భారత దేశం లో శిలాయుగం

ప్రాచీన శిలాయుగం:-
• మానవుడు ఆవిర్భవించిన కాలం సుమారు 5 లక్షల సంత్సరాలు క్రితం నుండి క్రీస్తు పూర్వం 10,000
సంవత్సరాలకు ముందు గల కాలం ఈ యుగానికి చెందింది .
• మానవ పరిణామంలో అత్యంత సుదీర్ఘ దశ .
• ఈ యుగంలో మానవుడు జంతువులతో సమానమైన జీవితం గడిపాడు
• ఈ యుగం లో మానవుడు నిగ్రోటో జాతికి చెందిన వాడు
ప్రధాన లక్షణాలు :
1.వేట , ఫలాల సేకరణలు ప్రధాన వృత్తులు
2.సంచార జీవనం
3.కొండ గుహలలో నివాసం
• భారత దేశంలో మానవుడు మొదటిగా మహా రాష్ట్ర లో బోరీ ప్రాంతంలో శివాలిక్ ప్రాంతాల వద్ద నివసించినట్లు తెలుస్తుంది.
• భారత దేశంలో మొదటి ప్రాచీన శిలాయుగ ఆనవాలు మొదటగా 1863 లో మద్రాస్ వద్ద పల్లవరంలో లభించాయి .
• ఇచ్చట రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ తవ్వకాలు నిర్వహించాడు . ఇతన్ని భారత దేశ ప్రాచీన శిలాయుగ పిత గా వర్ణిస్తారు .
• ఈ యుగంలో వస్తువుల తయారీకి క్వార్టజైట్ (స్పటిక శిల)ఉపయోగించాడు .
• ప్రధాన వస్తువులు:-
1.చేతి గొడ్డళ్ళు
2.గీకుడు రాళ్ళు
3.బ్లేడ్లు
4.పెచ్చులు
• ఈ పరికరాలను దాగలి పద్దతిలో తయారు చేశారు.
• ఎముకలతో చేసిన పనిముట్లు మచ్చల చింతామణి (కర్నూల్) లో లభించాయి.
మధ్య శిలాయుగం
• సుమారుగా క్రీస్తు పూర్వం 10,000-8,000 మధ్య గల కాలం .
• ఈ యుగంలొ మానవుడు సంఘ జీవిగా మారాడు .
• నిప్పును తెలుసుకున్నాడు.
• ఆహారాన్ని కాల్చటం ప్రారంభించాడు.
• చనిపోయిన వారిని కాల్చటం ప్రారంభించాడు .
• ఈ యుగంలో ప్రధాన వృత్తులు -వేట , చేపల పట్టుట ,ఫలాల సేకరణ .
• ఈ యుగంలో ఉపయోగించిన వస్తువుల పరిణామం తక్కువగా ఉండుట వలన 'సూక్ష్మ శిలాయుగం ' అని పేరు వచ్చింది .
• జంతువులను మచ్చిక చేయటం ప్రారంభించాడు .మొదటి జంతువు కుక్క .
• ఈ యుగానికి చెందిన ప్రాంతాలు
1.వింధ్య పర్వతాలు
2.చోటా నాగపూర్
3.బగోర్(రాజస్థాన్ ,పశు పోషణ)
4.ఆడంగార్(మధ్య ప్రదేశ్ )
• మధ్య ప్రదేశ్ లోని బింజెడ్కా గుహలలో ఈ యుగానికి చెందిన చిత్రాల పెయింటింగ్స్ కలవు . ఇక్కడ 700 గుహలు కలవు .
• వీటిని యునెస్కో ప్రపంచ వార సత్వ ప్రదేశం గా గుర్తించింది
నవీన శిలాయుగం
• దీనిని నియో లిథిక్ ఏజ్ గా ల్యూబెక్ వర్ణించాడు .
• ఈ యుగం క్రీస్తు పూర్వం 8,000 -4,000 వరకు ఉన్నది.
• కుండలను తయారు చేశాడు . కుమ్మరి చక్రం ను ఆవిష్కరించాడు.
• వ్యవసాయం ప్రారంభించాడు.
• కొడవలి వాడకం ప్రారంభమైంది.
• పశువుల పెంపకం ప్రారంభించాడు .
• భారత దేశం లో నవీన శిలాయుగపు ప్రాంతాలు - చిరంద్(పాట్న), సింగనకల్లు(మధ్య ప్రదేశ్)
బ్రహ్మ గిరి ,హల్లూర్,పిక్లీ హాల్(కర్నాటక)
• భారత దేశంలొ తొలి సారి కుమ్మరి చక్రం మెహ్రఘర్ (ఇప్పటి పాకిస్తాన్) లో లభించింది.మొదటి వ్యవసాయ క్షేత్రం ఇదే .
• ప్రపంచం లో మొదటి సారి వరిని పండించిన ప్రాంతం కొల్దివా (ఉత్తరప్రదేశ్ ,క్రీస్తు పూర్వం 5000 నాడు)
• నాగార్జున కొండలో కూడ భూమి లోపల ఇళ్ళ నిర్మాణం కనిపించింది
• ఆత్రంజి ఖేరాలో వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు లభించాయి.
హరప్పా పూర్వ నాగరికత లు
1.సోవన్ సంస్కృతి (పంజాబ్)
2.కుల్లీ సంస్కృతి
3.నాల్ సంస్కృతి
4.జెబ్ సంస్కృతి

లోహ యుగం

తామ్ర శిలా యుగం
• ఈ యుగంలో రాళ్ళూ,రాగి ఉపయోగించారు
• క్రీస్తు పూర్వం 4000-3000 సం|| మధ్య కాలం
• వీరి వృత్తి వ్యవసాయం ,పశు పొషణ
• కాల్చిన ఇటుకల తో గృహాల నిర్మాణం
• నదీ తీర ప్రాంతాలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు .
• రాగి గొడ్డళ్ళు ఉపయోగించారు .
• మానవుడు ఉపయొగించిన మొదటి లోహం రాగి .
ఈ యుగం సంబంధించిన ప్రదేశాలు .
1.అజర్ (రాజస్థాన్) - దీనికి మరో పేరు తంబావతి . తంబావతి అనగా రాగి గల ప్రదేశం.
2.గిలుంద్(రాజస్థాన్) - రాగి కత్తులు లభించాయి.
3.దైమాబాద్ (మహారాష్ట్ర ) -జోర్వే సంస్కృతి . కేంద్రాలలో పెద్దది .ఎద్దుపై దాడి చేసే పులి బొమ్మ కల్గిన పాత్ర లభించింది.
4.జోర్వే(మహారాష్ట్ర )- ఎరుపు నలుపు మత్తి పాత్రలు లబించాయి.పాత్రల పై చిత్ర రచనలు కంపించాయి.
కాంస్య యుగం:-
• తామ్ర శిలాయుగం తర్వాత కాంస్య యుగం ప్రారంభమైంది.
• ఇది క్రీస్తు పూర్వం 3000-2000 మధ్య ఉన్నతి దశ , 2000-1000 పతన దశ .
• ఈ యుగంలో మానవుడు ఉపయోగించిన ప్రధాన లోహం కాంస్యం
• కాంస్యం రాగి మరియు తగరంల మిశ్రమం
• భారత దేశం లో కాంస్య యుగానికి చెందిన నాగరికతయే సిందు నాగరికత .
ఇనుప యుగం:-
• కీస్తు పూర్వం 1000 తర్వాత కాలం
• అర్యుల నాగరికత ఇనుప యుగానికి చెందినది