ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం విజయవంతo
→ సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 'సూర్యయాన్-1' పేరుతో తొలిసారిగా చేపట్టిన ఆదిత్య-ఎల్) ప్రయోగం విజయవంతమైంది.
→ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) సీ-57 వాహకనౌక ద్వారా 1,480 కిలోలు బరువు కలిగిన భారత తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహం 'ఆదిత్య -ఎల్1' ను నిర్దేశిత భూ కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది.
→ తొలుత ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి 2023 సెప్టెంబర్ 2న ఉదయం 11:30 గంటలకు PSLV సీ-57 వాహకనౌక ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది.
→ వెంటనే మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు రాకెట్ గమనాన్ని పరిశీలించారు.
→ నాలుగు దశలతో కూడిన ప్రయోగాన్ని 01.03.31 గంటల వ్యవధిలో పూర్తి చేశారు.
→ ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని గంటా మూడు నిమిషాల వ్యవధిలో భూమికి దగ్గరగా (పెరిజీ) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్లు ఎత్తులో ఎసిన్స్టిక్ ఎర్త్ బౌండ్ అర్బిట్(అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు.
→ ఇది 16 రోజుల పాటు భూమిచుట్టూ తిరిగి అవసరమైన వేగం పుంజుకొని సూర్యుడి వైపు ప్రయాణం మొదలు పెడుతుంది.
→ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ బిందువు (ఎల్-1) చుట్టూ ఉన్న కక్ష్యలో ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు.
→దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది.
→దీనివల్ల సౌర చర్యలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించొచ్చు.
→15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంలో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి.
→ఇందులోని నాలుగు పేలోడ్లు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన మూడు పేలోడ్లు ఎల్1 వద్ద కణాలు, క్షేత్రాల అధ్యయనాలు నిర్వహిస్తాయి.
→ఆదిత్య-ఎల్1లో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాష్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్లు ఉన్నాయి.
→ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణమండలం) సహా వెలుపల ఉండే కఠోనానూ అధ్యయనం చేస్తాయి.
→యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది.
→బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్లో ఆదిత్య- ఎల్1 ఉపగ్రహాన్ని రూపొందించారు.
→ఆదిత్య-ఎల్-1 ప్రయోగానికి ఇస్రో వెచ్చించిన మొత్తం రూ.378 కోట్లు
→అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 90వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది.
ఆదిత్య-ఎల్1 విశేషాలు
→ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం బరువు - 1,475 కేజీలు
→సూర్యుడికి ఉన్న మరో పేరే అనే బిందువు వద్ద ప్రవేశ పెడుతున్నందున ఎల్ అని.. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి ఉప గ్రహమైనందున '1' అని పెట్టారు. దీని పూర్తి పేరు ఆదిత్య-ఎల్.).
→బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (URSC)లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు.
→URSC సెంటర్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.శంకర సుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఆదిత్య-ఎల్1 ఉపగ్రహానికి రూపకల్పన చేశారు. URSC సెంటర్లో పని చేస్తున్న శంకర సుబ్రమణియన్ శాటిలైట్ సెంటర్ స్పేస్ ఆస్ట్రానమీ గ్రూపు (సాగ్)కు నాయకత్వం వహిస్తున్నారు. శంకర్ సుబ్రమణియన్ గతంలో ఖగోళ పరిశోధనకు ఉపయోగించిన అస్ట్రోశాట్ అనే ఉపగ్రహాన్ని, చంద్రయాన్-1, చంద్రయాన్-2 మిషన్లకు అనేక హెూదాల్లో పని చేశారు. ఆదిత్య-ఎల్1 మిషన్ ఐదో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.
→సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-L1 ఉపగ్రహంతో ఇస్రో 7 అత్యాధునిక పేలోడ్లను పంపింది. అవి.
1. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్ (VELC)
2. సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT)
3. సోలార్ లో ఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్)
4. హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (హీలియోస్)
5. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ (ASPEX)
6. ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య (PAPA)
7. అడ్వాన్స్డ్ ట్రై ఆక్సియల్ హై రెజల్యూషన్ మాగ్నెటోమీటర్
PSLV పీ-57 రాకెట్ వివరాలు
→'ఆదిత్య-ఎల్ 1' ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) రకం రాకెట్ను వినియోగించారు. పీఎస్ఎల్పీలో ఇది అత్యంత శక్తిమంతమైనది.
→2008లో చంద్రయాన్-1 మిషన్లో, 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)లో ఈ రకం రాకెట్లనే వినియోగించారు.
→సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) సీ -57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు దీనిని నాలుగు దశల్లో ప్రయోగించారు.
→మొదటి, మూడో దశలు పన ఇంధనంతో.. రెండు, నాలుగు దశలు ద్రవ ఇంధనంతో నిర్వహించారు.
→రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైన 1,03,31 గంటల్లో (3,799,52 సెకన్లు) ప్రయోగాన్ని పూర్తి చేశారు.
→ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్లో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన యువకుడు ఎస్పీ మనోజవర్మ పాలు పంచుకున్నారు.
→ఉష్ణోగ్రహ పేలోడ్లలో ఒకటైన 'సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్' (SUTTI రూపకల్పనలో ఆయన కీలకపాత్ర పోషించారు.
→కోల్కతాలోని ఆస్ట్రనామికల్ ఇన్ స్ట్రుమెంటేషన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసి, బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్లో పీహెచ్డీ చేశారు.