శుంగ వంశం (క్రీ. పూ. 187-73 ) :-
•
మౌర్యులు అనంతరం మగధను శుంగ కణ్వ రాజులు పాలించారు .
•
శుంగ వంశ స్థాపకుడు - పుష్య మిత్ర శుంగుడు .
•
.ఇతడు బ్రాహ్మణ వంశానికి చెందిన వాడు .
•
పుష్య మిత్రుని రాజధాని మధ్య ప్రదేశ్ లోని విదిశ నగరం
•
పుష్యా మిత్రుడు వైదిక మతాన్ని పునరుద్ధరించాడు . రాజ బాష సంస్కృతం .
•
పుష్య మిత్రుడు సాంచీ , బర్హూత్ స్తూపాలకు వాస్తు పరమైన అలంకరణ తోరణాలు నిర్మించాడు .
•
పుష్య మిత్రుని అనంతరం అతని కుమారుడు అగ్ని మిత్రుడు తర్వాత వసు మిత్రుడు పాలించారు .
•
అగ్ని మిత్రుడు మాళవికల ప్రేమ కధను కాళిదాసు "మాళవికాగ్నిమిత్రం" అనే నాటకంలో వివరించాడు .
•
శుంగుల కాలం లో విష్ణువు ప్రధాన దేవుడు .భాగవతం ప్రాచుర్యం పొందింది .
•
కణ్వ వంశం :-
•
స్థాపకుడు :వాసు దేవుడు .
•
రాజధాని -పాటలీ పుత్రం .
•
కళింగ రాజ్యం - ఖార వేలుడు .
•
ప్రాచీన కళింగ రాజ్య స్థాపకుడు - మహ మేఘ వాహనుడు .
•
పూరీ, కటక్ ,గంజం , ఉత్తరాంద్రా జిల్లలను కళింగ రాజ్యం అని పిలిచే వాడు.
•
ఈ రాజ్యంలో ప్రధాన పాలకుడు ఖార వేలుడు .
•
ఖార వేలుడు ఇతను చేది వంశానికి చెందిన వాడు .
•
ఇతని బిరుదులు కలింగాధిపతి , కలింగ చక్రవర్తి , మూషికాధిపతి , బిక్షురాజు .
•
ఇతను 13 వ రాజ్య సంవత్సరంలో హతీ గుఫా శాసనం ను ఉదయగిరి పర్వతాలలో జారి చేశాడు .
•
ఉదయ గిరికి గల మరి యొక పేరు ఏనుగుల గుహ .