పట్టాభిషేకం చేసుకున్నాడు .
•ఇతను దయాగుణం కల్గిన రాజు గ పేరొందాడు.
•గంగా యమునా అంతర్వేది లో సమస్యాత్మకంగా మారిన ధగ్గులు అనే దొంగల ముఠాను బంధించి , వారిని క్షమించి బెంగాల్ పంపించాడు .
•ధగ్గులు అనగా మోసగాళ్ళూ .
•తనకు వ్యతిరేకంగా కుట్రపన్నాడనే ఆరోపణపై సిద్దిమౌలా అనే మత గురువును చంపించాడు .
•అబ్దుల్లా నాయకత్వంలో 1,50,000 మంది మంగోలులు ఢిల్లీ పై దాడి చేయగా వారిని ఓడించి తరిమేశాడు .
•వారిలో కొంతమంది ఇస్లాం మతం స్వీకరించుటవలన ఢిల్లీ లో స్థిరపడుటకు అనుమతి ఇచ్చాడు .
•వీరినే నయాముస్లిం లు అంటారు .
•1294 లో అలీ గుర్షప్ దేవగిరి పై దాడి చేసి దోచు కున్నాడు . ఇలా దోచుకున్న సంపదలో భాగం కోసం కారా కు వచ్చిన జలాలుద్దీన్ ఖిల్జీని చంపి , డిల్లీకి వెళ్ళి అల్లా ఉద్దీన్ ఖిల్జీ పేరుతో రాజు అయ్యడు .
2. అల్లా ఉద్దీన్ ఖిల్జీ :-
•ఇతను సుల్తానుల అధికారాన్ని యావత్ భారత దేశానికి విస్తరింప చేశాడు .
•రాజు దైవాంశ సంభూతుడు అనే నమ్మకం కల వాడు .
•మతాన్ని రాజకీయాల నుండి వేరు చేశాడు .
•ఉలేమాల ప్రభావం నుండి ప్రభుత్వానికి విముక్తి కల్గించాడు .
•గుజరాత్ ను పాలిస్తున్న వాఘేల వంశానికి చెందిన కర్ణ దేవుడుని ఓడించి అతని రాణి కమలా దేవిని వివాహమాడాడు .
•మేవాడ్ రాజ్యమును రతన్ సింగ్ పరిపాలిస్తున్నాడు.
•రథన్ సింగ్ భార్య పద్మావతి అంద చందాలను వర్ణిస్తూ వ్రాయబడిన గ్రంధం పద్మావతి .
•రాణి పద్మావతి ని పొందేందుకు చిత్తోడ్ పై దాడిచేసి రథన్ సింగ్ ను వధించగా ,పద్మావతి జౌహర్ చేసుకోని మరణించింది .
•మేవాడ్ రాజ్య రాజధాని చిత్తోడ్ ను ఆక్రమించిన అల్లాఉద్దిన్ ఖిల్జీ దానిపేరు ఖిజిరాబాద్ గా మార్చాడు .
•దక్షిణ భారత దేశ దండయాత్రల కోసం మాలిక్ ఖాఫర్ ను పంపించాడు .
•ఇతనిని గుజరాత్ లో 1000 దీనార్లకు కొనుగోలు చేయుట వలన హజార్ దీనారి అందురు .
మాలిక్ ఖాఫర్ జయించిన రాజ్యాలు:-
1308 యాదవులు దేవగిరి మహారాష్ట్ర రామచంద్ర దేవుడు
1309 కాకతీయులు ఓరుగల్లు ఆంధ్రప్రదేశ్ 2 వ ప్రతాపరుద్రుడు
1310 హోయసాలులు ద్వార సముద్రం కర్ణాటక 3 వ వీర భల్లాలుడు
1311 పాండ్యులు మధురై తమిళనాడు వీరపాండ్య
అల్లాఉద్దిన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు :-
•సుల్తాన్ ఆధీనం లో ఉండే సిద్ధ సైన్యాన్ని ప్రవేశ పెట్టాడు .
•సైనికులకు హాజరు పట్టీలు ప్రవేశ పెట్టాడు .
•గుర్రాల మార్పిడి జరగకుండా వాటిపై రాజముద్రలు వేయించాడు .
•అల్లాఉద్దిన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలు
•భారత చరిత్రలో అత్యధిక భూమి శిస్తుని వసూలు చేశాడు .
•తూనికలు ,కొలతలలో మోసాలు రాకుండా చర్యలు చేపట్టాడు .
ముబారక్ ఖిల్జీ
•అల్లా ఉద్దీన్ ఖిల్జీ కుమారుడు ముబారక్ ఖిల్జీ .
•తనను తాను ఖలీఫా గా ప్రకటించుకున్న ఏకైక సుల్తాను .
•ఇతని సేనాపతి ఖుస్రుఖాన్ పాలన వ్యవహారాలు చూసుకునేవాడు .
ఖుస్రూఖాన్ (100 రోజులు ):-
•ముభారక్ ఖిల్జీని చంపి రాజయ్యాడు .
•ఇతని బిరుదు నసీరుద్దీన్ .
•గుజరాత్ ప్రాంతానికి చెందిన దళితుడు .
•బిరుదు కులానికి చెందిన వాడు .
•డిల్లీ సుల్తాను లలో ఏకైక హిందువు . ఇతని సేనాపతి ఘజీ మాలిక్ ఇతనని చంపి తుగ్లక్ వంశం పాలనను పాలించాడు .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.