దక్షిణ భారత దేశం-రాష్ట్రాలు

పల్లవులు క్రీ.శ (560-903) :-
• వీరి రాజధాని కంచి .వీరి రాజ చిహ్నం వృషభం
• ప్రాచీన పల్లవ రాజ్య స్థాపకుడు వీర కూర్చ వర్మ .
• ప్రాచీన పల్లవులలో గొప్పవాడు -శివస్కంద వర్మ.
• శివస్కంద వర్మ బిరుదు - మహారాజాధి రాజ .
• ఇతను మైద వోలు , మంచి కల్లు శాసనాలు వేయించాడు.
• సముద్ర గుప్తుని చే ఓడించ బడిన ప్రాచీన పల్లవ రాజు - విష్ణు గోపుడు .
• తిరిగి క్రీ.శ.560 లో కంచిలో పల్లవ రాజ్యాన్ని సింహ విష్ణువు స్థాపించాడు .వీరినే నవీన పల్లవులు అంటారు .

• నవీన చోళులు తోండై మండలం(కంచి ప్రాంతం ) ను పాలించారు .
• నవీన చోళ రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు .
• తోండై మండలం అనగా లతలను పూజించేవారు .
• తొండై మండల రాజును తొండమాన్ చక్రవర్తి అని అచ్చటి ప్రజలను తొండైయార్ అని అంటారు .
• ఇతని బిరుదు అవని సింహ
మహేంద్ర వర్మ ( క్రీ.శ 600-630 ):-
• ఇతని బిరుదులు - విచిత్ర చిత్త , గుణ భార , చిత్రకార్ పులి , అవని భాజ , చైత్యకారి .
• ఇతను మత్త విలాస ప్రహసనం అనే వ్యంగ్య నాటకాన్ని వ్రాసాడు .
• దక్షిణ భారత దేశంలో గుహలను తొలచి ఆలయాలు నిర్మించే సంస్కృతి ని ప్రారంభించాడు .
• మొదట ఇతను భైరవ కొండ గుహాలయం , ఉండవల్లిలో అనంతేశ్వర గుహాలయాన్ని నిర్మించాడు .
• మొదట ఇతను జైన మతస్థుడు .
• అప్పర్ అనే నాయనార్ ప్రభావంతో శైవ మతాన్ని స్వీకరించాడు .
• సిత్తన్న వాసల్ లో ఇతను వేసిన పెయింటింగ్ నాట్యం గూర్చి తెలుపుతుంది .
• ఇతని కాలం లోనే పల్లవులు మరియు పశ్చిమ చాళుక్యుల మధ్య వైరం పెరిగింది .
• క్రీ.శ.630 లో బాదామి చాళుక్య రాజు రెండవ పులకేసి పుల్లలూరు యుద్ధం లో ఇతనిని వధించాడు .
మొదటి నరసింహ వర్మ (క్రీ.శ 630-668):-
• ఇతని బిరుదులు మహామల్ల, వాతాపికొండ .
• ఇతను రెండవ పులికేశిని మణి మంగల యుద్ధం లో ఓడించి వధించాడు. అతని రాజధాని వాతాపి నాశనం చేసి వాతాపికొండ అని పేరు పొందాడు.
• శ్రీలంక పై దండెత్తి మార వర్మను ఓడించాడు .
• శ్రీలంక పై దండెత్తిన మొదటి పల్లమ రాజు ఇతనే .
• ఇతను తన పేరు మీదగా మామల్లపురం అనే తీర నగరాన్ని నిర్మించాడు .
• ఇతను మహాబలిపురం లో ఏక శిల నిర్మితములైన ఏడు రాతి కథలు లేదా పంచ పాండవ రాతి రథాలు నిర్మించాడు .
• ఇతని ఆస్థాన కవి భారవి .
• భారవి " కిరాతార్జునీయం " అనే సంస్కృత గ్రంధాన్ని రచించాడు .
• ఇతని కాలం లో కంచిని చైనా యాత్రీకుడు హుయాన్ త్సాంగ్ సందర్శించాడు.
రెండవ నరసిం హ వర్మ :-
• ఇతని బిరుదులు రాజ సింహ , ఆగమ ప్రియ .
• ఇతని నిర్మాణాలు 1. కైలాసనాధ దేవాలయం , కంచి .
• 2. తీర దేవాలయం , మహాబలి పురం
• 3.గంగావతరణ శిల్పం మహాబలిపురం
• ఇతని ఆస్థాన కవి దండి . దండి రచనలు దశ కుమార చరిత్ర , అవంతీ సుందరీ కధ .
నంది వర్మ :-
• ఇతనిని పల్లవ మల్లుడుగా పిలుస్తారు .
• ఇతను కంచిలో నిర్మించిన ఆలయాలు వైకుంఠ పెరుమాళ్ ఆలయం , ముక్తేశ్వర ఆలయం ,మాతంగేశ్వర ఆలయం .
• పల్లవులలో చివరి వాడైన అప రాజిత వర్మను చోళ రాజు ఆదిత్య చోళుడు ఓడించి పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు .
పల్లవులు - పరిపాలనా అంశాలు :-
• రాజుకు సహకరించుటకు మంత్రి పరిషత్ కలదు .
• మంత్రి పరిషత్ లో సభ్యులు అమాత్య , యువరాజు , కోశాధ్యక్ష , రధిక .
• వీరి కాలంలో గూఢాచారులను సంజరంతకులు అని పిలుస్తారు .
• రాజ్య భాగాలు - మండలాలు -నాడులు - గ్రామాలు .
• గ్రామాలలో మూడు రకాల సభలుండేవి .
• ఉర్ -భూస్వాముల సభ
• సభ - బ్రాహ్మణుల సభ
• నగరం - వర్తకుల సభ
• గ్రామ భోజక అనగా గ్రామ పెద్ద .
• ధర్మ శాసనాలు అనగా న్యాయాలయాలు .
• పల్లవులు కాలం నాటి వర్తక సంఘాలు - నానా దేవి , మణిగ్రాం
• వీరి కాలంలో ప్రదాన రేవులు నాగ పట్టణం , మహాబలి పురం .
• వీరి రాజ భాష సంస్కృతం .
• వీరి కాలాన్ని వాస్తు కళలో ప్రయోగాల యుగం అని పిలస్తారు .
• వీరి కాలం నాటి చిత్రాలు , పుదుక్కోట , చిత్తన్ వాసల్ లో గలవు .
• పాలనమలై లో తలగిరేశ్వర ఆలయం శివుని నాట్యం చేసే దృశ్యం అత్యంత గొప్పది .
• ఇది రెండవ నరసిం హ వర్మ కాలానికి చెందినది .
• పల్లవులది కేంద్రీకృత పాలన .
•వీరు బ్రాహ్మణులగుటచే వైదీక మతాన్ని ఆచరించారు .
• కంచి దేవాలయాల నగరం గా పేరొందింది .
• భారత తర్క శాస్త్ర పిత దిజ్ఞాగుడు ,నలందా విశ్వ విద్యాలయాధిపతి ధర్మపాలుడు కంచికి చెందినవారు .
•పల్లవుల కాలం లో భరత నాట్యం ,దేవదాసీ విధానం ,కర్ణాటక సంగీతం అమలులోకి వచ్చాయి .