పుష్య భూతి వంశం - హర్ష వర్ధనుడు
పుష్యభూతి వంశం :-
•
వీరి రాజధానులు 1.స్థానేశ్వర్ 2.కన్యాకుబ్జ.
•
పుష్య భూతి - ఇతను ఈ వంశ మూల పురుషుడు .
•
ప్రభాకర వర్ధనుడు :-
•
ఇతని బిరుదు - మహారాజాధిరాజు
•
ఇతను హణులను తరిమేసి 'హూణ హరిణి కేసరి ' అనే పేరు పొందాడు .
•
ఈయన భార్య యశోధర్ముని కుమార్తె యశోమతి దేవి .
•
వీరి సంతానం
•
1.రాజ్య వర్ధనుడు
•
2.హర్ష వర్ధనుడు
•
3.రాజ్య శ్రీ
•
రాజశ్రీ ని కనోజ్ పాలకుడు మౌఖరీ వంశానికి చెందిన గృహవర్మకు ఇచ్చి వివాహం జరిపించాడు .
•
ప్రభాకర వర్ధుని మరణంతరం రాజ్య వర్ధుణుడు రాజ్య బాధ్యతలు స్వీకరించే సమయంలో నే మాల్వా రాజు దేవ గుప్తుడు , గౌడ రాజు శశాంకుడు కనోజ్ పై దండెత్తి గృహ వర్మను వధించి రాజ్యశ్రీ ని బంధించాడు
•
రాజ్య వర్ధనుడు , కనోజ్ పై దండెత్తాడు గౌడ్ శశాంకుడు కుట్ర వల్ల రాజ్య వర్ధనుడు మరణించాడు .
•
హర్ష వర్ధనుడు :-
•
రాజ్య వర్ధనుడు తరువాత హర్ష వర్ధనుడు రాజయ్యాడు .అప్పుడు అతని వయస్సు 16 సo||
•
ఇటువంటి పరిస్థితులలో హర్షుడు కామరూప పాలకుడు భాస్కర వర్మ సహాయం తో దేవ గుప్తుడిని ఓడించాడు
•
మాళ్వా పాలకునిగా మాధవ గుప్తుడిని నియమించారు .
•
గౌడ శశాంకుని ఓడించి సోదరి రాజశ్రీ ని కాపాడాడు .
•
621 నుండి హర్షుడు స్థానేశ్వరం ,కానోజ్ రాజ్యాలు కలిపి పాలించాడు .
•
హర్షుడు రాజధానిని స్థానేశ్వరం నుంచి కనోజ్ కి మార్చాడు .
•
హర్ష శకం ను 606 లో ప్రారంభించినాడు .
•
హర్షుణి చరిత్రకు ఆధారాలు : -
•
బాణుని రచనలు
•
హర్షుని రచనలు
•
ఐహోలు శాసనం
•
హర్షుని బన్సీఖేరా మధుబన్ శాసనాలు హుయంత్సాంగ్ రచనలు .
•
ఐహోలు శాసనంలోని హర్షుని బిరుదు - సకలోత్తర పథేశ్వర
•
హర్షుడి ఆస్థాన కవులు -రచనలు
•
బాణుడు - హర్ష చరిత్ర ,కాదంబరి ,పార్వతీ పరిణయం
•
మయూరుడు - సూర్య శతకం
•
భర్తృహరి -సుభాషిత శతకం
•
దివాకరుడు ,మాతంగులు ఇతని ఆస్థాన కవులు
•
నలందా విశ్వ విద్యాలయం :-
•
ఇతను నలందా విశ్వ విద్యాలయ అభివృద్దికి 100 గ్రామాలను దానం చేశాడు .
•
ఈ విశ్వవిద్యాలయ పర్యవేక్షణకు శీలభద్రుడు ని నియమించాడు .
•
నలందా విశ్వ విద్యాలయం స్థాపించింది - కుమార గుప్తుడు .
•
నలందా విశ్వ విద్యాలయంలో పేరు పొందిన ఆచార్యులు-ధర్మ పాలుడు , ఆర్య దేవుడు .
•
నలందా విశ్వ విధ్యాలయ గ్రంధాలయం - ధర్మ్ గంజ్ .
•
నలందా విశ్వ విద్యాలయాన్ని నాశనం చేశింది - భక్తియార్ ఖిల్జీ.
•
ఉత్తర భారత్ దేశాన్ని పాలించిన ఆఖరి హిoదు చక్ర వర్తి .-హర్షుడు
•
పరిపాలన :-
•
హర్షుడు పరిపాలనలో గుప్తులను అనుసరించాడు.
•
ప్రధానాదాయం భూమి శిస్తు 1/6 వంతు
•
సమాజంలో స్త్రీ స్థానం దిగజారింది .
•
రాజ్య ఆదాయంలో హర్షుడు 1/4 వ వంతు పండితులకు విద్యా సంస్థలకొరకు ఖర్చు చేసేవాడు .