సంగం యుగం

• ప్రస్తుత తమిళనాడు , కేరళ ప్రాంతాలను ప్రాచీన కాలంలో దక్షిణ దేశం , ద్రావిడ దేశం , తమిళకంగా పిలువ బడినాయి . • క్రీ .పూ 2 నుండి 3 వ శతాబ్దం వరకు గల కాలాన్ని సంగం యుగంగా పిలుస్తారు . • మధురై కేంద్రంగా జరిగిన కవి పండిత పరిషత్ సమావేశాలకు సంగం అని పేరు . • సంగం యుగం లో 3 రాజ్యాలు కలవు . చోళ,చేర,పాండ్య . చోళులు : - • ప్రాచీన చోళుల రాజధాని - ఉరైయూరు . • తర్వాత వీరి రాజధాని కావేరి పట్టణం . • వీరి గుర్తు-పులి .
• వీరు ఆర్కట్ నుంచి తిరుచానపల్లి వరకు వ్యాపించి వున్న కావేరి డెల్టా ప్రాంతం ను పాలించారు .
• చోళ రాజ్య స్థాపకుడు ఎలారా
• ప్రాచీన చోళులలో అగ్రగణ్యుడు - కరికాల చోళుడు .
• ఇతను చేర పాండ్య రాజ్యాల కూటమిని వేణ్ణీ యుద్దంలో ఓడించాడు .
• సింహళ దేశం పై దండెత్తి 12,000 మందిని ఖైది చేశాడు .వీరి చేత పూహా అనే రేవు పట్టణం ను నిర్మించాడు .
• కావేరి నదికి 16 కి.మీ. ఆనకట్టలు నిర్మించి తంజావురు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడు .
చేర వంశం :-
• వీరు కొచ్చిన్ నుండి తిరువాంకుర్ మధ్య ప్రాంతాన్ని పాలించారు .
• సంగంలో అత్యంత ప్రాచీన రాజ్యం చేర రాజ్యం .
• వీరి రాజధాని వంజి .
• వీరి గుర్తు విల్లు , బాణం .
• చేర వంశ పాలనను స్థాపించింది - ఉదివాంజెరల్
• చేర రాజులలో సెంగుత్తవాన్ గొప్పవాడు .
• ఇతను " రెచ్చర " అనే బిరుదు ధరించాడు .
• ఇది అతని నౌకా బలాన్ని , సముద్రాది పత్యాన్ని సూచిస్తుంది .
• ఇతను కేరళాలో పత్తిణి దేవి ఆరాధనను ప్రవేశపెట్టాడు .
• ఇతని సోదరుడు ఇలంగో " శిలప్పాధికారం" అనే గ్రంధాన్ని రాశాడు.
పాండ్యులు :-
• వీరు కన్యాకుమారి ప్రాంతాన్ని పాలించారు .వీరి రాజధాని మధురై .
• వీరి అధికార చిహ్నం చేప .
• ఈ వంశం లో గొప్పవాడు నెడుంజెళియన్ .ఇతను తలెయలంగానం యుద్ధంలో చోళ , చేర రాజ్యాల కూటమిని ఓడించాడు .
• ఇతని ఆదరణలో మధురలో కవి పండితులు పోషించబడ్డారు
సంగం యుగం నాటి విశేషాలు :- • యుద్ధాలలో మరణించిన సైనికుల స్మారక చిహ్నాలుగా వీర కల్లులు నిర్మించి వాటిని ఆరాధించేవారు .
• ఈ యుగంలో రోం తో వ్యాపారం ఉన్నత స్థానం లో ఉంది .
• సంగం యుగ ప్రధాన దైవం -శివుడు ,మురుగన్
• ఈ కాలం లో తమిళ భాషలో అనేక రచనలు జరిగాయి .