Aksharam Educations

అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి






16వ ఆర్థిక సంఘం ఛైర్మన్​గా అరవింద్ పనగారియా


→నీతి ఆయోగ్ (ప్రణాళిక సంఘం)​ మాజీ వైస్​-ఛైర్మన్ అరవింద్‌ పనగఢియాను 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్​గా కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది.
→ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ రిత్విక్ రంజనం పాండే ఈ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని తెలిపింది.
→16వ ఆర్థిక సంఘం సభ్యుల వివరాలను ప్రత్యేకంగా నోటిఫై చేస్తామని వెల్లడించింది.
→ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన నోటిఫికేషన్​లో పేర్కొంది.

→16వ ఆర్థిక సంఘం ఛైర్మన్, ఇతర సభ్యులు బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి తుది నివేదిక సమర్పించే తేదీ వరకు లేదా 2025 అక్టోబర్ 31 వరకు ఆ పదవిలో ఉంటారు.
→ఈ సంఘం ఐదేళ్ల కాలానికి (2026-27 నుంటి 2030-31 వరకు) సంబంధించిన సిఫారసుల నివేదికను 2025 అక్టోబర్​లో రాష్ట్రపతికి అందిస్తుంది.
→ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్​లో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన విధివిధానాలకు (టర్మ్స్ ఆఫ్​ రిఫరెన్స్) ఆమోదం తెలిపింది.







అరవింద్ పనగఢియా గురించి :-
→అరవింద్ పనగఢియా 1952 సెప్టెంబర్ 30న జన్మించారు.
→1978 నుంచి 2003 వరకు మేరీలాండ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం విభాగంలో అధ్యాపకుడిగా పనిచేశారు.
→ఈ సమయంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్- IMF​, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్- UNCTADలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రిన్స్​టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్​డీ పట్టా పొందారు. 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్​గా పనిచేశారు. జీ20 షెర్పాగా తుర్కియే (2015), చైనా (2016), జర్మనీ (2017) జరిగిన సమావేశాల్లో సంయుక్త ప్రకటనపై చర్చలు జరిపిన భారత బృందాలకు నాయకత్వం వహించారు.

భారత ఆర్ధిక సంఘం గురించి :-
→Formed - 22 November 1951; 72 years ago →Headquarters - New Delhi →భారత ఆర్థిక సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ, అర్ధ న్యాయ సంస్థ (Quasi Federal). ఇది ఒక సలహా సంస్థ.
→ఇది కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయ పెంపునకు తీసుకోవాల్సి చర్యలను సూచించడం సహా విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లను సమీక్షిస్తుంది. ప్రపంచంలో ఏ సమాఖ్య వ్యవస్థలోనూ ఇలాంటి అధికారాలతో ఏర్పడిన సంస్థ మరొకటి లేదు.


ఇప్పటి వరకూ పని చేసిన ఆర్ధిక సంభం చైర్మన్ లు మరియూ వారి కాలము

Finance Commission Year of establishment Chairman Operational duration
First 1951 K. C. Neogy 1952–57
Second 1956 K. Santhanam 1957–62
Third 1960 A. K. Chanda 1962–66
Fourth 1964 P. V. Rajamannar 1966–69
Fifth 1968 Mahaveer Tyagi 1969–74
Sixth 1972 K. Brahmananda Reddy 1974–79
Seventh 1977 J. M. Shelat 1979–84
Eighth 1983 Y. B. Chavan 1984–89
Ninth 1987 N. K. P. Salve 1989–95
Tenth 1992 K. C. Pant 1995–00
Eleventh 1998 A. M. Khusro 2000–05
Twelfth 2002 C. Rangarajan 2005–10
Thirteenth 2007 Dr. Vijay L. Kelkar 2010–15
Fourteenth 2013 Dr. Y. V Reddy 2015–20
Fifteenth 2017 N. K. Singh 2020–25
Sixteenth 2023 Arvind Panagariya 2026 - 31