మౌర్యుల యుగం (క్రీ.పూ 321-క్రీ.పూ 184)
• మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్ర గుప్తమౌర్యుడు .
వీరి చరిత్రకు సంభందించిన ఆధారాలు:-
1. కౌటిల్యుని అర్ద శాస్త్రం - ఇది పరి పాలనా గ్రంధం . రాజనీతిని వివరించే గ్రంధం . మౌర్యుల పరిపాలను తెలుపుతుంది.
2. మెగస్థనీస్ ఇండికా - మౌర్యులు కాలం నాటి పాటలీ పుత్రం ఇతర నగరాలను తెల్పుతుంది .
3. హేమ చంద్రుని 'పరిశిష్ట పర్వన్ ' - చంద్ర గుప్త మౌర్యుడు జైన మత స్వీకరణ గురించి తెల్పుతుంది .
4. విశాఖ దత్తుని ముద్రా రాక్షసం - నంద రాజ్య నిర్మూలన గూర్చి వివరిస్తుంది .
5. కళ్హణుని 'రాజ తరంగిణి ' - చంద్ర గుప్తుని తండ్రి
శకుని అని తెల్పుతున్నది.
6. బౌద్ధ గ్రంధాలు ' దివ్య వదన , అశోక వదన ' - అశోకుని గురించి ఉంది .
7. రుద్రదాముని జునాఘడ్ శాసనం- సుదర్షన తటాకం గురించి.
8. అశోకుని శాసనాలు -14 శిలా శాసనాలు , 7 స్థంభ శాసనాలు మౌర్యుల గురించి వివరిస్తున్నాయి.
• మౌర్యుల చరిత్రను గురించి తెలిపే విదేశీ గ్రంధాలు -
టాలమీ-జాగ్రఫీ,
జస్టీన్-ఎపిటోం ,
ప్లూటార్క్ -ది లైవ్స్ ,
ప్లీనీ - నాచురల్ హిస్టరి.
చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూ. 321-298):-
• ఇతను మౌర్య సామ్రాజ్య స్థాపకుడు .
• చాణక్యుని సహాయంతో క్రీ.పూ 321 లో ధన నందుడిని తరి మేసి మగధకు రాజయ్యాడు .
• చాణక్యుని ప్రధాన మంత్రిగా నియమించాడు .చాణక్యుని ఇతర పేర్లు కౌటిల్యుడు , విష్ణు గుప్తుడు .
• కౌటిల్యుని బిరుదు
ఇండియన్ మాఖియ వెల్లి .
• ఇతన్ని
ఇండియన్ బిస్మార్క్ అని జాకబ్ వర్ణించాడు
• చంద్ర గుప్త మౌర్యుడు చాణుక్యుడు రాసిన అర్ద శాస్త్రం ఆధారంగా పాలనను నిర్వహించాడు .
• ఇతను క్రీ.పూ 305 లో మగధపై దండెత్తిన సిరియా రాజు మరియు అలెగ్జాండర్ సేనాని అయిన సెల్యూకస్ నికేటర్ ను ఓడించాడు .
• ఓటమి చెందిన సెల్యూకస్ తన కుమార్తె హెలీనాను ఇతనికిచ్చి వివాహం జరిపించెను .
• సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్తుని దగ్గరకు మెగస్తనీస్ అనే రాయబారిని పంపాడు.
• మెగస్తనీస్ అప్పటి భారత దేశ పరిస్థితులను వివరిస్తూ ఇండికా అనే గ్రంధం రాశాడు .
•పాటలీ పుత్ర పరిపాలన గూర్చి ఇండికా గ్రంధం తెలుపుతుంది .
•గ్రీకులు చంద్ర గుప్తుడిని శాండ్ర కోటస్ అని పిలిచేవారు .
• ఇతను సుదర్శన తటాకాన్ని గుజరాత్ లో తవ్వించాడు .
•ఇతను జైన మతాన్ని తీసుకున్నాడు . ఇతనికి జైనమత దీక్ష ఇచ్చిన గురువు- భద్ర బాహు .
•చంద్ర గుప్తుడు తొలి జైన సమావేశాన్ని క్రీ.పూ 300 లో పాటలీ పుత్రంలో నిర్వహించాడు .
•క్రీ . పూ 300 లో రాజ్యాన్ని కుమారుడు బిందు సారుడు కి ఇచ్చి శ్రావణ బెల్గోళ వెళ్ళి అచ్చట సల్లేఖన వ్రతం ఆచరించి మరణించాడు .
బిందు సారుడు (క్రీ.పూ 298-273):-
•ఇతను అజీవక మతాన్ని స్వీకరించాడు
•ఇతను పశ్చిమ ఆసియాతో సత్సంభంధాలు ఏర్పరచుకున్నారు
•ఇతని కాలంలో డైమోకస్ అనే గ్రీకు రాయబారి సిరియా నుంచి వచ్చాడు . డైమోకస్ ను పంపిన సిరియా రాజు ఆంటి యోకస్ 1.
• వధువు , అత్తిపండ్లు , వేదాంతిని పంపమని బిందుసారుడు అనగా , ఆంటి యోకస్ మధువు, అత్తిపండ్లను మాత్రమే పంపాడు .
• ఇతని కాలంలో తక్ష శిల లో గొప్ప తిరుగు బాటు జరిగింది .
• ఈ తిరుగుబాటు అణచి వేసినది - అశోకుడు .
• బిందు సారుని బిరుదులు - అమిత్రఘాత , సిం హ సేన
• గ్రీకులు ఇతడిని
అమిత్రకేటస్ అని పిలిచేవారు .
• క్రీ.పూ 273 లో బిందు సారుడు అనారోగ్యానికి గురవటంతో ఇతని కుమారుల మధ్య వారసత్వ యుద్ధం మొదలైంది.
అశోకుడు (క్రీ.పూ 269-232):-
• అశోక అనగా దుఖః లేని వాడు .
•ఇతను తన 99 మంది సోదరులును సం హ రించి రాజైనట్లు సింహళ బౌద్ధ గ్రంధాలు మహా వంశ , దీపంశములు తెలుపుతు నాయి .
•సుశిమతో జరిగిన వారసత్వ యుద్ధంలో అతన్ని చంపి రాజయ్యాడు .
•క్రీ .పూ 261 లో దౌళీ (భువనేశ్వర్) వద్ద కలింగలో యుద్దం చేశాడు . ఈ యుద్దం లో జరిగిన రక్త పాతం అశొకుడిని కదిలించింది.
•కళింగ యుద్ధం తరువాత ఉపగుప్తుడు (నిక్రోధుడు) అనే బౌద్ధ గురువు నుండి బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు
•కళింగ యుద్ధం బౌద్ధ మత స్వీకరణ తెలుపుతున్న శాసనం - 13 వ నెంబర్ శిలాశాసనం
•క్రీ. పూ 250 లో పాటలీ పుత్రం వద్ద 3 వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు .
•ఈ సమయంలో బౌద్ధ మతం ప్రచారం కోసం విదేశాలకు రాయబారం పంపాడు .
ప్రచారకుడు | వెళ్ళిన దేశాలు |
మహేంద్ర ,సంఘమిత్ర | తామ్రపర్ణి (శ్రీలంక ) |
సోనా,ఉత్తర | సువర్ణ భూమి (బర్మా ) |
చారుమతి | నేపాల్ |
ఉపగుప్తుడు | చైనా |
మహాదేవుడు | మహిష మండలం (మైసూర్ ) |
మజ్జిమ | హిమాలయ ప్రాంతం |
మహా రక్కిత | గ్రీక్ |
మధ్యాంతిక | కాశ్మీర్,గాంధార |
మహాధర్మ రక్కిత | మహారాష్ట్ర |
• సంఘ మిత్ర అశోకుని కుమార్తె , మహేంద్రుడు అశోకుని కుమారుడు .
• బౌద్ధ బిక్షువు రూపంలో గల అశొకుని విగ్రహమ్ను చూచినట్లు ఇత్సింగ్ తెలిపాడు .(చైనా యాత్రీకుడు).
• భారత దేశంలో శిలాశాసనాలను మొదట జారి చేసినది
అశోకుడు
• అశోకుని శాసనాలు 47 ప్రదేశాలలో 181 దొరికాయి .
ఇవి 2 రకాలు
1 స్థంభ శాసనాలు
2) శిలా శాసనాలు
• అశోకుని శాసనాలలో కనిపించే భాషలు
ప్రాకృతం
గ్రీకు
అరబిక్
• క్రీ.పూ.232 లో రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి తూర్పు భాగాన్ని కుమారుడు కునాలుడుకి ,పశ్చిమ భాగం మనవడు దశరధునికి ఇచ్చెను .
సంప్రతి : -
• రెండు రాజ్యాలను కలిపాడు .
• వర్ధ మాన కొండను నిర్మించి జైన కేంద్రంగా రూపొందించాడు. ఇతనని జైన అశోకుడు అనే పేరుతో పిలుస్తారు
బృహద్రదుడు :
• మౌర్యులలో చివరి వాడు . ఇతని సేనాని పుష్య మిత్ర శుంగుడు క్రీ.పూ 180 లో ఇతడిని చంపి శుంగ వంశాన్ని స్థాపించాడు .
• పుష్య మిత్ర శుంగుడు అశ్వమేధ యాగాన్ని చేశాడు
• భారత దేశంలో అశ్వమేధ యాగం చేసిన మొదటి రాజు .
మౌర్యుల పాలన విశేషాలు :-
• మౌర్యుల కాలం నాటి ప్రధాన నణెములు - సువర్ణ (బంగారం) , ఫణ , కర్షాపణ(వెండి) , మాసికీ , కాకిణి (రాగి) .
• మౌర్యులు వసూలు చేసిన పన్నులు .
భాగ - పంటలో భాగం (భూశిస్తు).
బలి - రాజుకు స్వచ్చంగా చెల్లించేది .
కార - చేతి వృత్తుల వారి పై విధించునది.
విష్టి - నిర్భంద విధింపు
• మౌర్యుల కాలం నాటి ముఖ్యమైన రేవు పట్టణాలు - బరు కచ్చ , తామ్ర లిప్తి .
• మౌర్యుల రాజ భాష ,ప్రజల భాష -ప్రాకృతం
•అశోకుడు శిలాశాసనాలు వాటిపై అందమైన శిల్పాలు చెక్కించాడు.
సార నాధ్ - నాలుగు సిం హాలు .
రాంపూర్వ - ఎద్దు .
మౌర్య నమందన్ ఘర్ ఒకే సిం హం .
పాటాలీపుత్రం - చక్రం
శ్రావస్థి -వృషభం
ధౌలీ - ఏనుగు .
• కేంద్ర పాలన :-
మౌర్యుల పాలనకు ప్రధాన ఆధారాలు
1) అర్ధ శాస్త్రం
2) ఇండికా
3) అశోకుని శాసనాలు
• వీరిది కేంద్రీకృత పాలన రాజే సర్వాధికారి .
• రాజుకు పరిపాలనలో సహకరించుటకు పరిషత్ ఉంటుంది .
• ఇందులో ప్రధానమైన వ్యక్తులు
మంత్రి
పురోహితుడు
యువరాజు సేనాని
రాష్ట్ర పాలన :-
• వీరి రాజ్యాన్ని 4 ప్రదాన భాగలుగా విభజించారు.
తక్ష శిల - ఉత్తర పథ రాజధాని .
ఉజ్జయిని - అవంతి పథ రాజధాని
ధౌసాలి -కలింగ పథ రాజధాని
సువర్ణగిరి దక్షిన పథ రాజధాని .
సైనిక వ్యవస్థ : -
• ప్లీనీ ప్రకారం 30,000 అశ్వదళం , .ఆరు లక్షల కాల్బలం ఉండేది .
• వ్లూటర్క్ ప్రకారం 80 వేల అశ్వదళం 6 వేల గజ బలం ఉందేది .
• సైనికుల జీతాలు 500 ఫణాలు .
న్యాయ పాలన :-
• ఇక్కడ రాజే సర్వోన్నత అధికారి
• శిక్షలు కఠినం గా ఉండేవి
ఆర్దిక వ్యవస్థ :-
• ముఖ్య వృత్తి వ్యవ సాయం .
• వ్యాపారంలో ముఖ్య పాత్ర వర్తక సంఘాలు పోషించేవి వీటినే శ్రేణులు అంటారు .
• భూమి శిస్తు 1/4 నుంది 1/6 వంతు .