విదేశీ దండ యాత్రలు

పారశీకులు : -
• భారత దేశం పై దండెత్తిన మొదటి విదేశీయులు - పారశీకులు (పర్షియా-ఇరాన్)
• పారశీక చక్రవర్తి 'సైరస్ ది గ్రేట్' క్రీ.పూ 540 లో గాంధారను జయించినాడు .
• భారత దేశం పై ప్రప్రధమంగా దండ యాత్ర చేసిన మొదటి విదేశియుడు ఇతడే .
• ఈయన కుమారుడు డేరియస్-1 క్రీ.పూ 516 లో సింధూ నదికి పశ్చిమ దిశలో గల పంజాబ్ , సింధు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు .
• సింధు నది ముఖ ద్వారం నుండి ఈజిప్ట్ వరకు సముద్ర మార్గంలో ప్రయాణించింది - స్కైలాక్స్
• పారశీకుల ద్వారా మన దేశంలో " కుడి నుంచి ఎడమకు రాసే " ఖరోష్టి లిపి ప్రవేశించింది .
అలెగ్జాండర్ దండయాత్ర :-
• 4 వ శతాబ్దపు నెపోలియన్ , ప్రపంచ విజేతగా ప్రసిద్ధి చెందిన అలెగ్జాండర్ గ్రీక్ లో మాసిడోనీయా రాజు అయిన ఫిలిప్ -2 , ఒలంపియా దంపతులకు క్రీ.పూ 356 లో జన్మించాడు.
• అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ .
• అలెగ్జాండర్ తండ్రి మరణాంతరం క్రీ.పూ 336 లో తన 20 వ యేట రాజు గా పట్ఠాభిషిక్తుడు అయ్యాడు .
• 'నియార్కస్ ' అనే నౌకాధిపతి అలెగ్జాండర్ దండ యాత్రలను వివరించాడు .
ఓని సీక్రిటిశ్ అనే రచయిత అలెగ్జాండర్ జీవిత చరిత్రను వివరించాడు
• అలెగ్జాండర్ క్రీ.పూ 330 లో పర్షీయా రాజు మూడవ డేరియస్ ను అరభేలా యుద్ధంలో ఓడించాడు.
• క్రీ.పూ 327 లో భారత సరిహద్దులలోకి ప్రవేశించాడు .
• అలెగ్జాండర్ తో యుద్ధం చేయకుండా లొంగి పోయిన తక్ష శిల పాలకుడు అంబి.
• పురుషోత్తముడు జీలం , చీనాబ్ నదుల మధ్య ప్రాంతాన్ని పాలించాడు .
• క్రీ.పూ 326 లో అలెగ్జాండర్ పురుషోత్తముడును(పోరస్) జీలం(హైడస్పస్) యుద్ధంలో ఓడించాడు .
• ఈ యుద్ధంలో అంభి పురుషోత్తమునకు వ్యతిరేకంగ అలెగ్జాండర్ కు సహాయపడి భారత దేశంలో
మొదటి దేశ ద్రోహి గా పిలవబడ్డాడు .
• సైన్యం నిరాకరించటంతో అలెగ్జాండర్ భారత దేశం నుండి వెనుతిరిగి వెళ్ళేటప్పుడు 323 లో 33 వ యేట బాబిలోనియా లో మరణించాడు .
• అలెగ్జాండర్ దండ యాత్రల కాలంలో మగధ పాలకుడు - ధననందుడు .
• అలెగ్జాండర్ దండ యాత్రల వలన ఇరు దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు అబివృద్ది చెందాయి .
• గ్రీకులు దండ యాత్ర వలన భారత దేశంలో గంధార శిల్ప కళ అభివృద్ది చెందింది. (గాంధార= ఆఫ్గనిస్తాన్)
• ఎరియన్ కర్టియస్ అలెగ్జాండర్ అనంత పరిణామాలను తమ రచనలో తెలిపారు .
• భారత దేశంలో అలెగ్జాండర్ ప్రతినిధి - పిలిప్సన్
• సింధూ జలాల గుండా ప్రయాణించిన అలెగ్జాండర్ సేనాని- సెల్యూకస్ నికేటర్ .