గుప్తుల యుగం

• గుప్తుల పరి పాలన కాలాన్ని భారత దేశం లో స్వర్ణ యుగంగా కావ్య యుగంగా అభివర్ణిస్తారు .
• గుప్తుల రాజధాని పాటలీ పుత్రం .
• రాజ భాష - సంస్కృతం
• గుప్తుల రాజ లాంఛనం - వరాహం .
1. శ్రీగుప్తుడు :-
• గుప్త రాజ్య స్తాపకుడు - శ్రీ గుప్తుడు .
• మహారాజ అనే బిరుదుతో కుషాణులకి సామంతుడిగా పాలించాడు . ఇతను మృగశిఖా వనం వద్ద చైనా యాత్రీకుల కొరకు ఒక దేవాలయం నిర్మించాడు .
• ఇతని పాలన గూర్చి చైనా యాత్రికుడు ఇత్సింగ్ తెలిపాడు .
2.ఘటోత్కచగుప్తుడు :-
• ఇతని బిరుదు మహారాజా
3.మొదటి చంద్ర గుప్తుడు :-
• క్రీ.శ. 319 లో రాజ్యానికి వచ్చి 320 లో మహా రాజాధిరాజ అనే బిరుదు తో స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఘనంగా పట్టాభిషేకాన్ని జరిపాడు .
• ఇతని పట్టాభి షేకాన్ని తెలియ చేయు గ్రంధం వజ్జకుని కౌముదీ మహోత్సవం .
• క్రీ.శ. 320 లో గుప్త శకం ను ప్రారంబించాడు . ఇతని రాజధాని పాటలీ పుత్రం .
• ఇతను లిచ్చవీ రాకుమార్తె కుమార దేవిని వివాహమాడి వారి మద్దతు పొందాడు .
• ఇతను కుమార దేవి బొమ్మతో బంగారు నాణెం ను జారీ చేశాడు .
4. సముద్ర గుప్తుడు (క్రీ.శ 330-370) :-
• ఇతను గుప్త రాజులలో అగ్రగణ్యుడు .
• సముద్ర గుప్తునిచే ఓడించ బడిన సోదరుడు - కచ గుప్తుడు
• ఇతని విజయాలని అలహాబాద్ శాసనం తెలియచేస్తుంది . ఈ శాసనమును ఇతని సేనాని హరి సేనుడు రచించాడు .
• ఇతని రాజ్యం హిమాలయాల నుండి భిల్సా వరకు పంజాబ్ నుండి బెంగాల్ వరకు విస్తరించింది .
• దక్షిణ భారత దేశంలో 12 రాజ్యాలను ఓడించాడు .
• వేంగీ రాజు హస్థి వర్మ , కంచి రాజు విష్ణు గోవుడు ఇతని చేతిలో ఓడించ బడ్డాడు .
• సముద్ర గుప్తునిచే ఓదించబడిన వాకాటక రాజు -రుద్ర సేనుడు (కౌశంబి యుద్ధం).
• ఆర్య వర్తనం లో 9 మంది నాగ రాజుల కూటమిని ఓడించాడు.
• 5 ఆటవిక రాజ్యాలను జయించ్నట్లు ఎరాన్ శాసనం తెలుపుతుంది.
• 9 గణ రాజ్యాలను జయించాడు .
• సముద్ర గుప్తిని చే ఆదరించబడిన బౌద్ధ పండితుడు - వసు బంధు .
బిరుదులు :-
• ఇండియన్ నెపోలియన్
• కవి రాజు
• వాగ్రహ పరాక్రమ
• అశ్వమేధ పరాక్రమ
సముద్రగుప్తుడు జారీచేసిన నాణేలు :-
• అశ్వమేధ చిహ్నం
• వీణను వాయిస్తున్న బంగిమలో సంగీత నాణెం .
5. రామ గుప్తుడు :-
• సముద్ర గుప్తుని పెద్ద కుమారుడు .
• ఇతనిని గూర్చి తెల్పుతున్నవి - విశఖతదత్తుని దేవీ చంద్ర గుప్తం , అమోఘ వర్షుని సంజాన్ శాసనం , బాణుని హర్ష చరిత్ర .
రెండవ చంద్ర గుప్తుడు : -
• ఇతనికి గల పేర్లు - దేవ రాజు , దేవస్రీ , దేవ గుప్తుడు .
• ఇతని బిరుదులు : సిం హ చంద్ర , శఖారి , విక్రమాదిత్య .
• వెండి నాణెలను జారీ చేసిన మొదటి గుప్త రాజు ఇతనే.
• ఇతని కాలం లో ఫాహియాన్ అనే చైనా యాత్రీకుడు భారత దేశానికి వచ్చాడు .
• ఇతని ఆస్థానం లో నవరత్నాలు అని పిలువబడే పండితులు కలరు .
వారు
1. కాళిదాసు
2. అమర సిం హుడు
3) శంకు
4 . ధన్వంతరి
5. వర రుచి
6. వరాహ మిహిరుడు
7. భేతాళ భట్టు
8.ఘట రక్షకుడు
9. క్షిపణికుడు
7. కుమార గుప్తుడు :- • నలందా విశ్వ విద్యాలయాన్ని నిర్మించాడు.
8.స్కంద గుప్తుడు :-
• సుదర్శన తటాకానికి మరమ్మత్తులు చేయించాడు
• హూణులను తరిమి కొట్టాడు .
• చివరి గుప్త పాలకుడు -విష్ణు గుప్తుడు
• హుణుల దండయాత్రల వలన ఈ రాజ్యం అంతం అయినది .
గుప్తుల పాలన :-
• ఈ కాలాన్ని స్వర్ణ యుగం అంటారు .
• వీరి రాజముద్ర -గరుడ ముద్ర
• బురుగజం ,తామ్రలిప్తి ప్రధాన ఓడరేవులు
సమాజం :-
• వీరి సమాజం లో వర్ణవ్యవస్థ తీవ్ర రూపు దాల్చింది .
• వైశ్యులు రాజ్యాధికారం పొందారు .
• వీరి కాలం లో హిందూ మతం పునరుద్ధరించబడినది .
• వీరి కాలం లో ముఖ్య వృత్తి వ్యవసాయం .
శాస్త్ర సాంకేతిక రంగాలు :-
• వీరి కాలం లో శాస్త్ర సాంకేతిక రంగం అద్భుత ప్రగతి సాధించింది .
• వీరి కాలం లో 0 ని కనుగొన్నారు .
• ఆర్యభట్టు పై విలువను కనుగొన్నాడు .
• వరాహ మిహిరుడు బృహత్ సహితలో ఖగోళ ,వృక్ష శాస్త్రముల గురించి వివరించాడు .
• ధన్వంతరి ఆయుర్వేదం అనే గ్రంధం రచించాడు .
• శుశృతుడు శస్త్ర చికిత్సలను వివరిస్తూ శుశృత సం హిత రచించాడు .