Aksharam Educations

అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
18వ జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు


↪జీ-20 (గ్రూప్ ఆఫ్ 20)దేశాధినేతల 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు- 2023 సెప్టెంబర్ 9-10 తేదీల్లో భారత్ రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో జరిగింది.
↪భారత్ లో ఈ సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి.
↪వసుధైక కుటుంబం పేరుతో "ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే - (One Earth-One Family-One Future)" (థీమ్)తో 2023 ఏడాది జీ-20 శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు.
↪జీ-20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కలిపి మొత్తం 20 దేశాల ప్రభుత్వాలు సభ్యులుగా ఉన్నాయి.
↪ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ (యూకే), అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్యదేశాలుగా కొనసాగు తున్నాయి.
↪భారత్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో జీ-20 సభ్య దేశాల అధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధులు పాల్గొన్నారు.
↪జీ-20 సభ్యదేశాలతో పాటు ఇతర ఆహ్వానిత దేశాల అధినేతలు ,అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.
↪జీ-20 సభ్యదేశాలతో పాటు.. బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్లను కూడా సదస్సు కోసం భారత్ ఆహ్వానించింది.
↪భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీజిన్ పింగ్ మినహా అందరూ హాజరయ్యారు.
↪రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సమావేశాలకు హాజరు కాబోరని ఆ దేశం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ విషయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంట్ నేపథ్యమే ఇందుకు కారణం. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్లో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. అయితే వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు.
↪ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, అంతర్జాతీయ ఫూ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అధినేత క్రిస్టాలినా జార్జీవా, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఆఫ్రికన్ యూనియన్(ఏయూ) ఛైర్ పర్సన్ అజాలీ అస్సౌమ ఈ సదస్సుకు హాజరయ్యారు.
↪ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జీ-20 శిఖరాగ్ర సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 9న ప్రారంభించారు.
↪ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఇండియాకు బదులుగా 'భారత్' అనే నేమ్ బోర్డు ఉంచారు.
↪జీ-20లో 55 సభ్య దేశాల ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) చేరికతో ఐరోపా సమాఖ్య (ఈయూ) తర్వాత రెండో అతిపెద్ద బహుళ దేశాల కూటమిగా విస్తరించినట్లయింది.

జీ-20 కూటమిలో 'ఆఫ్రికన్ యూనియన్'కు శాశ్వత సభ్యత్వం

↪ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)ను జీ-20 కూటమి శాశ్వత సభ్యురాలుగా కొత్తగా చేర్చుకుంది. 2023 సెప్టెంబర్ 9న దీనిపై అంగీకారం కుదిరింది.
↪జీ-20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కలిపి మొత్తం 20 దేశాల ప్రభుత్వాలు సభ్యులుగా ఉన్నాయి.
↪కొత్తగా ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించారు.
↪తద్వారా ప్రపంచంలో దక్షిణ భాగంలో ఉన్న కీలక కూటమిని, ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలను ఒకేచోటుకు చేర్చినట్లయింది.
↪2023 INDIA 1999లో ఆవిర్భావం తర్వాత జీ-20 కూటమిని విస్తరించడం ఇదే తొలిసారి.

జీ-20 'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు ఆమోదం

↪ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జీ-20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్ సెప్టెంబర్ 9న పెద్ద విజయాన్ని నమోదు చేసింది.
↪పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటన (జాయింట్ డిక్లరేషన్)పై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది.
↪జీ-20 దేశాధినేతల 18వ శిఖరాగ్ర సదస్సులో, ప్రపంచ శాంతి, సౌభాగ్యమే ధ్యేయంగా వివిధ కీలక అంశాలతో కూడిన 'న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్'కు అధికారికంగా కూటమి సభ్యదేశాల ఆమోదం లభించింది.

'ప్రపంచ జీవ ఇంధన కూటమి' ఏర్పాటు

↪ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది.
↪'ప్రపంచ జీవ ఇంధనాల కూటమి(గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్)'ని ప్రకటించింది.
↪భూతాపానికి, తద్వారా పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకోవాలని ఇందుకోసం పెట్రోల్ 20 శాతం ఆథనాల్ కలిపి వాడుకోవాలని ప్రపంచ వేశాలకు విజ్ఞప్తి చేసింది.
↪జీ-20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఒకే భూమి(వన్ ఎర్త్) అంశంపై జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 9న జీవ ఇంధనాల కూటమిపై ప్రకటన చేశారు.
↪ఈ కూటమిలో జీ-20 సభ్యులంతా భాగం కావాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు.

↪2015లో ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగిన సదస్సులో ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్ఏ)ను ఏర్పాటు చేసింది.
↪అదే తరహాలో ఇప్పుడు ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రకటించింది.
↪ప్రపంచ జీవ ఇంధన కూటమిలో వ్యవస్థాపక సభ్యులుగా అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), అమెరికా ఉన్నాయి. కెనడా, సింగపూర్ పరిశీలక దేశాలుగా చేరాయి.
↪చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు ధీటుగా, దేశాల మధ్య వేగవంతమైన అనుసంధానమే ధ్యేయంగా భారత్, అమెరికా తదితర వేశాలు జీ20 సదస్సు వేదికగా ప్రతిష్టాత్మక ఆర్ధిక నడవా(ఎకనామిక్ కారిడార్)ను ఏర్పాటు చేశాయి.

జీ-20 దేశాధినేతల 18వ శిఖరాగ్ర నదస్సులో ఐదు కీలక విజయాలు

1) జీ20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం..
2) అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్, అరటి దేశాలను కలుపుతూ రైలు, నౌకాయాన అనుసంధానత కల్పన.
3) ప్రపంచ జీవ ఇంధన కూటమి ఆవిర్భావం.
4) ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు కీలక సమస్యలపై పోరాటానికి ఢిల్లీ డిక్లరేషన్.
5) పర్యావరణం, వాతావరణ మార్పులపై పరిశీలనకు జీ-20 అటిలైట్ మిషన్

↪క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచార వ్యవస్థ క్రిప్టో అసెట్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ (CARF) ఏర్పాటును వేగంగా అమలు చేయాలని జీ-20 సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి.
↪ఆర్థికేతర ఆస్తులపై సమాచార మార్పిడిని పో 2027 నాటికి ప్రారంభించాలని నిర్ణయించాయి.
↪జీ-20 సదస్సు సందర్భంగా సెప్టెంబర్ 9న ఢిల్లీలో అంగరంగ వైభవంగా చక్ర తీర్చిదిద్దిన ప్రగతి మైదాన్లోని భారత్ మండపం వద్ద జీ-20 కూటమి దేశాధినేతలు, అతిధులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్కు ఘనంగా విందు ఇచ్చారు.
↪నలంద విశ్వవిద్యాలయ చిత్రాలతో పాటు వసుధైక కుటుంబం ఒక అనే థీమ్ ముందు నిల్చుని విందుకు వచ్చిన అతిథులకు రాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు.
↪భారత్ అధ్యక్షకన ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 10వ ముగిసింది.
↪ ప్రధాని నరేంద్ర ఇందుకు గుర్తుగా చెక్కతో రూపొందించిన అధికార దురాన్ని (చిన్న ముత్తి ఆకారంలోని గవెల్ ను) ఆ దేశాధ్యక్షుడు లూయి ఇనాసియో దీని ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు.
↪ జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ 2023 డిసెంబర్ 1వ అధికారికంగా చేపట్టనుంది.
↪ బ్రెజిల్ లో సాగరతీర నగరమైన రియో డీ జనీరోలో జీ-20 తదుపరి సమావేశం 2024 నవంబరులో జరగనుంది.

'జీ-20 సమితి'లో పాల్గొన్న ఇద్దరు మహిళా రైతులు

↪ప్రపంచ దేశాధ్యక్షులు పాల్గొనే 'జీ-20 సమితిలో పాల్గొనే అవకాశం ఇద్దరు మహిళా రైతులకు దక్కింది.
↪ఓడిశాకు చెందిన గిరిజన మహిళా రైతులు రైమతి ఘురియా, సుబాసా మోహన్తా'లకు ఈ అరుదైన గౌరవం లభించింది.
↪సంప్రదాయ, గిరిజన చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగు పద్ధతులను జీ-20 వేదికపై ఈ ఇద్దరు ప్రపంచ దేశాలకు వివరించారు.

సదస్సులో ప్రధాన ఆకర్షణగా కోణార్క్ చక్రం

↪జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రగతి మైదాన్ వేదికగా నూతనంగా నిర్మితమైన భారత్ మండపం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానం పలికారు.
↪వారికి స్వాగతం పలికే ప్రదేశంలో బ్యాక్ గ్రౌండ్లో కోణార్క్ చక్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
↪దేశ సంస్కృతిని ప్రతిబింబించే అనేక చిహ్నాలను ఈ మండపం వద్ద ఏర్పాటు చేశారు. వాటిల్లో ఈ చక్రం కూడా ఒకటి.
↪కోణార్క్ చక్రాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గాంగుల రాజవంశానికి చెందిన కళింగ రాజు సరసింహదేవ-1 పాలనలో రూపొందించారు.
↪దీని భ్రమణం.. సమయం, పురోగతి, నిరంతర మార్పును సూచిస్తుంది. ఈ సూర్య చక్రంలో 24 కమ్మీలు ఉంటాయి. ఈ చక్రం భారతదేశ జాతీయ జెండాలో కూడా కనిపిస్తుంది.
↪ఈ చక్రం భారతదేశ పురాతన విజ్ఞానం, అధునాతన నాగరికత, నిర్మాణ నైపుణ్యానికి చిహ్నంగా నిలుస్తుంది.
↪భారత రూపాయి నోట్లపై కూడా ఈ కోణార్క్ చక్రం కనిపిస్తుంది. ఒకప్పుడు 20 రూపాయల నోటుపై ఇది కనిపించింది.
↪అలాగే ఆపై 10 రూపాయల నోటుపై కూడా దీనిని ముద్రించారు. కోణార్క్ ఆలయంలోని ఈ చక్రాన్ని ఆధారంగా చేసుకుని సమయాన్ని లెక్కిస్తారని చెబుతారు.
↪ చక్రం పరిమాణం 9 అడుగుల 9 అంగుళాలు ఉంటుంది. 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయని అంటారు.
↪ ఆలయంలోని 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని చెబుతారు.

వాతావరణ పరిశీలనకు 220 ఉపగ్రహం

↪వాతావరణ పరిశీలనకు 'జీ-20 ఉపగ్రహాన్ని(జీ-20 శాటిలైట్, ప్రయోగిస్తామని భారత్ ప్రతిపాదించింది.
↪'జీ-20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్'ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
↪దక్షిణార్థ గోళ దేశాలకు సాయం చేయడం దీని ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
↪చంద్రయాన్ మిషన్ నుంచి వచ్చిన డేటా తరహాలో జీ-20 ఉపగ్రహం వల్ల మానవాళికి ప్రయోజనం కలుగుతుంది అని వివరించారు