కుషాణులు

• వీరు మధ్య ఆసియాలోని యూచి జాతికి చెందిన వారు .
• యూచి అనగా చంద్రుని తెగ అని అర్దం .
• కుషాణ రాజ్య స్థాపకుడు - కుజుల కాడ్ ఫైసిస్.
• ఇతని తర్వాత వేమా కాడ్పెసిస్ పరిపాలించాడు .
• వేమా కాడ్పెసిస్ సైవుడు .త్రిశూలదారి అయిన శివుని తో బంగారు నాణెం జారి చేశాడు .
• కుషాణ వంశం లో అగ్ర గణ్యుడు - కనిష్కుడు .
• కనిష్కుడు క్రీ.శ.78 లో సిం హాసనం అధిష్టించి శక యుగం ప్రారంభించాడు .
• ఈయన తొలి రాజధాని పురుష పురం . రెండవ రాజధాని మధుర .
• ఇతని బిరుదులు దేవ పుత్ర , రెండవ అశోకుడు , సీజర్ .
దండయాత్రలు :-
• కనిష్కుడు కాశ్మీర్ ను జయించి దానిని వేసవి విడిది చేసుకోని అక్కడే కనిష్కాపురం అనే పట్టణాన్ని నిర్మించాడు .
• మధ్య ఆసియాను జయించిన ఏకైక భారత రాజు -కనిష్కుడు
• చైనాపై దండెత్తిన మొదటి భారతీయ రాజు
• నాల్గవ బౌద్ధ సంగీతిలో బౌద్ధమతం హీనయానం,మహాయానం అనే శాఖలుగా చీలిపోయింది .
• ఈయన కాలం లో రాజభాష సంస్కృతం .
• కనిష్కుని ఆస్థాన వైద్యుడు చరకుడు .చరక సం హిత రాసాడు .
• ఆచార్య నాగార్జునుడు ఇతని ఆస్థాన పండితుడు .
• ఆచార్య నాగార్జనుడు మహాయాన సిద్ధాంత కర్త
• ఈ కాలం లో గాంధార శిల్పకళ బాగా వికసించింది .
• కుషాణులలో చివరివాడు వాసు దేవుడు .