• గతమును గూర్చి అధ్యయనం చేయునది చరిత్ర.
• గతానికి వర్తమానానికి మధ్య జరిగే నిర్విరామ సంభాషణే చరిత్ర-EH కార్
• చరిత్ర పితామహుడు -హెరిడోటస్ (గ్రీస్).
• History అనే పదం ఇస్తోరియా అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది , ఇస్తొరీయా అనగా అన్వేషణ, పరిశోధన
• భారతదేశంలో మొదటి చరిత్ర కారుడు-కల్హణుడు .
• ఇతను కాశ్మీర్ దేశ చరిత్రను ఒక క్రమ పద్దతిలో రాజ తరంగినిలో వివరించాడు .
మనవుని - ఆవిర్భావం - పరిణామ దశలు:-
• భూమిని మొదటి గా లార్వా ఆవిర్భవించింది.
• ప్రపంచంలో మొదటి మానవుడు ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఉద్భవించాడు .
• భారత దేశంలో మొదటి మానవుడు నివశించిన ప్రాంతాలు
1.మహారాష్ట్ర లోని బోరి ప్రాంతం
2.శివాలిక్ పర్వత ప్రాంతమైన మల్షాయిబాగ్ (కాశ్మీర్ )
• లిపి ఆదారంగా చరిత్ర 3 రకాలు
1.చారిత్రక పూర్వ యుగం :-
• వ్రాయటం తెలియని కాలం అనగా లిపి లేని కాలం
• దీనిని అధ్యయనం చేయుటకు పురావస్తు శాస్త్రం (ఆర్కియాలజీ ) , మానవ ఆకృతి శాస్త్రం
(ఆంత్రోపాలజీ ) సహకరిస్తాయి .
• భారత దేశంలో ఆర్కియాలజి శాఖను 1861 లో స్థాపించారు .
• కన్నింగ్ హోం ను భారత పురావస్తు శాస్త్ర పితామహుడు గా వర్ణిస్తారు.
• దీనిని మరలా లార్డ్ కర్జన్ 1901 లో పునరుద్ధరించాడు .అప్పుడు సర్.జాన్ మార్షల్ అధ్యక్షుడు .
• 1904 లో ప్రాచీన కట్టడాల సంరక్షణ చట్టం చేశారు.
• భారత రాజ్యంగంలోని ఆదేశిక నియమాలలో గల "ఆర్టికల్ 49" ప్రాచీన చారిత్రక ప్రదేశాలను సంరక్షణ గూర్చి తెలియ చేస్తుంది .
2.చారిత్రక యుగం:-
• మానవునికి చదవటం వ్రాయటం తెలిసిన కాలం.
• ఈ యుగాన్ని అధ్యయనం చేయటానికి సహకరించునవి.
1.ఎపిగ్రఫీ - శాసనాల అధ్యయనం . భారత దేశంలో మొదటి శాసనాలు అశోకునికి చెందినవి .
2.న్యూమిస్ మాటిక్స్ -నాణేల అధ్యయనం
3.పాలియోగ్రఫి -పురాతన వ్రతలను అధ్యయనం చేయునవి.
• ఈయన అధ్యయనం కు నాణేలు,శాసనాలు,వాజ్ఞ్మయ ఆధారాలు గ్రంధాలు సహకరిస్తాయి .
• భారత దేశంలో మొదటిగా శాసనాలు అశోకుడు జారీ చేశాడు .
• భారత దేశంలోబంగారు నాణేలను జారి చేసింది - ఇండో గ్రీకులు .
చారిత్రక సంధి యుగం :-
• పూర్వ చారిత్రక యుగం , చారిత్రక యుగా నికి మధ్య గల కాలాన్ని చారిత్రక సంధి యుగం అంటారు .
• ఈ యుగ ప్రధాన లక్ష్యం లిపి ఉంటుంది కాని అర్దం కాదు .
• సి.జె.థాంసన్ (డెన్మార్క్ , ప్రాక్ చరిత్ర పిత) ప్రాచీన చరిత్రను మూడు భాగాలుగా విభజించాడు.
1.రాతి యుగం
2.కాంస్య యుగం
3.ఇనుప యుగం
కాల నిర్ణయ పద్ధతులు :-
• రేడీయో కార్బన్ డేటింగ్(C14) :- జీవుల అవశేషాల అధారంగా వయసు నిర్ధారించే విధానం
• దీన్ని చికాగో విశ్వ విద్యాలయానికి చెందిన డబ్ల్యు.ఎఫ్ .లిబే అనే అతను 1947 లో రూపొందించాడు.
• ఇతనికి రసాయన శాస్త్రం లో నోబెల్ బహుమతి లభించింది .
• కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలం 5568 సంత్సరాలు .
• యురేనియం డేటింగ్ -శిలల వయస్సు నిర్ధారించే పద్దతి.
మానవ నాగరికత పరిణమంలో గల దశలు
శిలాయుగం :-
1)ప్రాచీణ శిలాయుగం
2) మధ్య శిలాయుగం
3)నవీన శిలాయుగం
లోహ యుగం :-
1)తామ్ర శిలాయుగం (సంధి యుగం),
2) కాంస్య యుగం
3)ఇనుప యుగం