ఢిల్లీ సుల్తానులు (1206 - 1526 )

ఢిల్లీ చరిత్ర :-
• ప్రాచీన కాలంలో ఉన్న ఇంద్రప్రస్థ స్థానంలో తోమార్ వంశానికి చెందిన ఆనంగ పాలుడు "దిల్లికపురం" అనే పట్టణాన్ని నిర్మించాడు .
• ఈ పట్టణం చుట్టూ ఢిల్లీ సుల్తానులు , మొగలులు 7 పట్టణాలు నిర్మించారు . వీటన్నీటిని కలిపి ప్రస్తుతం ఢిల్లీ అని పిలుస్తారు .
ప్రాంతం - నిర్మాత :-
• మొహ్రోలి - కుతుబుద్దిన్ ఐబక్
• సిరి - అల్లా ఉద్దీన్ ఖిల్జి
• తుగ్లకా బాద్ -షియాజుద్దిన్ తుగ్లక్
• జహాపన - మహ్మద్ బీన్ తుగ్లక్
• ఫిరోజాబాద్ - ఫిరోజ్ షా తుగ్లక్
• దీన్ పనావా - హుమాయూన్
• షాజహానాబాద్ - షాజహాన్
పాత ఢిల్లీ ప్రాంతంలో హజ్రత్ నిజాముద్దీన్ అనే చిస్తీ సన్యాసీ దర్గా ఉంది . అందువల్ల పాత ఢిల్లీ ని హజ్రత్ నిజాముద్దిన్ ఢిల్లీ అని పిలుస్తారు .
• ఢిల్లీ సుల్తానులలో 5 వంశాలున్నాయి .
• బానిస వంశం
• ఖిల్జీ వంశం
• తుగ్లక్ వంశం
• సయ్యద్ వంశం
• లోఢీ వంశం
• ఢిల్లీ సుల్తానత్ లో దీర్ఘ కాలం పాలించిన వంశం - తుగ్లక్ లు .
బానిస వంశం :-
• బానిస వంశానికి మరియొక పేరు మాంలూక్.
• బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ .
• ఇతను మహ్మద్ ఘోరీ కి బానిస గా ఉండి తర్వాత సేనానిగా ఎదిగాడు .
• ఈ వంశం లో మొత్తం 11 మంది రాజులలో ముగ్గురు మాత్రమే బానిసలు .
• వారు ఐబక్ ,ఇల్ టుట్ మిష్ ,బాల్బన్
• ఈ వంశం లో వీరే అత్యంత ప్రధానులు
కుతుబుద్దీన్ ఐబక్ (1206 - 1210):-
• ఇతను భారత దేశంలో స్వతంత్ర ఇస్లాం రాజ్య స్థాపకుడు .
• ఇతని రాజధాని లాహోర్ డిల్లీని రాజధానిగా చేసుకొనిన ఏకైక డిల్లీ సుల్తాన్ .
• ఇతని బిరుదు " లాక్ బక్ష " .
• మెహ్రౌలి అనే పట్టణాన్ని నిర్మించాడు .
• క్రీ.శ, 1210 లో పోలో ఆడుతూ మరణించాడు
ఇల్-టుడ్-మిష్ : -
• ఇతను కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు .
• ఐబక్ కుమారుడు ఆరాం షాను తొలగించి సుల్తాను అయ్యాడు .
• ఇతను ఇల్బరీ తెగకు చెందిన వాడు .
• రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీ కి మార్చాడు
• ఇతని బిరుదు సుల్తాన్ .ఖలీఫా చే గుర్తించబడిన మొదటి ఢిల్లీ సుల్తాన్
• ఇతను రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించాడు .
• మత సహనం లేని వాడు .
• ఉజ్జయని మహంకాళి ఆలయాన్ని నాశనం చేశాడు .
• అల్తమస్ కుతుబ్ మీనార్ ను పూర్తి చేశాడు .
రజియా సుల్తానా :-
• అల్తమస్ కుమార్తె - రజియా సుల్తానా .
• అల్తమస్ తన వారసురాలిగా రజియాను ప్రకటించాడు .
• ఈమె వారసత్వాన్ని చాలీసా ఉలెమాలు వ్యతిరేకించారు .
• డిల్లీ సిం హాసనం అధ్ష్టించిన మొదటి మహిళ .
నసీరుద్దీన్ మహ్మద్ :-
• ఇతని ఆస్థానంలో కవి - మినాస్ -ఉస్ -సిరాజ్
• ఈయన వ్రాసిన గ్రంధాలు - తబాఖత-ఎ-నాసిరి .
బాల్బన్ (1266-87):-
• ఇతను ఇల్బరీ తెగకు చెందిన తురుష్కుడు .
• బానిస వంశంలో అగ్రగణ్యుడు .అసలు పేరు బహ్రూద్దీన్ .
• అల్తమస్ కాలంలో చాలీసా నాయకుడు .
• నసీరుద్దీన్ మహ్మద్ మరణం తరువాత రాజుగా ప్రకటించుకున్నాడు .
• ఇతని బిరుదు జిల్-ఇల్ - ఇలాహి .
• మిమోలు అనే దొంగలను అణిచాడు.
• సుల్తాన్ పదవిని అత్యంత శక్తివంతమైనదిగా తీర్చిదిద్దాడు .
• బాల్బన్ చే ఆదరించ బడిన పండితుడు - అమీర్ ఖుస్రూ .
• దిర్హం అనే బంగారు నాణాలను ముద్రించాడు .
• కుమారుని మరణం అతన్ని కుంగతీసింది .ఆ దిగులుతో చని పోయాడు .
కైకు బాద్ :-
• బాల్బన్ మనమడు /బుగ్రాఖాన్ కుమారుడు . ఇతని సేనాపతి జలాలుద్దీన్ ఖిల్జీ ఇతనిని చంపి ఖిల్జీ వంశ పరిపాలనను ప్రారంభించెను .